By: ABP Desam | Updated at : 07 Sep 2021 06:33 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
బంగారం, వెండి ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో బంగారం ధరలు ఈ రోజు (సెప్టెంబరు 7) స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కేజీకి రూ.200 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.45,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.48,560 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి కాస్త ధర పెరిగింది. దేశవ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకు ఉన్న ధరలివి.
భారత మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. తాజాగా భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.69,800గా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.69,800గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 7న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,560 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,510 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,800 పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 6న రూ.44,510 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,560గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,800గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,560గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలోకు హైదరాబాద్ తరహాలోనే రూ.69,800 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 7న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,530 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,530గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,790 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,860గా ఉంది.
Also Read:మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,388గా ఉంది. ముందు రోజు ధరలో రూ.9 తగ్గింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,880 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.
వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్! బిట్‌కాయిన్ సహా మేజర్ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్‌కు మస్కా కొట్టాడుగా!
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Karate Kalyani : కలెక్టర్ ఎదుట హాజరైన కరాటే కల్యాణి - పాప దత్తతపై యూటర్న్ !
LICIPO Memes : ఎల్ఐసీ షేర్లపై అతిగా ఆశలు పెట్టుకున్న వారికి షాక్ - ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్