Meesho Grocery Business: మీషో షాక్! గ్రాసరీ వ్యాపారం మూసివేత, 300 ఉద్యోగుల తొలగింపు
Meesho Grocery Business: సోషల్ కామర్స్ కంపెనీ మీషో (Meesho) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గ్రాసరీ వ్యాపారమైన 'సూపర్ స్టోర్'ను మూసేసినట్టు తెలిసింది.
Meesho Grocery Business Shut Down: సోషల్ కామర్స్ కంపెనీ మీషో (Meesho) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గ్రాసరీ వ్యాపారమైన 'సూపర్ స్టోర్'ను మూసేసినట్టు తెలిసింది. నాగ్‌పుర్, మైసూర్ మినహా మిగతా నగరాలు, రాష్ట్రాల్లో సేవలు నిలిపివేసింది. ఫలితంగా వందల మంది ఉద్యోగులు ఉపాధి నష్టపోయారు. మీషో సూపర్‌స్టోర్‌ను నిలిపివేయడంతో 300 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని ఇంక్42 నివేదిక రిపోర్టు చేసింది.
గతంలో ఫార్మిసో పేరుతో మీషో గ్రాసరీ వ్యాపారం నిర్వహించింది. ఏప్రిల్‌లో దానిని సూపర్‌స్టోర్‌గా మార్చింది. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో నిత్యావసర సరుకుల డిమాండ్ తీర్చేందుకు ఇలా చేశామని తెలిపింది. విచిత్రంగా అదే నెలలో ఫార్మిసో నుంచి 150 మంది ఉద్యోగులను తీసేసింది. తమ ప్రధాన యాప్‌లో గ్రాసరీ వ్యాపారాన్ని విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్‌లో కంపెనీ 200కు పైగా ఉద్యోగులను తీసేసిన సంగతి తెలిసిందే.
'మీషో ఆదాయం తగ్గింది. సేవలు అందించేందుకు మరింత నగదు ఖర్చవుతోంది. అందుకే చాలా నగరాల్లో సేవలు నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం తీసుకొంది' అని ఇంక్42 తెలిపింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మీషో సూపర్ స్టో సేవలు అందించిన సంగతి తెలిసిందే.
'మీషో ఆదాయం తగ్గింది. సేవలు అందించేందుకు మరింత నగదు ఖర్చవుతోంది. అందుకే చాలా నగరాల్లో సేవలు నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం తీసుకొంది' అని ఇంక్42 తెలిపింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మీషో సూపర్ స్టో సేవలు అందించిన సంగతి తెలిసిందే.
ఉద్యోగాలు కోల్పోయినవారికి మీషో రెండు నెలల వేతనం పరిహారంగా అందించిందని ఇంక్24 వెల్లడించింది. కాగా ప్రధాన యాప్‌తో మీషో సూపర్‌స్టోర్‌ను ఇంట్రిగ్రేట్ చేస్తామని కంపెనీ సీఈవో విదిత్ ఆత్రేయ అన్నారు. 'కర్ణాటకలో పైలట్ ప్రాజెక్ట్ నుంచి ఆరు రాష్ట్రాల్లో సానుకూల స్పందనే లభించింది. ఇంటిగ్రేషన్‌తో మేం యూజర్లకు మంచి షాపింగ్ అనుభవం అందిస్తాం' అని ఆయన వెల్లడించారు. బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ఆరంభించినా 2022 చివరి నాటికి 12 రాష్ట్రాలకు విస్తరించాలని కంపెనీ భావించింది. కాగా ఈమధ్యే మీషో 100 మిలియన్ల యూజర్ల సంఖ్యను అందుకుంది. 2021, మార్చి నుంచి యూజర్ల సంఖ్య 5.5 రెట్లు పెరిగింది.
View this post on Instagram