By: ABP Desam | Updated at : 26 Jan 2022 06:31 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు భారీగా ఎగబాకింది. తులానికి ఏకంగా రూ.260 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.800 తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,910 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.800 తగ్గి రూ.68,200గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,200 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,910గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,200గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,680 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.10 తగ్గి.. రూ.24,420 గా అయింది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Self Driving Vehicles: ఈ కారుకు డ్రైవర్ అవసరం లేదు.. త్వరలో తీసుకురానున్న ప్రముఖ బ్రాండ్!
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల
Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
KTR Jagan Meet: దావోస్లో అరుదైన కలయిక, ఒకే ఫ్రేములో డైనమిక్ లీడర్స్ - ‘అక్కడా ఏపీ పరువు తీస్తున్నారా’ అని నెటిజన్ల ఫైర్!
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Simple Hacks: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి