By: ABP Desam | Updated at : 23 May 2023 10:29 AM (IST)
₹2000 నోట్ల మార్పిడి, డిపాజిట్స్ షురూ
₹2000 Notes Exchange Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), 2000 రూపాయల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు గత శుక్రవారం (19 మే 2023) నాడు ప్రకటించింది. రూ.2000 నోట్ల డిపాజిట్, మార్పిడి ప్రక్రియ నేటి నుంచి (మంగళవారం, 23 మే 2023) నుంచి ప్రారంభం అయింది. ఏ బ్యాంకు శాఖకు వెళ్లయినా పింక్ నోట్లను మార్చుకోవచ్చు.
1. 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు, ఈ చట్టబద్ధమైన కరెన్సీని మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని RBI తెలిపింది. ఒక లావాదేవీలో గరిష్టంగా 10 పెద్ద నోట్లు లేదా రూ.20,000 వరకు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.
2. ఖాతాదార్లు తమ ఖాతాల్లో రూ. 2000 నోట్లను జమ చేయవచ్చు. దీనికి ఎటువంటి పరిమితిని RBI విధించలేదు. ఆ ఖాతాపై ప్రస్తుతం అమల్లో ఉన్న KYC నిబంధనలే రూ,2000 నోట్ల జమకూ వర్తిస్తాయి. నోట్లు మార్చుకోవడానికి ఎన్నిసార్లయినా క్యూలో వెళ్లవచ్చు. నోట్లు మార్చుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
3. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే రూ.2000 నోటును చలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం తెలిపారు. 2000 నోటు చెల్లుబాటు అయ్యే కరెన్సీగానే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి 4 నెలల సమయం ఉంది కాబట్టి ప్రజలు భయాందోళన చెందవద్దని, బ్యాంక్‌లకు వెళ్లడానికి తొందరపడొద్దని సూచించారు.
4. నోట్ల మార్పిడి అనుగుణంగా తగినంత మొత్తంలో చిన్న నోట్లు అందుబాటులో ఉన్నాయని గవర్నర్ చెప్పారు. ఒక దఫాలో రూ.20,000 వరకు విలువైన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారం నింపాల్సిన పని లేదు, గుర్తింపు కార్డు చూపాల్సిన అవసరం లేదు. RBI ఆదేశాలకు అనుగణంగా SBI తన అన్ని శాఖలకు మార్గదర్శకాలు జారీ చేసింది,
5. 2000 రూపాయల నోట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడానికి, బ్యాంకు డిపాజిట్ & మార్పిడికి సంబంధించిన ఫారాన్ని బ్యాంకులు ప్రతిరోజూ పూరించాలని RBI తెలిపింది. బ్యాంక్ పేరు, తేదీ, నోట్ మార్పిడి మొత్తం, జమల మొత్తం ఈ ఫారంలో పూరిస్తారు. ఖాదాదార్లకు దీనికి సంబంధం లేదు.
6. నోట్లు మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి వచ్చే ప్రజలకు ఎండ వేడి తగలకుండా షెడ్లు ఏర్పాటు చేయాలని RBI అన్ని బ్యాంకులకు సూచించింది. క్యూలో ఉన్న ప్రజలకు మంచినీళ్ల సదుపాయం కూడా ఏర్పాటు చేయాలి. సాధారణ పద్ధతిలో, కౌంటర్‌లో నోట్ల మార్పిడి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకులకు సూచించింది.
7. చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో, 2000 వేల నోట్లు 10.8% మాత్రమే కాబట్టి, పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండదని చూపుతుందని RBI గవర్నర్ చెప్పారు. చాలా నోట్లు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వెనక్కు తిరిగి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. రూ.1000 నోటును మళ్లీ విడుదల చేసే ప్రతిపాదన లేదని, అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు.
8. నోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. 2000 రూపాయల నోటును చెలామణి నుంచి తొలగించడం కూడా పెద్ద నోట్ల రద్దు వంటి రాజకీయ నిర్ణయమని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. నోట్ల ఉపసంహణ ప్రభావాలు, పరిణామాలపై సరైన అధ్యయనం అవసరమని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు.
9. విపక్షాల దాడులకు బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. 2000 నోట్లను అక్రమంగా దాచుకున్న వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నేత, హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ చెప్పారు. ప్రస్తుతం ఏడుస్తున్నవాళ్లంతా రూ.2000 నోట్లను అక్రమంగా బస్తాల్లో నిల్వ చేశారని ఆరోపించారు.
10. పెట్రోల్ పంపుల వద్ద నగదుతో ఇంధనం కొనుగోళ్లు 90 శాతం పెరిగాయి. 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు వాహనదార్లు పెద్ద సంఖ్యలో పెట్రోల్ పంపుల వద్దకు వెళ్తున్నారు. రూ.2,000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించే నాటికి, మొత్తం చమురు విక్రయాల్లో నగదు ఆధారిత విక్రయాలు కేవలం 10 శాతం మాత్రమేనని పెట్రోల్ పంప్ డీలర్లు తెలిపారు. ఇప్పుడు, రూ.100, రూ.200 వంటి చిన్నపాటి కొనుగోళ్లకు కూడా రూ.2,000 నోటును వాహనదార్లు తీసుకువస్తున్నారని వెల్లడించారు. దీంతో పెట్రోల్ బంకుల్లో రూ.100, రూ.500 నోట్ల కొరత ఏర్పడింది.
ఇది కూడా చదవండి: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' BPCL, Gland Pharma, PB Fintech
Cryptocurrency Prices: క్రిప్టో బిగ్ కాయిన్స్ క్రాష్ - బిట్‌కాయిన్ రూ.80వేలు లాస్!
Stock Market News: రెడ్ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్!
Health Insurance: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్ కూడా వస్తాయ్
Torrent Pharma: వీక్ మార్కెట్లోనూ వండ్రఫుల్ ర్యాలీ, షేక్ చేసిన టోరెంట్ ఫార్మా
Multibagger Stocks: జెట్ స్పీడ్‌లో పెరిగిన సూపర్ స్టాక్స్, మళ్లీ ఇదే రిపీట్ అవ్వొచ్చు!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!