అన్వేషించండి

Hyundai Tucson ఛాప్టర్‌ క్లోజ్‌ - మూడు సంవత్సరాలకే ముగిసిన స్టోరీ, కారణం ఇదే

Hyundai India, తన ప్రీమియం SUV Tucson ను మూడు సంవత్సరాలకే మార్కెట్‌ నుంచి తొలగించింది. ₹30–40 లక్షల SUVల విభాగంలో అమ్మకాలు పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Hyundai 4th-gen Tucson Discontinued In India: భారత మార్కెట్‌లో, హ్యుందాయ్‌, తన ప్రీమియం SUV టుక్సన్‌కు గుడ్‌బై చెప్పింది. 2022లో నాల్గవ తరం టుక్సన్‌ను (4th-gen Hyundai Tucson) హ్యుందాయ్‌ గ్రాండ్‌ లాంచ్‌తో ప్రవేశపెట్టినప్పటికీ, కేవలం మూడు సంవత్సరాలకే కంపెనీ దాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం ద్వారా, హ్యుందాయ్‌ తన ప్రీమియమ్‌ ఇంటర్నల్‌ కంబషన్‌ SUV సెగ్మెంట్‌ నుంచి తాత్కాలికంగా బయటకు వచ్చింది.

అమ్మకాలు తగ్గి, మార్కెట్‌ తగ్గుముఖం
హ్యుందాయ్‌ టుక్సన్‌ 2023లో అత్యధికంగా అమ్ముడైనప్పటికీ, ఆ తర్వాత విక్రయాలు తీవ్రంగా తగ్గాయి. ₹30–₹40 లక్షల SUV రేంజ్‌లో మొత్తం మార్కెట్‌ డిమాండ్‌ క్షీణించడంతో, Jeep Compass, Citroën C5 Aircross వంటి మోడల్స్‌ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. 2023లో టుక్సన్‌ అమ్మకాలు 3,692 యూనిట్లకు చేరినప్పటికీ, 2024లో సేల్స్‌ సగానికి పైగా తగ్గి 1,543కు పడిపోయాయి. 2025లో ఇప్పటివరకు కేవలం 650 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి.

టుక్సన్‌ ఇంజిన్‌ ఆప్షన్లు
2022లో వచ్చిన ఫోర్త్‌ జెన్‌ టుక్సన్‌ 2.0 లీటర్‌ పెట్రోల్‌ & డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో లభించింది. పెట్రోల్‌ వెర్షన్‌ 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో, డీజిల్‌ వెర్షన్‌ 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌తో వచ్చింది. అదనంగా ఆల్‌-వీల్‌ డ్రైవ్‌ (AWD) వెర్షన్‌ కూడా లభ్యమైంది.

ధర & మార్కెట్‌లో స్థానం
₹27.7 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర వద్ద ప్రారంభమైన ఈ SUVని హ్యుందాయ్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో నిలబెట్టాలనుకుంది. కానీ CKD (Completely Knocked Down) అసెంబ్లీ కారణంగా ధర ఎక్కువగా ఉండటంతో, BMW X1, Audi Q3, Volkswagen Tiguan వంటి లగ్జరీ SUVలతో పోటీలో టుక్సన్‌ వెనుకబడి పోయింది. మరోవైపు, హ్యుందాయ్‌ సొంతమైన Creta, Alcazar మోడల్స్‌ తక్కువ ధరలో దాదాపు అవే ఫీచర్లు అందించడం కూడా టుక్సన్‌ మార్కెట్‌ స్థాయిని దెబ్బతీసింది.

ఎందుకు ఫెయిల్‌ అయింది?
టుక్సన్‌ డిజైన్‌, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ, భారత మార్కెట్‌లోని బలమైన బంప్‌ అయిన ప్రైసింగ్‌ సెన్సిటివిటీని దాటలేకపోయింది. క్రెటా ధరల కంటే ఎక్కువైన వెంటనే SUV డిమాండ్‌ క్షీణిస్తుందని గణాంకాలు చూపిస్తున్నాయి. అంతేకాదు, కంపెనీ దృష్టి ఎక్కువగా Venue, Exter, Creta వంటి హై-వాల్యూమ్‌ మోడల్స్‌పైనే ఉండడంతో టుక్సన్‌కు ప్రచార మద్దతు కూడా తక్కువగా లభించింది.

భవిష్యత్తు ప్రణాళికలు
టుక్సన్‌కు డైరెక్ట్‌ రీప్లేస్‌మెంట్‌ ఇప్పటికైతే లేదు. అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఇన్వెస్టర్‌ డే సందర్భంగా, హ్యుందాయ్‌ ఒక పూర్తి సైజ్‌ ఆఫ్‌-రోడర్‌ SUV & కొత్త MPV లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్‌ టుక్సన్‌ రేంజ్‌లో ఒక ప్రీమియం SUV కొనాలనుకునేవారు ఇప్పుడు BMW X1, VW Tiguan లేదా Jeep Meridian వైపు చూడవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!
మీ బండిపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో, లేదో మీకు తెలుసా? మీ ఫోన్‌లోనే చెక్‌ చేయవచ్చు!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Bajaj Pulsar N250SS మార్కెట్‌లోకి వచ్చింది.. Pulsar N250తో పోలిస్తే ఏం మారింది? ధరలో డిఫరెన్స్‌ ఎంత?
పల్సర్ N250 వర్సెస్‌ పల్సర్ N250SS... ఈ రెండు బైక్‌ల మధ్య ప్రధాన తేడాలేంటి?
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Third Front: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Tea With Snacks : సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Embed widget