UMANG App తో EPFO UAN తప్పనిసరి! కొత్త రూల్స్ తో UAN పొందడం, యాక్టివేషన్ సులభం! Step-by-Step Guide ఇదే
EPFO UAN Generation : EPFO ఖాతాదారులకు UMANG యాప్ కేంద్రం తప్పనిసరి చేసింది. ఆఫ్‌లైన్ కార్యకలాపాలను తగ్గించేందుకు కచ్చితంగా ప్రతి ఉద్యోగి ఈ యాప్ యాక్టివేషన్ ఇతర వివరాలు తెలుసుకోవాలి.

EPFO UAN Generation : ప్రతి ఉద్యోగి యూనివర్శల్ అకౌంట్ నెంబర్ యాక్టివేషన్, జనరేషన్ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలకమైన మార్పులు చేసింది. కచ్చితంగా ఫేస్ రికగ్నేషన్ కచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది. దీని వల్ల ఉద్యోగుల లావాదేవీలకు మరింత భద్రత లభిస్తుందని పేర్కొంది. దీని కోసం UMANG యాప్ వాడకాన్ని తప్పనిసరి చేసింది. ఆగస్టు 1 నుంచి వచ్చిన మార్పులు కారణంగా కొన్ని రూల్స్ను ఉద్యోగులు తెలుసుకోవాలి. లేకుంటే యూఏఎన్ యాక్టివేషన్, జనరేషన్లో ఇబ్బంది పడతారు. ఈ ప్రక్రియను ఎలా చేసుకోవాలో స్టెప్బై స్టెప్ ఇక్కడ తెలుసుకుందాం.
ఆగస్టు 1 నుంచి క్రియేట్ చేసే ప్రతి యూఏఎన్ అకౌంట్ UMANG యాప్ ద్వారానే చేపట్టాలి. ఆధార్ బేస్ట్ ఫేస్ రికగ్నేషన్ కచ్చితంగా పాటించాలి. ఈపీఎఫ్లో ఇప్పటి వరకు ఉన్న గందరగోళానికి అవకాశం లేకుండా ఇకపై పూర్తి పారదర్శకతతో ప్రాసెస్ సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా చేరే వారికి ఉన్న వారికి సమస్యలు ఎదురుకాకుండా ఎర్రర్ ఫ్రీగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
UMANG యాప్ ఎవరకి అవసరం?
ఉద్యోగం చేస్తూ పీఎఫ్ కట్ అవుతున్న ప్రతి ఒక్క ఉద్యోగి వద్ద ఉండాల్సిన యాప్ ఇది. అందుకే ఇప్పటికే కోట్ల మంది దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. దీని ద్వారానే యూఏఎన్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న యూఏఎన్ ను యాక్టివేషన్ చేసుకోవడానికి ఈ యాప్ అవసరం. ఈ యాప్ ద్వారానే మీ బయోమెట్రిక్ ఫేస్ అథింటికేన్ ద్వారా ఈపీఎఫ్ఓ రికార్డులను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే మాత్రం UMANG యాప్తోపాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
UAN ప్రారంభించడానికి ఏం కావాలి?
పీఎఫ్ కట్ అయ్యే ప్రతి ఉద్యోగి కూడా కచ్చితంగా UAN క్రియేట్ చేసుకోవాలి. ఉన్న వాళ్లు యాక్టివేట్ చేసుకోండి. దీనికి మీకు ఈ కింది అంశాలు కావాల్సి ఉంటుంది
- స్మార్ట్ ఫోన్
- UMANG యాప్
- ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్
- ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్
UMANG యాప్ ద్వారా UAN ఎలా క్రియేట్ చేయాలి
ముందుగా మీరు ప్లేస్టోర్ లోకి వెళ్లి UMANG యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి
తర్వాత UMANG యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో 'UAN Allotment and Activation' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది.
మీరు ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి.
తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
మీ ఆధార్ను అథంటికేషన్ చేయడానికి మీ లింక్ చేసిన మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
తర్వాత ఫేస్ స్కాన్ చేయడానికి అంగీకరిస్తూ ప్రొసీడ్పై క్లిక్ చేయాలి.
మీరు గతంలో UAN తీసుకోకుంటే అటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్కు నెంబర్ పంపిస్తారు. అదే మీకు శాశ్వత నెంబర్గా ఉంటుంది.
UAN ఉంటే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
ముందుగా UMANG యాప్ను ఓపెన్ చేయాలి.
అందులో 'UAN Activation' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
వెంటనే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో గతంలో మీకు ఇచ్చిన యూఏఎన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఫేస్ అథంటికేషన్ కూడా పూర్తి చేయాలి.
ప్రక్రియ పూర్తి అయినట్టు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులోనే పాస్వర్డ్ ఉంటుంది.
ఆ పాస్వర్డ్తో మీరు UAN ను యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత కచ్చితంగా పాస్వర్డ్ మార్చుకోవాల్సి ఉంటుంది.
యూఏఎన్ యాక్టివ్గా ఉంటే ఏం చేయాలి
చాలా మంది ఈపీఎఫ్ విషయంలో చాలా అప్డేటెడ్గా ఉంటారు. అలాంటి వాళ్లు కేవలం ఫేస్ అథంటికేషన్ అప్డేట్ చేస్తే సరిపోతుంది. దీని కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి.
UMANG యాప్లో 'Face Authentication of Already Activated UANs' ఆనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
తర్వాత మీ ఫేస్ను స్కాన్ చేసి ఫొటో, ఆడ్రెస్ను అప్డేట్ చేయాలి.
ఇప్పుడు ఇంత సడెన్గా అప్డేట్స్ ఎందుకు ?
ప్రభుత్వంలో చాలా సేవలు కేవలం ఆన్లైన్లోనే సాగుతున్నాయి. కానీ చాలా కాలంగా ఈపీఎఫ్వో మాత్రం ఆఫ్లైన్లోనే సాగుతున్నాయి. చాలా మందికి అడుగు బయటపెట్టకుండానే ఈపీఎఫ్లో చాలా పనులు చేసుకోవాలనే విషయం తెలియదు. అందుకే దీన్ని కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలనే రూల్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆఫ్లైన్లో ప్రక్రియను తగ్గించి మరిన్ని సేవలు ఉద్యోగులు అందివ్వాలని భావిస్తోంది.





















