అన్వేషించండి
8th Pay Commission: 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే పెరిగే జీతమెంత? దీనిపై ఎంత పన్ను విధిస్తారు?
8th Pay Commission : ఎనిమిదవ వేతన సంఘం అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి, కానీ పన్ను భారం కూడా పెరుగుతుంది. వివరాలు తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) అమలు చేయనుంది. ఇది అమల్లోకి వచ్చినప్పుడు, ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల ఉంటుంది.
1/6

8వ వేతన సంఘం ద్వారా శాలరీలు పెరగడమే కాకుండా పన్ను ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ మార్పు తర్వాత మీ జేబులో ఎంత డబ్బు వస్తుంది, పన్నుకు ఎంత వెళుతుందో తెలుసుకుందాం.
2/6

మీరు లెవెల్ 8లో పని చేస్తున్నారని అనుకోండి. ప్రస్తుతం మీ ప్రాథమిక జీతం 47,600. 8వ వేతన సంఘం తర్వాత దీనికి 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తిస్తుంది. అంటే, మీ కొత్త బేసిక్ జీతం 91,392కి పెరుగుతుంది.
3/6

కొత్త బేసిక్ వేతనంతో పాటు మీ అలవెన్సులు కూడా పెరుగుతాయి. మీరు ఢిల్లీ, ముంబై లేదా బెంగళూరులో పని చేస్తే, మీకు 30% HRA లభిస్తుంది. అంటే 91,392లో 30% అంటే 27,418. దీనితో పాటు, ప్రయాణ భత్యం (TA) రూపంలో దాదాపు 3,600 అందుతాయి.
4/6

నివేదికల ప్రకారం, వీటన్నింటినీ కలిపిన తర్వాత మీ స్థూల జీతం నెలకు 1,22,410 వరకు చేరుకుంటుంది. అంటే, ప్రతి నెలా మీ మొత్తం జీతంలో దాదాపు 75,000 వరకు పెరుగుదల ఉండవచ్చు.
5/6

స్థూల జీతం 1.22 లక్షలు అయినా, అందులో కొన్ని మినహాయింపులు ఉంటాయి. వీటిలో నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) దాదాపు 9,139 ఉన్నాయి.
6/6

సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS 650, ఇన్కమ్ టాక్స్ దాదాపు 7700 టాక్స్ స్లాబ్ ప్రకారం. ఈ మినహాయింపుల తరువాత మీ నెట్ ఇన్ హ్యాండ్ జీతం నెలకు దాదాపు 104900 ఉంటుంది.
Published at : 11 Nov 2025 01:10 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















