అన్వేషించండి

డ్రైవింగ్‌ ఫన్‌, కంఫర్ట్‌ సూపర్‌, కానీ కొన్ని ఫీచర్లు మిస్‌! - Citroen Basalt X కొనడానికి ముందు ఇవి తెలుసుకోండి

కూపే SUVలలో Citroen Basalt X హాట్‌ టాపిక్‌. దాని డ్రైవింగ్‌, కంఫర్ట్‌ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ... కొన్ని ఫీచర్ల కొరత, లిమిటెడ్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌ కొనుగోలుదారులను ఆలోచింపజేస్తోంది.

Citroen Basalt X Full Review Explained: కూపే SUV లుక్స్‌తో యువతరాన్ని ఆకట్టుకుంటున్న కొత్త మోడల్‌ సిట్రోయెన్‌ బాసాల్ట్‌ X. ఈ మిడ్‌సైజ్‌ SUV తన స్టైలింగ్‌, డ్రైవ్‌ క్వాలిటీతో ఆకర్షిస్తున్నా, కొన్ని మిస్‌ అయిన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారును కొనుగోలు చేయదలచినవారు ఏమేం గమనించాలో తెలుసుకుందాం.

డ్రైవింగ్‌ & హ్యాండ్లింగ్‌
Citroen Basalt X రోడ్డుపై నడిపితే అద్భుతమైన డ్రైవ్‌ క్వాలిటీని ఫీల్‌ కావచ్చు. సస్పెన్షన్‌ సెటప్‌ సాఫ్ట్‌గా ఉండటంతో బంప్స్‌, గుంతల రోడ్లను కూడా సులభంగా తట్టుకుంటుంది. లైట్‌ స్టీరింగ్‌ మరో ప్లస్‌ పాయింట్‌, చేతుల్లో చక్రంలా తిరుగుతుంది & సులభంగా ఉంటుంది. ఈ SUV హై గ్రౌండ్‌ క్లియరెన్స్‌ కారణంగా సిటీ, హైవే రెండింట్లోనూ కంఫర్ట్‌గా డ్రైవ్‌ చేయవచ్చు.

టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌
Citroen Basalt X లో 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది, ఇది 110 hp పవర్‌, 190-205 Nm టార్క్‌ ఇస్తుంది. మాన్యువల్‌ & ఆటోమేటిక్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. కారును స్టార్ట్‌ చేసినప్పుడు తొలుత కొంచెం ల్యాగ్‌ ఉన్నా, టర్బో కిక్‌ ఇన్‌ అయిన తర్వాత రెస్పాన్స్‌ బాగుంటుంది. రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌లలో ఆటోమేటిక్‌ వెర్షన్‌ సిటీలో లీటరుకు 9.87 కి.మీ.లు, హైవే మీద లీటరుకు 15.01 కి.మీ. ఇచ్చింది.

స్పేస్‌ & కంఫర్ట్‌
కూపే రూఫ్‌లైన్‌ ఉన్నా, వెనుక సీట్లలో హెడ్‌రూమ్‌ బాగుంది. ముగ్గురు పెద్దవాళ్లు కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. టాప్‌ ట్రిమ్‌లో 3-స్టెప్‌ అడ్జస్టబుల్‌ అండర్‌-థై సపోర్ట్‌ కూడా ఉంది, దీని వల్ల లాంగ్‌ డ్రైవ్‌లలో సౌకర్యం మరింత పెరుగుతుంది.

విలువకు తగిన ధర
తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.95 లక్షల నుంచి 13.10 లక్షల రూపాయల మధ్య ఎక్స్‌-షోరూమ్‌ ధరతో బసాల్ట్‌ X ‘వాల్యూ ఫర్ మనీ’ SUVగా నిలుస్తోంది. అదే సెగ్మెంట్‌లోని కాంపాక్ట్‌ SUVలతో పోలిస్తే ఇది పెద్ద సైజు, మెరుగైన డ్రైవ్‌, స్టైలిష్‌ లుక్‌ అందిస్తోంది. ఉదాహరణకు, టాప్‌ ట్రిమ్‌ Hyundai Venue కంటే దాదాపు ₹1.7 లక్షలు చౌకగా ఉంటుంది.

లోపాలేమిటి?
బసాల్ట్‌ Xలో 1.2 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ వెర్షన్‌ కూడా ఉంది. కానీ గేర్‌షిఫ్ట్‌లు స్మూత్‌గా ఉండవు. క్లచ్‌ హార్ష్‌గా, గేర్‌బాక్స్‌ నాచ్‌గా ఉంటుంది. సన్‌రూఫ్‌, ADAS, టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌, పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌, ప్రీమియం ఆడియో సిస్టమ్‌ వంటి ఫీచర్లు కూడా మిస్‌ అయ్యాయి.

సర్వీస్‌ నెట్‌వర్క్‌ పరిమితం
సిట్రోయెన్‌ బ్రాండ్‌ ఇప్పటికీ భారత్‌లో కొత్తది. మెట్రో నగరాల బయట డీలర్‌ నెట్‌వర్క్‌ పరిమితంగా ఉండటంతో, కొంతమంది కస్టమర్లు వెనుకంజ వేస్తున్నారు.

యూత్‌ఫుల్‌ లుక్‌, డ్రైవ్‌ క్వాలిటీ, కంఫర్ట్‌, డిజైన్‌ విషయంలో బాసాల్ట్‌ X మంచి SUV. కానీ ఫీచర్ల కొరత, లిమిటెడ్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌ వంటివి కస్టమర్లు ఆలోచించే అంశాలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. ధర రూ.11.80 లక్షలు.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే!
టాటా ఏరిస్ iCNG కొనబోతున్నారా? ముందు ఈ 2 మైనస్‌ల గురించి తప్పక తెలుసుకోండి
Tata Aeris CNG కారు కొనొచ్చా, లేదా? ప్లస్‌లు, మైనస్‌లు తెలిస్తే నిర్ణయం ఈజీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget