అన్వేషించండి

Petrol-Diesel Price, 1 March: క్రూడాయిల్ ధరలు మరింత పైకి, కానీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పెరుగుదల

Hyderabad Petrol Price: హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది.

గత నాలుగు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 95 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
హైదరాబాద్‌లో (Hyderabad Petrol Price) పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ (Warangal Petrol Price)  నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు (మార్చి 1) పెట్రోల్ ధర రూ.0.40 పైసలు తగ్గి రూ.107.75 గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.94.19 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.17 పైసలు పెరిగి రూ.109.93 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.16 పైసలు పెరిగి రూ.96.23 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.19 పైసలు పెరిగి రూ.110.60గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.17 పైసలు పెరిగి రూ.96.64 గా ఉంది.

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరు ధర నేడు రూ.0.35 పైసలు తగ్గి రూ.109.05 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా రూ.0.33 పైసలు తగ్గి రూ.95.18గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తాజాగా తగ్గాయి.

తిరుపతిలో తగ్గిన ధరలు (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు తగ్గాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.110.58 వద్ద ఉంది. నేడు లీటరుకు రూ.0.60 పైసలు పెరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.56 పైసలు తగ్గి రూ.96.60 కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా మార్చి 1 నాటి ధరల ప్రకారం 96.5 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
ABP CVoter Opinion poll  :  అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా -  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
Weather Latest Update: నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్RCB vs SRH IPL 2024: మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్Travis Head Century vs RCB IPL 2024: రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ లో మరోసారి బలైన RCB, 25 పరుగులతో ఓటమిRCB vs SRH Match Highlights | ఆర్సీబీ పై 25 పరుగుల తేడాతో SRH చారిత్రక విజయం | IPL 2024 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
ABP CVoter Opinion poll  :  అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా -  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
Weather Latest Update: నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
IPL 2024: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం
హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం
Hyderabad News: మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
OnePlus Price Cut: ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
Pawan Kalyan: సీఎంపై రాయి దాడికి బాధ్యత వారిదే, ముందు ఆ నలుగురిని విచారణ చేయాలి - పవన్ కల్యాణ్
సీఎంపై రాయి దాడికి బాధ్యత వారిదే, ముందు ఆ నలుగురిని విచారణ చేయాలి - పవన్ కల్యాణ్
Embed widget