Paytm IPO: ఐపీఓ షేర్ల కేటాయింపు ఎలా? కొందరికి ఎందుకు కేటాయించరో చూడండి
ఐపీఓ ప్రక్రియ నిజంగా ఎలా జరుగుతుంది? దరఖాస్తుదారులకు ఐపీఓ షేర్లు ఎలా కేటాయిస్తారు? ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ యొక్క కేటాయింపు ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం.
ఫలానా కంపెనీ ఐపీఓకు వచ్చిందని అంటుంటారు కదా.. స్టాక్ మార్కెట్‌లో అవగాహన ఉన్నవారికి దీని గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. అయితే, ఓ కంపెనీ ఐపీఓకు ఎలా వస్తుంది. ఆ క్రమంలో షేర్ల ధరలు ఎలా నిర్ణయిస్తారు? దరఖాస్తు దారులకు సదరు షేర్లను ఎలా కేటాయిస్తారనే అంశంపై చాలా మందికి సందేహం ఉంటుంది. ఐపీఓకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆ షేర్లను దరఖాస్తు దారులకు ఎలా కేటాయిస్తారనే దానిపై ప్రత్యేక కథనం..
ఐపీఓను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఇది ప్రైవేటుగా నిర్వహించే ఓ సంస్థ. వివిధ సంస్థల షేర్లను కొనుగోలు చేయడానికి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రక్రియ ఇది. దరఖాస్తుదారులు వేలం వేయడానికి కేటాయించిన బ్యాంకులు, ఇంకా ఆన్‌లైన్‌లో ఈ ఐపీఓ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. మీరెప్పుడైనా ఐపీఓ షేర్ల కోసం దరఖాస్తు చేసినట్లయితే, మీకు చాలా సార్లు ఎటువంటి షేర్లు కేటాయించలేదని గమనించే ఉంటారు. అదే సమయంలో, అదే ఐపీఓ అప్లికేషన్‌లో మీ స్నేహితుడికి కొన్ని షేర్లు కేటాయింపు కావచ్చు. అయితే, ఈ ప్రక్రియ నిజంగా ఎలా ఎందుకు జరుగుతుంది? దరఖాస్తుదారులకు ఐపీఓ షేర్లు ఎలా కేటాయిస్తారు? ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ యొక్క కేటాయింపు ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం.
ఐపీఓలో షేర్ల కేటాయింపు ప్రక్రియ
ఒక సంస్థ సాధారణ ప్రజలకు ఐపీఓని ప్రారంభించిన తర్వాత, షేర్ల కోసం అన్ని బిడ్‌లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆపై ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా, దరఖాస్తుదారులు తప్పుగా సమర్పించిన చెల్లని బిడ్‌లు మొత్తం బిడ్ల సంఖ్య నుంచి తొలగిస్తారు. దీంతో, ఇప్పుడు ఐపీఓ కోసం విజయవంతమైన బిడ్‌లు మిగిలి ఉంటాయి.
కంపెనీ స్థితి పడిపోయేందుకు రెండు సందర్భాలు ఉంటాయి, అవి..
1. విజయవంతమైన మొత్తం బిడ్ల సంఖ్య అనేది.. ఆ సంస్థ ఆఫర్ చేసిన అన్ని షేర్ల సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉండడం..
2. విజయవంతమైన బిడ్ల సంఖ్య.. ఆ సంస్థ అందించే షేర్ల సంఖ్య కంటే మరీ ఎక్కువగా ఉండడం
మొదటి సందర్భంలో..
దరఖాస్తుదారులు చేసిన మొత్తం బిడ్ల సంఖ్య.. సంస్థ ఆఫర్ చేసిన షేర్ల సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటే, స్టాక్‌ల పూర్తి కేటాయింపు జరుగుతుంది. ఈ విధంగా, దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుడికి వాటాలు కేటాయిస్తారు.
రెండో సందర్భంలో..
దరఖాస్తుదారులు చేసిన మొత్తం బిడ్ల సంఖ్య ఆఫర్ చేయబడిన షేర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటే, షేర్ల కేటాయింపు ప్రక్రియకు మరింత ప్రణాళిక అవసరం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి కనీసం ఒక లాట్ కేటాయించాలని సెబీ లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. కాబట్టి, షేర్ల కేటాయింపునకు మరింత ప్రణాళిక అవసరం. ఈ రెండో సందర్భంలో ఇన్వెస్టర్లకు 5 లక్షల షేర్లు ఆఫర్ చేశారనుకుందాం. వీటిలో కనీస లాట్ పరిమాణం 50 అని అనుకుందాం. అప్పుడు కనీసం ఒక లాట్‌ని పొందే పెట్టుబడిదారుల గరిష్ట సంఖ్య = 5 లక్షలు/50 = 10,000 అవుతుంది. అంటే, 10 వేల మంది ఇన్వెస్టర్లకు కనీసం ఒక లాట్ కేటాయింపు జరుగుతుంది.
రెండో సందర్భంలో షేర్ల కేటాయింపు ప్రక్రియ రెండు రకాలుగా ఉంటుంది.
1. స్మాల్ ఓవర్‌సబ్‌స్క్రిప్షన్
దరఖాస్తుదారులు అందరికీ కనీస లాట్ పంపిణీ చేస్తారు. మిగిలిన షేర్లు ఒకటి కంటే ఎక్కువ లాట్‌లకు బిడ్ చేసిన పెట్టుబడిదారులకు దామాషా ప్రకారం కేటాయిస్తారు.
2. లార్జ్ ఓవర్‌సబ్‌స్క్రిప్షన్
ప్రతి దరఖాస్తుదారుడికి ఒక లాట్ కూడా కేటాయించలేని ఓవర్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న సందర్భంలో, లక్కీ డ్రా ద్వారా కేటాయింపు జరుగుతుంది. ఈ లాటరీ డ్రా ఎలాంటి పక్షపాతం లేకుండా కంప్యూటరీకరిస్తారు. అందువల్ల, లార్జ్ ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ సమయంలో, లాటరీ వ్యవస్థలో కొన్ని పేర్లు డ్రా చేయరు. దీనివల్ల చాలా మంది దరఖాస్తుదారులకు షేర్లు కేటాయింపు జరగదు.
షేర్ల కేటాయింపు జరక్కపోవడానికి కారణం
మీకు షేర్లు కేటాయించకపోతే రెండు కారణాలు ఉంటాయి అవి.. తప్పుడు డీమాట్ ఖాతా నంబర్, పాన్ నంబర్‌లో పొరపాట్లు లేదా ఐపీఓ కోసం సమర్పించిన చాలా దరఖాస్తులు చేసిన కారణంగా మీరు ఐపీఓ కోసం వేలం వేయడం చెల్లుబాటు కాదు. మరో కారణం.. లార్జ్ సబ్‌స్క్రిప్షన్ విషయంలో లక్కీ డ్రాలో మీ పేరు ఎంపిక అవ్వకపోవడం.
ఈ పొరపాట్లను ఇకపై మీరు చేయకుండా ఇప్పుడు ఐపీవో ద్వారా షేర్‌లను కొనుగోలు చేయవచ్చు. మీ దరఖాస్తు అంగీకరించకపోతే మీకు ఎందుకు లాట్‌లు కేటాయించలేదో పరిశీలించుకోండి.
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?