Cryptocurrency Prices Today: రూ.3లక్షల కోట్లు పతనమైన బిట్‌కాయిన్ విలువ.. అదే బాటలో మిగతావీ!
గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 4.63 శాతం తగ్గి రూ.37.97 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.67 లక్షల కోట్లకు తగ్గింది. ఒక్కరోజులోనే ఈ విలువ రూ.3 లక్షల కోట్లు తగ్గింది.
![Cryptocurrency Prices Today: రూ.3లక్షల కోట్లు పతనమైన బిట్‌కాయిన్ విలువ.. అదే బాటలో మిగతావీ! Cryptocurrency Prices On December 17 2021: Know Rate of Bitcoin, Ethereum, Litecoin, Ripple, Dogecoin And Other Cryptocurrencies: Cryptocurrency Prices Today: రూ.3లక్షల కోట్లు పతనమైన బిట్‌కాయిన్ విలువ.. అదే బాటలో మిగతావీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/25/fdf440948abe5e70e833c4cb10112da6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cryptocurrency Prices Today, 17 December 2021: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం విలవిల్లాడాయి. ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన క్రిప్టోలన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 4.63 శాతం తగ్గి రూ.37.97 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.67 లక్షల కోట్లకు తగ్గింది. ఒక్కరోజులోనే ఈ విలువ రూ.3 లక్షల కోట్లు తగ్గింది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 5.52 శాతం తగ్గి రూ.3,09,914 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.35 లక్షల కోట్లకు తగ్గింది.
బైనాన్స్ కాయిన్ 2.48 శాతం తగ్గి రూ.42,782, టెథెర్ 0.17 శాతం తగ్గి రూ.80.99, సొలానా 4.03 శాతం తగ్గి రూ.14,260, కర్డానో 6.19 శాతం తగ్గి రూ.99, యూఎస్‌డీ కాయిన్ 0.08 శాతం తగ్గి రూ.81.02 వద్ద కొనసాగుతున్నాయి. యార్న్ ఫైనాన్స్, డీఎఫ్‌ఐ మనీ, వేవ్స్, స్టార్జ్ లాభాల్లో ఉన్నాయి. ఎల్‌రాండ్, రిక్వెస్ట్, లూప్‌రింగ్, ఇంటర్నెట్ కో, ఎంజిన్ కాయిన్, నానో, పొల్కాడాట్ వంటివి
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం
Also Read: RBI Penalty on Banks: ఐసీఐసీఐ, పంజాబ్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాకు.. భారీ జరిమానా
Also Read: Cars Price Increase: కొత్త సంవత్సరంలో ఈ కార్ల ధరలు పైకి.. ఈ సంవత్సరమే కొనేయండి!
Also Read: Cryptocurrency: భారత్‌లో క్రిప్టో కరెన్సీ నిషేధంపై IMF చీఫ్ ఎకానమిస్ట్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Health Insurance: తల్లిదండ్రులతో కలిసి ఆరోగ్య బీమా అస్సలు తీసుకోకండి..! ఎందుకంటే..?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)