By: ABP Desam | Updated at : 27 Apr 2023 03:21 PM (IST)
కేంద్రమంత్రిని కూడా క్యూ కట్టించిన ఆ పథకం ఏంటి?
MSSC Scheme: మహిళలు, బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. తాజాగా, 2023 బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) మరొక పథకాన్ని ప్రతిపాదించారు. ఆ పథకం పేరు 'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్'. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
కేంద్ర మహిళ & శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani), పార్లమెంట్ స్ట్రీట్‌లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి 'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్' పథకం కింద ఒక ఖాతా తెరిచారు.
లైన్‌లో నిలబడి ఖాతా ప్రారంభం
నిన్న (బుధవారం ఏప్రిల్ 26). సామాన్య ప్రజల మాదిరిగానే పోస్టాఫీసు వద్ద వరుసలో నిలబడి స్మృతి ఇరానీ ఈ ఖాతా తెరిచారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత, ఖాతా పాస్‌బుక్‌ను పోస్టాఫీసు సిబ్బంది కేంద్ర మంత్రికి అందించారు. మహిళలు, బాలికలు అత్యధిక సంఖ్యలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్' ఖాతా తెరిచిన తర్వాత, దానికి సంబంధించిన కొన్ని చిత్రాలను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కేంద్ర మంత్రి పంచుకున్నారు.
Opened Mahila Samman Saving Certificate (MSSC) account at Sansad Marg Post Office today.
— Smriti Z Irani (@smritiirani) April 26, 2023
MSSC scheme announced in Budget 2023-24 to commemorate 'Azadi Ka Amrit Mahotsav' is aimed at enhancing financial inclusion & providing better returns to women.
I urge women and young girls… pic.twitter.com/DB42XCW95W
మహిళల ప్రారంభించిన కోసం చిన్న మొత్తాల పొదుపు పథకం
'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్' పథకం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. కేవలం మహిళలు, బాలికలకు మాత్రమే ఈ స్కీమ్ పరిమితం. మహిళ లేదా బాలిక ఈ పథకంలో కనిష్టంగా రూ. 100 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. పెట్టుబడిదార్లు 7.5 శాతం వడ్డీని పొందుతారు. వడ్డీని, కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి లెక్కించి ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది స్వల్పకాలిక పొదుపు పథకం, కాల పరిమితి కేవలం రెండు సంవత్సరాలు. ఈ కాల పరిమితిని పెంచుకోవడానికి లేదు. మీరు ఏప్రిల్ 2023లో ఖాతాను తెరిస్తే, ఈ పథకం మెచ్యూరిటీ ఏప్రిల్ 2025లో ఉంటుంది. ఖాతా ఓపెన్ చేసిన ఒక సంవత్సరం తర్వాత, ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తం నుంచి కొంత డబ్బును ఉపసంహరించుకోవచ్చు.
ఈ ఖాతాను ఎలా ప్రారంభించాలి?
ఈ పథకం కింద పెట్టుబడికి వయోపరిమితి లేదు, ఏ వయస్సు మహిళలైన డబ్బు జమ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ లాగా దీనిని రూపొందించారు. ఈ పథకం కింద ఏ పోస్టాఫీసు లేదా ఏదైనా బ్యాంకు శాఖలోనైనా ఖాతా తెరవవచ్చు.
TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?
Form 16: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్ కూడా ఉంది
EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?
Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్ - మీ అకౌంట్ పరిస్థితేంటో చెక్ చేసుకోండి
Latest Gold-Silver Price Today 04 June 2023: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?