అన్వేషించండి

Bloodbath for stock markets: స్టాక్ మార్కెట్‌కు ఒక్క రోజే 10లక్షల కోట్ల లాస్ - భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

Sensex: స్టాక్ మార్కెట్ చరిత్రలో బ్లాక్ ధర్స్‌డే నమోదు అయింది. 2496 పాయింట్లు సెన్సెక్స్ కోల్పోయింది.

Huge losses for stock markets:   స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా గురువారం  నిలిచిపోయింది.  బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex)  ఏకంగా  2,496 పాయింట్లు (3.26%) పతనం చెంది 74,207 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచే అమ్మకాల ఒత్తిడి మొదలవ్వగా, మధ్యాహ్నం తర్వాత అది మరింత తీవ్రమై మదుపర్ల సంపదను ఆవిరి చేసింది. ఒక్క రోజే దాదాపు  రూ. 10 లక్షల కోట్ల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోవడం మార్కెట్ తీవ్రతను సూచిస్తోంది.                         

మార్కెట్ ఈ స్థాయిలో కుప్పకూలడానికి ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు కారణమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు, బాండ్ యీల్డ్స్ పెరగడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీనికి తోడు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు  , చమురు సరఫరాలో అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులను  పెద్ద ఎత్తున అమ్మకాలకు పురికొల్పాయి.

రంగాల వారీగా చూస్తే, దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా  బ్యాంకింగ్  ,  (IT),  రియల్టీ   రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ హెవీవెయిట్స్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ,  రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 3 శాతం కంటే ఎక్కువగానే నష్టపోయి చిన్న మదుపర్లను కలవరపెట్టాయి.
 
ముగింపు సమయంలో  కొద్దిగా రికవరీని సూచిస్తున్నప్పటికీ, కనిష్ట స్థాయి 73,950.95 వరకు వెళ్లడం మార్కెట్ బలహీనతను చాటిచెబుతోంది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ గణాంకాలు ,  కార్పొరేట్ ఫలితాల ఆధారంగానే మార్కెట్ గమనం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని, అత్యవసరంగా అమ్మకాలు జరపకుండా వేచి చూడటమే మంచిదని నిపుణుల సలహా. 

గురువారం నాటి మార్కెట్ పతనంలో  నిఫ్టీ 50  కూడా సెన్సెక్స్‌తో పాటే కుప్పకూలింది. నిఫ్టీ దాదాపు  600 పాయింట్లకు పైగా నష్టపోయి, కీలకమైన 22,500 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. మార్కెట్ ప్రారంభం నుంచే  నిఫ్టీలోని 50 షేర్లలో దాదాపు 45 షేర్లు  రెడ్ కేటగిరీలోచేరాయి.  ముఖ్యంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి భారీ వెయిటేజీ ఉన్న షేర్లు నిఫ్టీని కిందకు లాగాయి. టెక్నికల్ పరంగా చూస్తే, నిఫ్టీ తన కీలకమైన సపోర్ట్ లెవల్స్‌ను కోల్పోవడం మున్ముందు మరిన్ని నష్టాలకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.                    


 

టాప్ హెడ్ లైన్స్

How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
How To Check CIBIL Score In Telugu: పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget