అన్వేషించండి

2025 Toyota Hilux పికప్‌ ట్రక్‌ ఆవిష్కరణ - EV, డీజిల్‌, పెట్రోల్‌ వేరియంట్లతో భారీ అప్‌డేట్స్‌

Toyota, తన Hilux పికప్‌ ట్రక్‌ను EV, డీజిల్‌ & పెట్రోల్‌ వేరియంట్లలో ఆవిష్కరించింది. 59.2kWh బ్యాటరీతో EV వెర్షన్‌ 240 కి.మీ. రేంజ్‌ ఇస్తుంది. కొత్త ఫీచర్లతో లుక్‌ అద్భుతంగా మారింది.

New Toyota Hilux 2025: టయోటా అభిమానుల కోసం పెద్ద గుడ్‌ న్యూస్‌!. ఈ కంపెనీ, తన ప్రసిద్ధ పికప్‌ ట్రక్‌ Hilux‌ ను కొత్త జనరేషన్‌లో ఆవిష్కరించింది. ఈసారి Hilux మునుపెన్నడూ లేని రీతిలో అప్‌డేట్‌ అయింది. పవర్‌ట్రెయిన్‌, డిజైన్‌, ఫీచర్లు అన్నీ పూర్తిగా రిఫ్రెష్‌ చేశారు. ముఖ్యంగా, మొదటిసారి ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ కూడా అందుబాటులోకి వస్తోంది.

పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లు - EV నుంచి డీజిల్‌ దాకా!
కొత్త Hilux ఇప్పుడు మూడు వెర్షన్లలో లభిస్తుంది, అవి - ఎలక్ట్రిక్‌ (EV), పెట్రోల్‌ (2.7L) & డీజిల్‌ (2.8L). EV వెర్షన్‌లో 59.2 kWh బ్యాటరీ, డ్యూయల్‌ మోటార్‌ సెటప్‌ ఉంది. ఇది ఫుల్‌టైమ్‌ AWD (ఆల్‌ వీల్‌ డ్రైవ్‌‌) సిస్టమ్‌తో వస్తుంది. ఫ్రంట్‌ మోటార్‌ 205Nm, రియర్‌ మోటార్‌ 268Nm టార్క్‌ ఇస్తాయి.

Toyota అందించిన డేటా ప్రకారం, ఈ EV వెర్షన్‌ 240 km WLTP రేంజ్‌ ఇస్తుంది. పేలోడ్‌ కెపాసిటీ 715 kg, టోవింగ్‌ కెపాసిటీ 1,600 kg. అదే సమయంలో “బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ ఛార్జింగ్‌ సిస్టమ్‌” ఉన్నట్టు Toyota చెబుతోంది. ఇక, డీజిల్‌ వేరియంట్‌లో 48V మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ ఉంది, ఇది Fortuner Neo Drive లాగే ఇంజిన్‌కి యాక్సిలరేషన్‌లో సపోర్ట్‌ ఇస్తుంది. దీని టోవింగ్‌ కెపాసిటీ 3,500 kg, పేలోడ్‌ 1 టన్ను వరకు ఉంది.

బాడీ-ఆన్-ఫ్రేమ్‌ స్ట్రక్చర్‌ & మల్టీ-టెర్రెయిన్‌ మోడ్‌
దీనిని Toyota IMV ప్లాట్‌ఫామ్‌పైనే నిర్మించారు కానీ, కొత్తగా EV ఆప్షన్‌ జోడించడం విశేషం. అలాగే 700mm వాటర్‌ వేడింగ్‌ డెప్త్‌, మల్టీ-టెర్రెయిన్‌ సెలెక్ట్‌ సిస్టమ్‌ & ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టీరింగ్‌ వంటి కొత్త ఫీచర్లు ఈ జనరేషన్‌లో మొదటిసారిగా కనిపిస్తున్నాయి.

2028 నాటికి హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ Hilux విడుదల చేయనున్నట్టు Toyota ధృవీకరించింది, ఇది భవిష్యత్‌ పికప్‌ ట్రక్‌లకు దారి చూపే నిర్ణయం.

ఇంటీరియర్‌ డిజైన్‌ - టెక్నాలజీతో నిండిన క్యాబిన్‌
Toyota Hilux 2025 ఇంటీరియర్‌ ఇప్పుడు పూర్తిగా మోడరన్‌ అయ్యింది. డ్యూయల్‌ 12.3-ఇంచ్‌ డిస్‌ప్లేలు, 3-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్‌, వెంటిలేటెడ్‌ సీట్స్‌, 360° కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌, డ్రైవర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు వచ్చి చేరాయి. 

ADAS సూట్‌లో లో-స్పీడ్‌ యాక్సిలరేషన్‌ సప్రెషన్‌, ప్రో-యాక్టివ్‌ డ్రైవింగ్‌ అసిస్ట్‌, ఎమర్జెన్సీ స్టాప్‌ సిస్టమ్‌ వంటి కొత్త సేఫ్టీ ఫీచర్లు కూడా జోడించారు.

ఎక్స్‌టీరియర్‌ లుక్‌ - మరింత మస్క్యులర్‌గా!
బయటకు చూస్తే కొత్త Hilux స్టైల్‌ పూర్తిగా రీడిజైన్‌ అయింది. స్లిమ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, పెద్ద TOYOTA లెటరింగ్‌, స్కిడ్‌ ప్లేట్‌, హనీ కాంబ్‌ గ్రిల్‌... ఈ బండి లుక్‌ని బలంగా చూపిస్తున్నాయి. EV వెర్షన్‌లో గ్రిల్‌ మూసివేసిన స్టైల్‌లో ఉంటుంది. వెనుక భాగంలో పెద్ద C-షేప్‌ LED లైట్లు, బోల్డ్‌ టెయిల్‌గేట్‌ డిజైన్‌ ఉన్నాయి.

లాంచ్‌ ప్లాన్‌ - ముందు EV, ఆ తరువాత ICE వెర్షన్‌
Toyota Hilux EVని డిసెంబర్‌ 2025 నుంచి, ICE వెర్షన్లను (పెట్రోల్‌ & డీజిల్‌) 2026 మధ్య నుంచి గ్లోబల్‌ మార్కెట్లలో లాంచ్‌ చేస్తుంది. భారత్‌లో కూడా 2030 నాటికి Toyota 15 కొత్త మోడళ్లు తీసుకురానుంది. వాటిలో ఈ Hilux కొత్త జనరేషన్‌ కూడా ఉండే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget