అన్వేషించండి

Tata Harrier EV కోసం ఎగబడుతున్న జనం - 10 వారాల వెయిటింగ్‌ టైమ్‌!

టాటా హ్యారియర్‌ EVకి దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌తో 8-10 వారాల వెయిటింగ్‌ టైమ్‌ పడుతోంది. Fearless+ & Empowered వేరియంట్లు ప్రత్యేకంగా హాట్‌ సేలింగ్‌లో ఉన్నాయి.

Tata Harrier EV waiting period: టాటా మోటార్స్‌ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన హ్యారియర్‌ EV ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ SUV సెగ్మెంట్‌లో పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. కంపెనీ, 2025 జూన్‌ నెలలో ఈ ఫ్లాగ్‌షిప్‌ EVని ప్రారంభించింది, ఇప్పుడు దానికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఏర్పడింది. ప్రత్యేకంగా Fearless+ & Empowered ట్రిమ్స్‌ కోసం వెయిటింగ్‌ పీరియడ్‌ 8 నుంచి 10 వారాల వరకు పెరిగింది.

డెలివరీ కోసం ఎక్కువ సమయం
హ్యారియర్‌ EV బేస్‌ వేరియంట్లు తక్కువ సమయంలో అందుబాటులో ఉన్నా... Fearless+ (₹23.99-₹24.99 లక్షలు) & Empowered (₹27.49-₹28.99 లక్షలు) వేరియంట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఈ వేరియంట్లు 65kWh & 75kWh బ్యాటరీ కాన్ఫిగరేషన్లలో లభిస్తున్నాయి. రెండు వెర్షన్లకీ డెలివరీ సమయం దాదాపు 8-10 వారాల వరకు ఉంది. AC ఫాస్ట్‌ చార్జర్‌ (ACFC) ఉన్నా, లేకపోయినా ఈ డిమాండ్‌ ఇలాగే ఉంది.

స్టెల్త్‌ ఎడిషన్‌కి కూడా భారీ డిమాండ్‌
టాటా అందించిన ప్రత్యేకమైన Harrier EV Stealth Edition కూడా బయ్యర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఎడిషన్‌ Empowered ట్రిమ్‌ కంటే ₹75,000 అదనపు ధరకు లభిస్తుంది. దీని కోసం కూడా అదే 8-10 వారాల వెయిటింగ్‌ టైమ్‌ ఉండటం డిమాండ్‌ ఎంత పెరిగిందో చూపిస్తోంది.

బ్యాటరీ ఆప్షన్లు & పనితీరు

Harrier EVలో ఎక్కువగా రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (RWD) సిస్టమ్‌ స్టాండర్డ్‌గా ఉంటుంది. 65kWh & 75kWh బ్యాటరీ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.

65kWh RWD వేరియంట్‌ ఫుల్‌ చార్జ్‌తో 538 కి.మీ. రేంజ్‌ ఇస్తుంది.

75kWh RWD వేరియంట్‌ అయితే ఫుల్‌ చార్జ్‌తో 627 కి.మీ. రేంజ్‌ అందిస్తుంది, ఇది హ్యారియర్‌ EVలో అత్యధిక రేంజ్‌ కలిగిన మోడల్‌.

టాప్‌ వేరియంట్‌ Empowered 75 AWD వెర్షన్‌ అందుబాటులో ఉంది. ఇది, ముందు యాక్సిల్‌పై అదనంగా ఒక మోటార్‌తో, మొత్తం 313hp పవర్‌ & 504Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్‌ కూడా 622 కి.మీ. వరకు ఉంటుంది.

ఇంజిన్‌ అవుట్‌పుట్‌ & డ్రైవింగ్‌ అనుభవం
హ్యారియర్‌ EV RWD వేరియంట్లు 238hp పవర్‌, 315Nm టార్క్‌ అందిస్తాయి. కంపెనీ, ఈ ఎలక్ట్రిక్‌ SUVలో టాటా నెక్స్ట్‌-జెన్‌ ఆర్కిటెక్చర్‌ ఉపయోగించింది. ఈ టెక్నాలజీ... బ్యాటరీ సేఫ్టీ, చార్జింగ్‌ ఎఫిషెన్సీ & స్టెబిలిటీ పరంగా మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

టాటా ఈ EVని 21.49 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో ప్రారంభించగా, టాప్‌ వేరియంట్‌ ధర ₹28.99 లక్షలు వరకు ఉంటుంది. హోమ్‌ చార్జర్‌ ఇన్‌స్టలేషన్‌ ఖర్చు దీనికి అదనం.

డిమాండ్‌ ఎందుకు పెరుగుతోంది?

  1. కొత్త డిజైన్‌ & ప్రీమియం ఇంటీరియర్‌
  2. 600+ కి.మీ. రేంజ్‌ సామర్థ్యం
  3. టాటా బ్రాండ్‌ నమ్మకమైన సర్వీస్‌ నెట్‌వర్క్‌
  4. అడ్వాన్స్‌ సేఫ్టీ ఫీచర్లు
  5. EV బయ్యర్లలో పెరుగుతున్న నమ్మకం

ఎలక్ట్రిక్‌ SUV సెగ్మెంట్‌లో టాటా హ్యారియర్‌ EV ప్రస్తుతం హాట్‌ సేల్‌గా మారింది. మీరు ఈ EVని కొనాలనుకుంటే ముందుగానే బుకింగ్‌ చేయడం మంచిది. ఎందుకంటే Fearless+ & Empowered వేరియంట్ల కోసం కనీసం రెండు నెలల నుంచి రెండున్నర నెలల వెయిటింగ్‌ పీరియడ్‌ తప్పదని డీలర్లు చెబుతున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Regenerative Braking In EVs: ఫుల్ ఛార్జింగ్‌తో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారా? ఎలక్ట్రిక్‌ కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం!
ఎలక్ట్రిక్‌ కారును 100 శాతం ఛార్జ్ చేస్తే రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎందుకు ఆగిపోతుంది? కారణమిదే!
LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?
ఎలక్ట్రిక్ కారులో LFP లేదా NMC బ్యాటరీల్లో ఏది బెస్ట్? తెలుగు రాష్ట్రాల వాతావరణానికి ఏది సరిపోతుంది?
Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget