Gold-Silver Price: గూడ్‌న్యూస్! తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం స్థిరంగా, నేటి తాజా ధరలివే..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.25 వరకూ తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.47,560 గా ఉంది.
భారత్‌లో బంగారం ధర ఈ రోజు (సెప్టెంబరు 24) తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.45,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.46,300 గా ఉంది. హైదరాబాద్‌లో మాత్రం పసిడి ధర మరింత ఎక్కువగా తగ్గడం విశేషం.
ముంబయిలో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి. తాజాగా అక్కడి మార్కెట్‌లో కిలో వెండి రూ.60,600గా ఉండగా.. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.65,100 గా స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 24న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.25 వరకూ తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.47,560 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.43,600 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,100 పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 24న రూ.43,600 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,560గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,560గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో హైదరాబాద్ తరహాలోనే రూ.65,100 పలుకుతోంది.
Also Read: Oyo Hotels IPO: జొమాటో బాటలో ఓయో! ఐపీఓకు రానున్న హోటల్ అగ్రిగేటర్ కంపెనీ
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 24న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,300ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,880 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,870గా ఉంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,366గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర గ్రాముకు ఏకంగా రూ.60 వరకూ పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,366 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే ఉంది.
వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Also Read: Freshworks Nasdaq Listing: కోటీశ్వరులైన 500+ ఉద్యోగులు... ఫ్రెష్‌వర్క్స్ సాఫ్ట్‌వేర్ సంచలనం!