అన్వేషించండి

PAN-Aadhaar Linking: పాన్- ఆధార్ లింక్ చేయలేదా? మార్చి 31తో లాస్ట్, లేకపోతే భారీ ఫైన్!

పాన్- ఆధార్ లింక్ చేయడానికి తుది గడువు దగ్గర పడింది. మార్చి 31 లోపు లింక్ చేయకపోతే భారీగా ఫైన్ పడే అవకాశం ఉంది.

పాన్- ఆధార్ అనుసంధానం చేశారా? చెయ్యకపోతే ఈరోజే పూర్తి చేయండి. ఎందుకంటే ఆధార్- పాన్ అనుసంధానానికి మార్చి 31 తుది గడువు. ఒక వేళ ఈలోపు అనుసంధానం చెయ్యకపోతే పాన్ పనిచేయడం ఆగిపోతుంది. అంతేకాదు లేట్ ఫీజు కూడా భారీగా చెల్లించాల్సి వస్తుంది.

పాన్-ఆధార్​​ అనుసంధానానికి ఇంతకుముందు 2021 సెప్టెంబర్​ 30ని తుది గడువుగా ప్రభుత్వమే నిర్ణయించింది. అయితే ఆ తర్వాత మళ్లీ దాన్ని పొడిగించింది.

లింక్ చేయకపోతే

గడువులోపు పాన్-ఆధార్​​ లింక్ చేయకపోతే.. ఆలస్య రుసుము కింద రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక బిల్లు 2021లో సవరణలు చేసి.. సెక్షన్​ 234హెచ్​ను ప్రభుత్వం కొత్తగా చేర్చింది. గడువులోపు ఈ ప్రక్రియ పూర్తవకుంటే.. పాన్​ నిర్వీర్యం అవుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి పాన్​ను ఐటీ సేవలకు వినియోగిస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 272బీ ప్రకారం.. రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

పాన్ లింక్ ఎలా? 

కొత్త ఇన్​కం ట్యాక్స్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportalను ఓపెన్​ చేయాలి

లింక్ ఆధార్ ఆప్షన్​ను ఎంచుకోవాలి.

అందులో.. ఆధార్​, పాన్ వివరాలు నింపాలి.

తర్వాత మొబైల్ నంబర్​ ఎంటర్​ చేయాలి.

ఆధార్ వెరిఫికేషన్​కు పేజీలో.. I agree to validate my Aadhaar details అనే ఆప్షన్​ను టిక్ చేయాలి.

ఆ తర్వాత లింక్ ఆధార్​ ఆప్షన్​పై క్లిక్​ చేస్తే సరిపోతుంది.

ఎస్​ఎంఎస్​ ద్వారా..

మీ మొబైల్ నంబర్​ నుంచి ఎస్​ఎస్​ఎస్​ పంపడం ద్వారా కూడా పాన్​-ఆధార్​ లింక్ చేయొచ్చు. ఇందుకోసం UIDPAN అని టైప్​ చేసి స్పేస్ ఇచ్చి.. 12 అంకెల ఆధార్​ నంబర్​ను, 10 అంకెల పాన్​ నంబర్​ను ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్​ను 567678 లేదా 56161కు పంపాలి. దీనితో పాన్-ఆధార్​​ లింక్ పూర్తవుతుంది.

లింక్​ స్టేటస్​ తెలుసుకోవడం ఎలా?

కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా లింక్​ ఆధార్​ స్టేటస్​పై క్లిక్​ చేసి.. ఆధార్​, పాన్​ నంబర్​లను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్​ క్లిక్ చేయడం ద్వారా లింక్ స్టేటస్​ తెలుసుకోవచ్చు.

ఎస్​ఎంఎస్ ద్వారా అయితే..

12 అంకెల ఆధార్​ నంబర్​ను ఎంటర్​ చేసి స్పేస్​ ఇచ్చి.. 10 అంకెల పాన్​ నంబర్​ను ఎంటర్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్​ పంపడం ద్వారా లింక్ స్టేటస్​ను తెలుసుకోవచ్చు.

Also Read: No Confidence Motion: లాస్ట్ ఓవర్లో ఇమ్రాన్ ఖాన్ బ్యాటింగ్- క్లీన్ బౌల్డ్ అవుతారా? మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారా?

Also Read: Hydrogen Car : దేశంలో ఇక హైడ్రోజన్ కార్లు - కిలో మీటర్ ఖర్చు రూ. రెండే !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget