By: ABP Desam | Updated at : 10 Aug 2021 07:46 AM (IST)
పెట్రోల్ డీజిల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత 20 రోజులుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. డీజిల్ ధరల విషయంలో కూడా స్థిరత్వమే ఉంటోంది. హైదరాబాద్‌లో కూడా కొద్ది రోజులుగా నిలకడగా ఉంటున్న ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లోని ఇంధన మార్కెట్‌లో తాజాగా పెట్రోల్ లీటరుకు రూ.0.15 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగింది.
తెలంగాణలో ఆగస్టు 10న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.98 కాగా.. డీజిల్ ధర రూ.98.10 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.15 పైసలు పెరిగి రూ.105.86కు చేరుకుంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.97.97 వద్ద ఉంది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా స్థిరంగానే ఉంది. కొద్దిరోజులుగా వరంగల్‌లో ఇవే ధరలు నిలకడగా ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.0.45 వరకూ పెరిగాయి. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.42 పైసలు పెరిగి రూ.99.59 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.45 పైసలు పెరిగి రూ.107.59 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఏపీలో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో మార్పులు కనిపించలేదు. పెట్రోల్ ధర రూ.0.14 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.108.30 గా నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.13 పైసలు పెరిగి రూ.99.87కు చేరి స్థిరంగా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో గత రెండ్రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉంటున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.47గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.67 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.62 పైసలు పెరిగి రూ.99.05గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో భారీగా పెరుగుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో లీటరుకు రూపాయిన్నర వరకూ భారీ పెరుగుదల కనిపించగా.. సోమవారం నాటి ధరలే మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. లీటరు పెట్రోలు ధర రూ.110.00 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర కూడా రూ.1.37 పైసలు పెరిగి రూ.101.34గా ఉండి రూ.వంద దాటేసింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 10 నాటి ధరల ప్రకారం 66.73 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Cryptocurrency Prices: ఆదివారం స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు, బిట్‌కాయిన్ ఎంత పెరిగిందంటే?
Petrol-Diesel Price, 26 June: నేడు చాలాచోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - మీ ప్రాంతంలో ధరలు ఇలా
Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?
DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!
Credit, Debit Card Update: డెబిట్, క్రెడిట్ కార్డుల కొత్త ప్రాసెస్‌పై ఆర్బీఐ మరో అప్డేట్!
India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్ ఎవరు?
AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?
PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన