అన్వేషించండి

Highway Driving Tips: ఈ టిప్స్‌ పాటిస్తే హైవే సేఫ్‌గా ఎంత దూరమైనా వెళ్లి రావచ్చు, మీ కోసం 10 చిట్కాలు

Long Drive Safety Tips: హైవేపై డ్రైవింగ్‌ అంటే ఎంత సంతోషమో, అంత జాగ్రత్త కూడా అవసరం. వేగం, సిగ్నల్స్‌, ఓవర్‌టేకింగ్‌, నైట్‌ డ్రైవ్‌ - ఇవన్నీ సేఫ్‌గా చేయడానికి ఈ 10 టిప్స్‌ తప్పక చదవండి.

Car Driving Tips India: హైవేపై డ్రైవ్‌ అంటే చాలా మందికి ఆనందం. కుటుంబం లేదా స్నేహితులతో రోడ్‌ ట్రిప్‌ వేయడం, కొత్త ప్రదేశాలు చూడడం నిజంగా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ, ఆ ఆనందం సేఫ్‌గా ఉండాలంటే కొన్ని డ్రైవింగ్‌ టిప్స్‌ తప్పక పాటించాలి. హైవేల్లో ట్రాఫిక్‌ నియంత్రణ తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త మరింత అవసరం.

1. వేగాన్ని స్థిరంగా ఉంచండి
హైవేల్లో రోడ్లు వెడల్పుగా ఉండటం వల్ల అధిక వేగం పెంచడం సులభం. కానీ, గంటకు 80 కి.మీ. స్పీడ్‌ లిమిట్‌ అని ఉంటే దానిని కచ్చితంగా పాటించండి. వర్షం, రాత్రి లేదా గుంపుగా వాహనాలు ఉన్నప్పుడు వేగం తగ్గించడం మంచిది. అవసరమైతే కొద్దిగా స్పీడ్‌ పెంచినా, ఎప్పుడూ బ్రేక్‌ దూరం గుర్తుంచుకోండి.

2. లేన్‌ మార్పు జాగ్రత్తగా చేయండి
లేన్‌ మార్పు సరైన సమయానికి చేయకపోతే ప్రమాదం తప్పదు. ఎడమ వైపు నెమ్మదిగా వెళ్ళే వాహనాల కోసం, కుడివైపు ఓవర్‌ టేకింగ్‌ కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. వెనుక ట్రాఫిక్‌ కాస్త దూరంలో ఉన్నప్పుడు, సిగ్నల్‌ ఇస్తూ మీ కారును సేఫ్‌గా లేన్‌ మార్చండి.

3. వాహనాల మధ్య దూరం ఉంచండి
ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్‌ వేయొచ్చు. కనీసం “3 సెకన్స్‌ రూల్‌” పాటించండి. రాత్రి అయితే 5 సెకన్ల దూరం ఉండడం ఇంకా సేఫ్‌. వర్షం లేదా పొగమంచు సమయంలో మరింత జాగ్రత్త అవసరం.

4. ఓవర్‌ టేకింగ్‌లో ఆలోచించి అడుగు వేయండి
హైవేలో జరిగే ప్రమాదాల్లో ఎక్కువశాతం తప్పుడు ఓవర్‌ టేకింగ్‌ వల్లే. ముందున్న వాహనం వేగం అంచనా వేసి, వెనుక వాహనాలు వస్తున్నాయో లేదో చూసి, సరైన గేర్‌లోకి మార్చి మాత్రమే ఓవర్‌ టేక్‌ చేయండి. సింగిల్‌ లేన్‌ రోడ్లలో అయితే రిస్క్‌ తీసుకోకండి.

5. సిగ్నల్స్‌ తప్పక ఇవ్వండి
లేన్‌ మార్చేటప్పుడు లేదా ఆగేటప్పుడు సిగ్నల్‌ ఇవ్వడం తప్పనిసరి. రోడ్డు మధ్యలో బ్రేక్‌ వేయాల్సి వస్తే ముందుగానే హజార్డ్‌ లైట్లు ఆన్‌ చేయండి.

6. మిర్రర్స్‌ వాడకం అలవాటు చేసుకోండి
రివ్యూ మిర్రర్స్‌ మీకు అదనపు కళ్ళు లాంటివి. ప్రతి మూవ్‌కు ముందు, మిర్రర్‌ను చూడండి. మీ వెనుక ఉన్న వాహనాల దూరాన్ని, వేగాన్ని అర్ధం చేసుకోండి. బ్లైండ్‌ స్పాట్స్‌ తగ్గించడానికి చిన్న ఫిష్‌ఐ మిర్రర్స్‌ ఉపయోగించడం మంచిది.

7. రెగ్యులర్‌గా విరామాలు తీసుకోండి
ఒకేసారి గంటల తరబడి డ్రైవ్‌ చేయడం వల్ల “హైవే హిప్నోసిస్‌” వస్తుంది. అలసట, దాహం, ఒకే వేగం - ఇవన్నీ మానసికంగా మాయ చేస్తాయి. ప్రతి రెండు గంటలకు ఒక్కసారి ఆగి విశ్రాంతి తీసుకోండి. డ్రైవింగ్‌ పార్ట్‌నర్‌ ఉంటే మారుతూ డ్రైవ్‌ చేయండి.

8. వర్షంలో జాగ్రత్త
వర్షపు నీటిలో ఉన్న ఆయిల్‌, ధూళి కణాలు కారు టైర్ల గ్రిప్‌ తగ్గిస్తాయి. ఆ సమయంలో వేగం తగ్గించి, బ్రేక్‌లు నెమ్మదిగా వేయండి. మడుగు లాంటి నీటిలో వేగంగా వెళ్ళకండి. కార్‌ హైడ్రోప్లేన్‌ అయ్యే ప్రమాదం ఉంది.

9. రాత్రి డ్రైవ్‌లో జాగ్రత్త
రాత్రి ప్రయాణం తప్పనిసరి అయితే హెడ్‌ల్యాంప్స్‌, విండ్‌షీల్డ్‌ సరిగా ఉన్నాయో చూడండి. హైబీమ్‌ వాడకండి. ట్రక్‌ డ్రైవర్‌లు అలసటగా ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి మీ దృష్టి ఎప్పుడూ రోడ్డుపైనే ఉండాలి.

10. వాహనం చెడిపోతే
హైవేలో మీ కారు బ్రేక్‌డౌన్‌ అయితే వాహనాన్ని పక్కకు తీసి, వెంటనే హజార్డ్‌ లైట్లు ఆన్‌ చేయండి. ట్రయాంగిల్‌ సైన్‌ బోర్డును మీ కారు వెనుక 15 అడుగుల దూరంలో పెట్టండి. సహాయం కోసం హైవే అసిస్టెన్స్‌ నంబర్‌ సంప్రదించండి.

హైవేపై డ్రైవింగ్‌ అంటే కేవలం స్పీడ్‌ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా ముఖ్యం. ఈ 10 టిప్స్‌ పాటిస్తే మీ ప్రతి ప్రయాణం సురక్షితంగా, ఆనందంగా సాగుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Embed widget