X

Supreme Court: మ్యుటేషన్ ద్వారా ఆస్తిపై హక్కు వర్తించదు.. సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

మ్యుటేషన్ ఎంట్రీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మ్యుటేషన్ ద్వారా ఎవరైనా ఒక వ్యక్తికి ఎలాంటి ఆస్తి హక్కు వర్తించదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

FOLLOW US: 

ఆస్తికి సంబంధించిన విషయాలపై కొందరికి కొన్ని అపోహలు ఉంటాయి. ఈ క్రమంలో మ్యుటేషన్ ఎంట్రీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మ్యుటేషన్ ద్వారా ఎవరైనా ఒక వ్యక్తికి ఎలాంటి ఆస్తి హక్కు వర్తించదని.. కేవలం పేరు మాత్రమే మారుతుందని, ఇది రెవెన్యూ రికార్డుల ఆర్థిక ప్రయోజనం కోసం మాత్రమే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

మ్యుటేషన్ అంటే ఇతరుల పేరు మీదకు ఆస్తి బదలాయింపు చేస్తున్నట్లుగా రాపించడం. దీనినే భూ బదలాయింపు అని కూడా పిలుస్తుంటాం. స్థానిక మునిసిపల్ కార్పొరేషన్‌లోని రెవెన్యూ రికార్డులలో పట్టాదారుడి పేరు మార్చడం, ఇతరుల పేరు మీదకి ప్రాపర్టీని బదలాయించే విధానమని అందరికీ తెలిసిందే. కానీ కేవలం మ్యుటేషన్ ద్వారా సంబంధిత వ్యక్తికి ఎలాంటి ఆస్తి హక్కు పూర్తి స్థాయిలో వర్తించదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

Also Read: చిన్న బ్యాంకులే.. కానీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు అదుర్స్.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కంటే అధిక వడ్డీ మీ సొంతం

ఓ వ్యక్తి మరణించిన తర్వాత వీలునామా ఆధారంగా ఆస్తి హక్కును క్లెయిన్ చేసుకోవచ్చునని.. ఇందులో ఎలాంటి వివాదం లేదని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. మ్యుటేషన్ (భూ బదలాయింపు) విధానం ద్వారా ఏ వ్యక్తికి ఎలాంటి హక్కు, వడ్డీ లాంటి ప్రయోజనాలు అందవు. కేవలం రెవెన్యూ రికార్డులలో ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే మ్యుటేషన్ చేస్తారని బెంచ్ తెలిపింది.

Also Read: Google Pay FD: గూగుల్ పే సరికొత్త సౌకర్యం.. బ్యాంక్ అకౌంట్ లేకున్నా 2 నిమిషాల్లో ఎఫ్‌డీ.. ఎలాగో తెలుసా 

ప్రాపర్టీకి సంబంధించి పేరు, హక్కు విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే.. వీలునామా ప్రకారం ఎవరికి ఆస్తి వర్తించాలో ఆ వ్యక్తి సంబంధిత కోర్టును సంప్రదించాలని సూచించారు. సివిల్ కోర్టుకు వెళ్లిన తరువాత మ్యుటేషన్ ఎంట్రీ జరిగిందా లేదా అని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. వీలునామాలో ఎవరికి ఆస్తి చెందాలని పేర్కొన్నారో వారికే, పూర్తి హక్కు ఉన్నట్లుగా పరిగణిస్తారు. రెవెన్యూ అధికారులకు పని సులభతరం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దరఖాస్తుదారుడు కోర్టును ఆశ్రయించడం ద్వారా హక్కు ఉందో లేదో తేలుతుంది.

Also Read: EPFO New Rules: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ గురించి తెలుసా? అలా చేయకపోతే ఆ డబ్బులు హాంఫట్! 

అయితే ల్యాండ్ మ్యుటేషన్లు భూ ఆదాయాన్ని సేకరించే ఉద్దేశ్యంతో ఎంట్రీలు చేసుకుంటారు. రెవెన్యూ రికార్డులలో ఈ మేరకు ఆస్తికి యాజమని ఎవరు లాంటి వివరాలను అధికారులు తెలుసుకుంటారని, అయితే కేవలం మ్యుటేషన్ ద్వారా ఆస్తిపై హక్కు వర్తించదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్థిక సరమైన వివాదాలు కచ్చితంగా సివిల్ కోర్టులలో పరిష్కారమవుతాయని, అందుకు రికార్డులు వారికి సాక్ష్యాలుగా ఉంటాయి. 

రెవెన్యూ రికార్డులలో ఒక వ్యక్తి పేరును మార్చాలని రేవా డివిజన్ అదనపు కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. అదనపు కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. 

Tags: supreme court Mutation Transfer Of Property Supreme Court On Mutation

సంబంధిత కథనాలు

Renault Kiger Vs Tata Punch: ఎక్స్‌క్లూజివ్: రెనో కిగర్ వర్సెస్ టాటా పంచ్

Renault Kiger Vs Tata Punch: ఎక్స్‌క్లూజివ్: రెనో కిగర్ వర్సెస్ టాటా పంచ్

Gold-Silver Price: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. మీ నగరాల్లో ఎంతంటే

Gold-Silver Price: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. మీ నగరాల్లో ఎంతంటే

Diwali Gift: దీపావళికి బహుమతి పొందారా.. ఆఫీస్‌లో బోనస్ ఇచ్చారా.. మరి పన్ను కట్టాలని తెలుసా?

Diwali Gift: దీపావళికి బహుమతి పొందారా.. ఆఫీస్‌లో బోనస్ ఇచ్చారా.. మరి పన్ను కట్టాలని తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Agni-5 Missile Launch: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. చైనాలోని ప్రధాన ప్రాంతాలను ఛేదించగల మిస్సైల్!

Agni-5 Missile Launch: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. చైనాలోని ప్రధాన ప్రాంతాలను ఛేదించగల మిస్సైల్!

Varudu Kaavalenu: రీతూవర్మలో ఆ క్వాలిటీ బాగా నచ్చిందన్న అల్లు అర్జున్

Varudu Kaavalenu: రీతూవర్మలో ఆ క్వాలిటీ బాగా నచ్చిందన్న అల్లు అర్జున్

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'