By: ABP Desam | Updated at : 30 Jul 2021 03:47 AM (IST)
ఇప్పుడు మీకు సైబర్ ఇన్సూరెన్స్ అవసరం
ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిదీ అందులోనే. అంతలా ఉపయోగం పెరిగినప్పుడు.. హ్యాకింగ్, సమాచారం దొంగిలించడం, ఆన్ లైన్ మోసాలు అధికమే కదా. వీటితో ఆర్థిక నష్టాలూ జరుగుతున్నాయి. అలాంటి నష్టాల నుంచి కాస్త ఉపశమనం పొందెందుకు దారి ఉంది. అదే సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్. కొన్ని రోజులుగా సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్ పాలసీలకు డిమాండ్ ఎక్కువైంది. సైబర్ సెక్యూరిటీ బీమా తీసుకోవటం కారణంగా ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ లయబిలిటీకి సంబంధించిన కవరేజీ లభిస్తుంది. సైబర్ హ్యాకింగ్, అటాక్ విషయంలో కవరేజీ అందుతుంది. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులనూ ఇన్సురెన్స్ కంపెనీలే చూసుకుంటాయి.
సైబర్ సెక్యూరిటీ ఇన్సురెన్స్ లు రెండు రకాలు..
పర్సనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఆన్ లైన్ వినియోగదారులు వర్తిస్తుంది. అంటే ఇంటర్నెట్లో డేటా, నగదు చోరీకి గురైతే ఇది వర్తిస్తుంది. సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఐటీ సంస్థలకు వర్తిస్తుంది.
కంప్యూటర్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించటం, తొలగించటం, మార్చటం, సోషల్ మీడియాలో జరిగే ఐడేంటిటీ చోరీకి ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి థర్డ్పార్టీపై కేసు నమోదు అయితే ప్రాసిక్యూషన్‌కు , రవాణా, డాక్యుమెంట్ల ఫొటో కాపీ ఖర్చులను సైబర్ ఇన్సూరెన్స్ ద్వారా పొందొచ్చు.
ఆన్లైన్ యూజర్లు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు, వేధింపుల విషయంలో కూడా థర్డ్ పార్టీపై న్యాయ పోరాటానికి కావాల్సిన ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది.
మాల్వేర్.. డిజిటల్ సేవలకు ఆటంకం కలిగించే ఓ సాఫ్ట్వేర్. ఇది సందేశాలు లేదా ఫైల్ ట్రాన్స్ఫర్, డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ల ద్వారా వస్తుంది. మాల్వేర్ ద్వారా డిజిటల్ సర్వీసెస్‌కు జరిగిన ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునేందుకు సైబర్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అనుమతి లేకుండా కంప్యూటర్లోకి చొరబడి థర్డ్ పార్టీలకు చెల్లింపులు చేయటం వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టాన్నికి కూడా సైబర్ బీమాతో ధీమా పొందొచ్చు.
అనుమతి లేకుండా యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్రెడిట్ కార్డుల వివరాలు పొందటం సెనిస్టివ్ సమాచారం యాక్సెస్ కావటం వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి సంబంధించిన కేసులో న్యాయపోరాటానికి కావాల్సిన ఖర్చులను ఇన్సూరెన్స్ సంస్థ నుంచి పొందొచ్చు. ఈ-మెయిల్‌ను ఫోర్జరీ చేయటం లేదా తారుమారు చేయటం ద్వారా మెయిల్ పొందిన వారు నిజమైన వారి నుంచే వచ్చింది అనుకోవటం ఈ-మెయిల్ స్పూఫింగ్. ఇలాంటి మెయిల్స్ వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి థర్డ్ పార్టీపై కేసు నమోదు అయితే ప్రాసిక్యూషన్ ఛార్జీలను బీమా సంస్థ చెల్లిస్తుంది.
ఇలా అయితే ఇన్సూరెన్స్ వర్తించదు
అంతర్జాతీయంగా, ఉదేశపూర్వకంగా జరిగిన దాడులకు సంబంధించి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తులు మోసపూరిత చర్యలకు పాల్పడకూడదు. పాలసీ కొనుగోలుకు ముందుగా జరిగిన దాడులను గాని, పాలసీదారుడు కోల్పోయిన డేటా, చిత్రాలను గాని పాలసీ కవర్ చేయదు. సరైన పాస్‌వర్డ్‌తో యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయకపోయినా, తగిన రక్షణ చర్యలు తీసుకోని సందర్భాల్లోనూ పాలసీ కవర్ చేయదు.
18 ఏళ్లు పైబడిన వ్యక్తులంతా సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. క్లెయిమ్ కోసం 90 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా దీనిని రాత పూర్వకంగా అందజేయాలి. నష్టానికి సంబంధించిన ఆధారాలు ఇన్సూరెన్స్ కంపెనీకి అందించాలి. విచారణ అనంతరం పాలసీ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు ఉంటేనే క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తారు. ఫోరెన్సిక్ రిపోర్టు, క్లెయిమ్ ఫారమ్, స్క్రీన్ షాట్లు, నష్టానికి సంబంధించిన వివరాలు క్లెయిమ్ కోసం అందించాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ క్లెయిమ్‌కు బీమా కంపెనీలు సాధారణంగా 30 రోజుల సమయాన్ని తీసుకుంటాయి.
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Keralam: కేరళలో కమ్యూనిస్టులకు మద్దతుగా బీజేపీ - రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే - ఏం జరిగిందంటే?
Sankranti 2026 : మకర సంక్రాంతి స్పెషల్.. నువ్వులతో చేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే
Mana Shankara Varaprasad Garu : సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ కొట్టారు - మెగాస్టార్, వెంకీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Ambati Rambabu Dance:చెబుతున్నాడు ఈ రాంబాబు, వింటున్నావా చంద్రబాబూ! తన మార్క్ డ్యాన్స్‌తో అదరగొట్టిన మాజీ మంత్రి