Gold-Silver Prices Today 05 Nov: నగలు కొనేవాళ్లకు కలిసొస్తున్న కాలం, తగ్గిన పసిడి రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 1,05,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,580 వద్ద ఉంది.
Latest Gold-Silver Prices 05 November 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, ఫెడ్ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో అంతర్జాతీయ బంగారం మార్కెట్ స్తబ్ధుగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో, ప్రస్తుతం, ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,744 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలోనూ వర్తకులు, రిటైలర్ల నుంచి పసిడికి డిమాండ్ పెద్దగా కనిపించడం లేదు. ఈ రోజు, మన దేశంలో, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 160 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 150 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 120 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు 1,000 రూపాయలు తగ్గి రూ. 1,05,000 వద్దకు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,400 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,700 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 60,300 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,05,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,400 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 73,700 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 60,300 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,05,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 80,240 | ₹ 73,550 | ₹ 60,180 | ₹ 1,05,000 |
విజయవాడ | ₹ 80,240 | ₹ 73,550 | ₹ 60,180 | ₹ 1,05,000 |
విశాఖపట్నం | ₹ 80,240 | ₹ 73,550 | ₹ 60,180 | ₹ 1,05,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,355 | ₹ 8,024 |
ముంబయి | ₹ 7,355 | ₹ 8,024 |
పుణె | ₹ 7,355 | ₹ 8,024 |
దిల్లీ | ₹ 7,370 | ₹ 8,039 |
జైపుర్ | ₹ 7,370 | ₹ 8,039 |
లఖ్‌నవూ | ₹ 7,370 | ₹ 8,039 |
కోల్‌కతా | ₹ 7,355 | ₹ 8,024 |
నాగ్‌పుర్ | ₹ 7,355 | ₹ 8,024 |
బెంగళూరు | ₹ 7,355 | ₹ 8,024 |
మైసూరు | ₹ 7,355 | ₹ 8,024 |
కేరళ | ₹ 7,355 | ₹ 8,024 |
భువనేశ్వర్ | ₹ 7,355 | ₹ 8,024 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 7,019 | ₹ 7,581 |
షార్జా (UAE) | ₹ 7,019 | ₹ 7,581 |
అబు ధాబి (UAE) | ₹ 7,019 | ₹ 7,581 |
మస్కట్ (ఒమన్) | ₹ 7,090 | ₹ 7,549 |
కువైట్ | ₹ 6,814 | ₹ 7,434 |
మలేసియా | ₹ 7,085 | ₹ 7,432 |
సింగపూర్ | ₹ 7,071 | ₹ 7,785 |
అమెరికా | ₹ 6,898 | ₹ 7,318 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 390 తగ్గి రూ. 26,580 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తిర కథనం: ఫ్లిప్‌కార్ట్ రేట్లు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకలా, ఐఫోన్లలో మరోలా - ఎందుకిలా?