అన్వేషించండి

US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?

US Federal Reserve Decisions: యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ 2020 తర్వాత మొదటిసారి వడ్డీ రేట్లను తగ్గించింది. రేట్లను అరశాతం మేర కోసేసింది. రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గించొచ్చని భావిస్తున్నారు.

Interest Rates Cut In US: అమెరికా సహా ప్రపంచ మార్కెట్ల ఎదురుచూపులు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫలించాయి. ఎట్టకేలకు, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve), వడ్డీ రేట్లను తగ్గిస్తూ బుధవారం ‍‌(18 సెప్టెంబర్‌ 2024) నాడు నిర్ణయం తీసుకుంది.

వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (0.50% లేదా అరశాతం) తగ్గిస్తున్నట్లు యూఎస్‌ ఫెడ్‌ ప్రకటించింది. ఫెడ్‌ రేట్స్‌ కట్‌ భవిష్యత్‌లోనూ కొనసాగొచ్చు. నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడిదార్లు 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా, 2020లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది. 

4.75 నుంచి 5.00 శాతం మధ్య అమెరికన్‌ రేట్స్‌
ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో, వడ్డీ రేట్ల కోత నిర్ణయానికి అనుకూలంగా 11 ఓట్లు - వ్యతిరేకంగా 01 ఓటు వచ్చాయి. దీంతో అమెరికాలో వడ్డీ రేట్లు 4.75 నుంచి 5.00 శాతం మధ్య ఉండనున్నాయి. ఇది కాకుండా, ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను మరో అర శాతం తగ్గించవచ్చని ఫెడరల్ రిజర్వ్ సంకేతం ఇచ్చింది. ఫెడ్‌ రేట్స్‌ తగ్గడంతో, ఇప్పుడు అమెరికన్‌ బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉంటుంది. తద్వారా ప్రజలు, వ్యాపారస్తులు, పెట్టుబడిదార్లకు చౌక ధరలకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. 

3 శాతం వరకు తగ్గింపు కొనసాగుతుందని అంచనా
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ప్రక్రియ భవిష్యత్తులోనూ కొనసాగవచ్చని మార్కెట్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మరో అర శాతం, 2025లో ఒక శాతం, 2026లో అర శాతం తగ్గింపుతో ఫెడరల్ రిజర్వ్ అమెరికాలో వడ్డీ రేట్లను 2.75 నుంచి 3.0 శాతం మధ్యలో ఉంచుతుందని అభిప్రాయపడుతున్నారు.

నియంత్రణలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం: ఫెడ్
అమెరికాలో ద్రవ్యోల్బణం 2 శాతం దిశగా పయనిస్తున్నట్లు అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. జాబ్ డేటా మంచి సంకేతాలు ఇస్తోంది. ఆర్థిక అంచనా ప్రకారం, దేశంలో నిరుద్యోగం రేటు నాలుగో త్రైమాసికంలో 4.4 శాతంగా ఉండొచ్చు. ద్రవ్యోల్బణం రేటు కూడా 2.3 శాతంగా అంచనా వేశారు.

ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
ఫెడ్‌ రేట్‌ కట్స్‌ ప్రారంభమైన నేపథ్యంలో, మన దేశంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా రాబోయే ద్రవ్య విధాన సమావేశంలో (MPC) వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. RBI MPC తదుపరి సమావేశం అక్టోబరు 7-9 తేదీల్లో జరుగుతుంది.

భిన్నంగా SBI వాదన
భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణంలో అస్థిరంగా కదులుతున్న కారణంగా, ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరం 2024లో వడ్డీ రేట్లను RBI తగ్గించకపోవచ్చని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. "ఫెడ్‌ రేట్ల తగ్గింపు చాలా దేశాలను ప్రభావితం చేయొచ్చు. మన దేశంలో మాత్రం, ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చాకే కీలక రేట్ల తగ్గింపుపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకోవచ్చు. మా లెక్క ప్రకారం, 2024లో భారత్‌లో ఇంట్రెస్ట్‌ రేట్లు తగ్గవు. 2025 జనవరి - మార్చి కాలం నుంచి కోతలు ప్రారంభం కావచ్చు" అని అన్నారు. 

మరో ఆసక్తికర కథనం: ఫెడ్‌ రేట్‌ కట్స్‌తో చల్లబడిన చమురు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget