X

Jet Airways News: పున:ప్రారంభం కానున్న జెట్ ఎయిర్‌వేస్, భారీ ఎత్తున మార్కెట్‌లోకి.. ఎప్పటినుంచంటే..

న్యూఢిల్లీ - ముంబయికి తన మొదటి విమానంతో డొమెస్టిక్ సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది.

FOLLOW US: 

విమానయాన రంగంలో అప్పుల్లో కూరుకుపోయిన ఓ విమాన సంస్థ మళ్లీ అరంగేట్రం చేయబోతోంది. 2022 ఏడాది తొలి త్రైమాసికానికల్లా సర్వీసులను ప్రారంభిస్తామని జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. అయితే, ముందు డొమెస్టిక్ సర్వీసులను ప్రారంభించి, ఆ తర్వాత కొంత కాలానికి ఇంటర్నేషనల్ విమానాలను తిప్పుతామని ప్రకటించింది. న్యూఢిల్లీ - ముంబయికి తన మొదటి విమానంతో డొమెస్టిక్ సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి ఇంటర్నేషనల్ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపింది.

ప్రస్తుతం ఈ జెట్ ఎయిర్ వేస్ సంస్థ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్‌ క్యాపిటల్‌, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో రూ.12 వేల కోట్లను తిరిగి చెల్లిస్తామని కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం ప్రతిపాదించింది. దీనికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.

చరిత్రలో ఇదే తొలిసారి
రెండేళ్లకు పైగా మూతబడి ఉన్న ఒక విమానయాన సంస్థను మళ్లీ తిరిగి పునరుద్ధరణకు గురవడం చరిత్రలో ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాల మాట. ఈ చారిత్రక ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉందని జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ చెప్పారు. భారీగా పెరిగిన నష్టాలతో కుంటుపడిన ఈ విమానయాన సంస్థ, ఒకప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థగా పేరుప్రఖ్యాతులు గడించింది. క్రమంగా భారీ అప్పులు మీదపడిపోతుండడంతో ఏప్రిల్ 2019 నాటికి అన్ని విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఈ ఏడాది జూన్‌లో ఆమోదించింది.

వెయ్యికి పైగా ఉద్యోగాలు రానున్నాయట
మళ్లీ మార్కెట్లోకి వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ‘‘జెట్ ఎయిర్ వేస్ ముంబయిలోని తన ‘గ్లోబల్ వన్’ కార్యాలయం నుండి పనిచేస్తుంది. అక్కడ ఆ విమానయాన సంస్థకు ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని కూడా ఉంది. ఇక్కడే సిబ్బంది కోసం ఇన్-హౌస్ శిక్షణ ఇస్తారు’’ అని తాత్కాలిక సీఈఓ కెప్టెన్ గౌర్ పేర్కొన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పటికే తన ప్రణాళికలో భాగంగా 150 మందికి పైగా శాశ్వత స్థాయి ఉద్యోగులను నియమించుకుందని తెలిపారు. అలాగే వివిధ కేటగిరీలలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్లుగా కెప్టెన్ గౌర్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ దశలవారీగా ఉంటుందని ఆయన చెప్పారు.

Also Read: Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి మెగా ప్లాన్! ఇప్పటికే అమల్లోకి.. సక్సెస్ అవుతుందా?

Also Read: Harish Rao Dance: తల్లి రొమ్ము గుద్దినట్లుగా ఈటల వ్యవహారం.. హరీశ్ ఘాటు వ్యాఖ్యలు, స్టెప్పులేసిన మంత్రి

Also Read: Mahesh Pan Bahar : వివాదంలో మహేష్ బాబు.. ఆ ప్రకటనలో నటించడం వల్లే !

Tags: Jet Airways Jet Airways Domestic flights Domestic flight operations Jet Airways news aviation in India

సంబంధిత కథనాలు

Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!

Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!

Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు.. సోమవారం మార్కెట్లో పరిస్థితి ఏంటో?

Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు.. సోమవారం మార్కెట్లో పరిస్థితి ఏంటో?

Cryptocurrency Prices Today: నిన్న పడిపోయిన బిట్‌కాయిన్‌.. నేడు ఎలా ఉందంటే?

Cryptocurrency Prices Today: నిన్న పడిపోయిన బిట్‌కాయిన్‌.. నేడు ఎలా ఉందంటే?

SBI Credit Card ALERT : మరో 3 రోజులే..! డిసెంబర్‌ 1 నుంచే ఎస్‌బీఐ అదనపు ఛార్జీలు

SBI Credit Card ALERT : మరో 3 రోజులే..! డిసెంబర్‌ 1 నుంచే ఎస్‌బీఐ అదనపు ఛార్జీలు

UAN-Aadhar Linking: నవంబర్‌ 30 లోపు యూఏఎన్‌, ఆధార్‌ లింక్‌ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు

UAN-Aadhar Linking: నవంబర్‌ 30 లోపు యూఏఎన్‌, ఆధార్‌ లింక్‌ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!