![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
DA Hike: పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతం, డీఏ పెంపునకు సర్వం సిద్ధం!
మరో 4 శాతం పెంచితే, అది మూల వేతనంలో 38 శాతం నుంచి 42 శాతానికి చేరుతుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల స్థూల, నిరక వేతనం కూడా పెరుగుతుంది.
![DA Hike: పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతం, డీఏ పెంపునకు సర్వం సిద్ధం! DA Hike is likely 4 percent know 7th Pay Commission recommendation DA Hike: పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతం, డీఏ పెంపునకు సర్వం సిద్ధం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/41f56ac4c9e429a4e064a18053c881391675659877472545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
DA Hike: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అతి త్వరలోనే పెద్ద శుభవార్త రాబోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదార్లకు (Pensioners) కరవు భత్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చు. ఫిక్స్‌డ్ ఫార్ములా కింద డియర్‌నెస్ అలవెన్స్‌ను (DA) మరో 4 శాతం పెంచడం లాంఛనంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కరవు భత్యం (Dearness Allowance) 38 శాతంగా ఉంది. ఇప్పుడు, దీనిని మరో 4 శాతం పెంచితే, అది మూల వేతనంలో 38 శాతం నుంచి 42 శాతానికి చేరుతుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల స్థూల, నిరక వేతనం (Gross Pay & Net Pay) కూడా పెరుగుతుంది.
డీఏ పెంపునకు ఒక ప్రామాణిక పద్ధతి ఉంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే "కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్" [Consumer Price Index for Industrial Workers - CPI(IW)] ఆధారంగా డీఏను లెక్కిస్తారు. కార్మిక శాఖకు చెందిన అనుబంధ విభాగమే ఈ లేబర్ బ్యూరో.
ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా వెల్లడించిన ప్రకారం.. 2022 డిసెంబర్ నెలకు సంబంధించిన సీపీఐ ఐడబ్ల్యూ 2023 జనవరి 31న విడుదల అయ్యింది. దీని ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 4.23 శాతం మేర పెరగాల్సి ఉంటుంది. అనవాయితీ ప్రకారం, పాయింట్ తర్వాత ఉన్న నంబర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. అందువల్ల, పాయింట్ తర్వాత ఉన్న 23 నంబర్‌ను వదిలేసి, డీఏను నికరంగా 4 శాతం పెంచవచ్చని శివ గోపాల్ మిశ్రా చెప్పారు. తద్వారా, మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతానికి పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం పంపుతుందని చెప్పారు.
సంవత్సరానికి రెండు సార్లు సవరణ
డియర్‌నెస్ అలవెన్స్ అంటే పెరిగిన ధరల నుంచి రక్షణ కోసం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపశమనం లేదా పరిహారం. డీఏను ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. ఈ పద్ధతిలో డీఏను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. దేశంలో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి కాబట్టి, ప్రతి సవరణలోనూ సాధారణంగా డీఏ పెంపు ఉంటుంది.
జనవరి 1, 2023 నుంచి కొత్త DA వర్తింపు
ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి, జులై 1వ తేదీ నుంచి కొత్త డీఏ అమల్లోకి వస్తుంది. చివరిసారిగా 2022 సెప్టెంబర్ 28న DA సవరించారు. దానిని ఆ ఏడాది జులై 1వ తేదీ నుంచి వర్తింపజేశారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తే, తాజా డీఏ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఫలితంగా, కోటి మందికి పైగా ఉద్యోగులు & పెన్షనర్లు లబ్ధి పొందుతారు. వాళ్లు ప్రస్తుతం అందుకుంటున్న డియర్‌నెస్ రిలీఫ్ 38 శాతం నుంచి 42 శాతానికి చేరుతుంది.
ALSO READ: RBI Repo Rate: వడ్డీల వాతకు సిద్ధంగా ఉండండి, మరో పాతిక శాతం పెరిగే అవకాశం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)