అన్వేషించండి

UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో మహా విప్లవం - ఒకే బ్యాంక్ ఖాతా నుంచి ఐదుగురికి 'పేమెంట్‌ యాక్సెస్‌'

Digital Payments: ఇటీవల జరిగిన MPC సమావేశంలో UPIకి సంబంధించిన కొన్ని ప్రధాన నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ తీసుకుంది. ఇందులో డెలిగేట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది.

Delegate UPI Payment: భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న UPI (Unified Payment Interface) మరింత విప్లవాత్మకంగా మారింది. ఇప్పుడు, ఒకే బ్యాంక్‌ ఖాతాను యూపీఐ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా కుటుంబ సభ్యులు కూడా ఉపయోగించొచ్చు, చెల్లింపులు చేయొచ్చు. ఇటీవల జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC) సమావేశంలో UPIలో కొత్త సేవకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. 

మానిటరీ పాలసీ కమిటీ భేటీ తర్వాత, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ యూపీఐకి సంబంధించిన కొత్త నిర్ణయాలను ప్రకటించారు. యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు డెలిగేటెడ్ యూపీఐ చెల్లింపు (Delegate UPI Payment) సేవను ప్రారంభించాలని నిర్ణయించినట్లు కూడా వెల్లడించారు. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం, 'లిగేటెడ్ యూపీఐ పేమెంట్‌' ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు 'నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా' (NPCI) ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్‌ అంటే ఏంటి?
డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్‌ ఫీచర్‌ను "యూపీఐ సర్కిల్‌" అని కూడా పిలుస్తున్నారు. ఈ ఫీచర్ కింద, ఒక వినియోగదారు, తన బ్యాంక్‌ ఖాతా నుంచి యూపీఐ ద్వారా లావాదేవీలు చేయడానికి మరొక యూజర్‌కు (డెలిగేట్‌) అనుమతి ఇవ్వొచ్చు. ఇలా, గరిష్టంగా ఐదుగురికి డెలిగేట్స్‌గా అనుమతి ఇవ్వొచ్చు. 

డెలిగేట్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?
యూపీఐ డెలిగేట్‌ ఫీచర్‌ ద్వారా మీరు ఎవరికి అనుమతి ఇస్తారో, ఆ వ్యక్తులు వాళ్ల మొబైల్‌ ఫోన్‌లో యూపీఐ యాప్‌ను ఉపయోగించి మీ బ్యాంక్‌ ఖాతా నుంచి పేమెంట్స్‌ చేయొచ్చు. ఉదాహరణకు.. మీ అబ్బాయి/అమ్మాయి తన మొబైల్‌ ఫోన్‌లో యూపీఐని ఉపయోగించి స్కూల్‌ లేదా కాలేజీ ఫీజ్‌ కట్టొచ్చు. ఆ డబ్బులు మీ బ్యాంక్‌ ఖాతా నుంచి కట్‌ అవుతాయి. ఫీజ్‌ కట్టడానికి మీరు స్వయంగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ నాన్నగారిని/అమ్మగారిని/మీ భార్యను డెలిగేట్స్‌గా చేర్చుకుంటే.. ఇంటి ఖర్చులు లేదా ఇతర ఖర్చుల కోసం ఈ ఫీచర్‌ను వాళ్లు ఉపయోగించుకోవచ్చు. వాళ్ల ఫోన్‌ నుంచి యూపీఐని వాడినప్పుడల్లా డబ్బు మీ ఖాతా నుంచి కట్‌ అవుతుంది, మీరు స్వయంగా పే చేయాల్సిన అవసరం ఉండదు.

- ఈ ఫీచర్‌ ఇంకా ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదు, అతి త్వరలో అమల్లోకి వస్తుంది.
- ఒక వ్యక్తి (ప్రైమరీ యూజర్‌) గరిష్టంగా ఐదుగురు డెలిగేట్స్‌ను (సెకండరీ యూజర్లు) యూపీఐ సర్కిల్‌లో చేర్చవచ్చు.
- ఒక సెకండరీ యూజర్‌ ఒక ప్రైమరీ యూజర్‌ ఖాతాను మాత్రమే వినియోగించగలడు. 
- డెలిగేట్స్‌ (సెకంజరీ యూజర్లు) చేసే పేమెంట్ల మీద ప్రైమరీ యూజర్‌ గరిష్ట పరిమితి విధించొచ్చు.
- నెలకు గరిష్టంగా రూ.15 వేలు లేదా ఒక లావాదేవీలో గరిష్టంగా రూ.5 వేలు ఖర్చు చేసేలా పరిమితి పెట్టొచ్చు.
- సెకండరీ యూజర్లు చేసే చెల్లింపులన్నీ ప్రైమరీ యూజర్‌ పేమెంట్స్‌ హిస్టరీలో కూడా కనిపిస్తాయి.
- సెకండరీ యూజర్‌ చేసే చెల్లింపులకు పూర్తి అనుమతి (కంప్లీట్‌ డెలిగేషన్‌) ఇస్తే, అతను/ఆమె ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా చెల్లింపులు చేయొచ్చు. 
- పాక్షిక అనుమతి ఇస్తే, సెకండరీ యూజర్‌ పే చేసే సమయంలో ప్రైమరీ యూజర్‌కు ఒక నోటిఫికేషన్‌ వస్తుంది. దానిని ఓకే చేస్తేనే ఆ లావాదేవీ సక్సెస్‌ అవుతుంది.

ప్రస్తుతం యూపీఐ ద్వారా ప్రతిరోజూ దాదాపు 50 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత చెల్లింపుల వేగం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

మరో ఆసక్తికర కథనం: ఇంధనంపై యుద్ధ భయం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget