అన్వేషించండి

TVS Apache RR 310 బైక్‌ కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 6 కీ పాయింట్లు

TVS Apache RR 310 ఒక పాపులర్‌ స్పోర్ట్స్‌ బైక్‌. ఇంజిన్‌, ఫీచర్లు, ప్రైస్‌, కిట్స్‌ వంటి 6 ముఖ్య అంశాలను తెలుసుకుని కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

TVS Apache RR 310 BTO Kits: స్పోర్ట్స్‌ బైక్‌ అనగానే యువతకు మొదట గుర్తుకు వచ్చేది TVS Apache RR 310. స్టైల్‌, పెర్ఫార్మెన్స్‌, టెక్నాలజీ - ఈ మూడు అంశాలు కలిపి ఈ బైక్‌ని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఈ స్టన్నింగ్‌ బైక్‌ను కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. వాటిలో 6 ముఖ్య పాయింట్లు మీ కోసం...

1. ఇంజిన్‌ శక్తి & పనితీరు

Apache RR 310లో 312.2 సీసీ సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. గత సంవత్సరం కంపెనీ దీనిని మరింత మెరుగుపరిచింది, కొత్త లైట్‌వెయిట్‌ ఫోర్జ్డ్‌ పిస్టన్‌, పెద్ద ఎయిర్‌ బాక్స్‌ ఇచ్చింది. ఫలితంగా, ఇప్పుడు ఇది 38PS పవర్‌ @ 9,800 rpm, 29Nm టార్క్‌ @ 7,900 rpm ఇస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది సుమారు 4hp పవర్‌, 1.7Nm టార్క్‌ ఎక్కువ. అంతే కాదు, ఇప్పుడు Apache RR 310లో బై-డైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌ కూడా ఉంది. కంపెనీ క్లెయిమ్‌ ప్రకారం, ఇది 0-100 kmph స్పీడ్‌ను కేవలం 6.74 సెకండ్లలోనే చేరుతుంది.

2. ట్యాంక్‌ కెపాసిటీ, బరువు & సీటు హైట్‌

Apache RR 310లో 11 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఉంది. బైక్‌ బరువు 174 కిలోలు, సీటు ఎత్తు 810mm. అంటే 5.7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న రైడర్స్‌కి ఇది కంఫర్ట్‌గా సరిపోతుంది.

3.️ ఫీచర్లు & టెక్‌ ఫ్రెండ్లీ ఆప్షన్లు

Apache RR 310లో ఉన్న 5 అంగుళాల TFT స్క్రీన్‌ చాలా అట్రాక్టివ్‌ ఫీచర్‌. దీనిలో నాలుగు రైడింగ్‌ మోడ్‌లు - స్పోర్ట్‌, ట్రాక్‌, అర్బన్‌, రెయిన్‌ ఉన్నాయి. ఇంకా... ఇందులో Bluetooth కనెక్టివిటీ (SmartXonnect App) సపోర్ట్‌ ఉంది. అలాగే Glide Through Technology (GTT+) ఫీచర్‌ కూడా ఉంది. అంటే, కేవలం క్లచ్‌ వదిలితే బైక్‌ సాఫ్ట్‌గా కదలడం మొదలవుతుంది, ట్రాఫిక్‌లో ఇది చాలా యూజ్‌ఫుల్‌ ఫీచర్‌.

4. టైర్లు & హ్యాండ్లింగ్‌

ఈ బైక్‌కు బిగించిన Michelin Road 5 టైర్లు స్పీడీ రైడింగ్‌లోనూ అద్భుతమైన గ్రిప్‌ ఇస్తాయి. ముందు భాగంలో 110/70 R17, వెనుక భాగంలో 150/60 R17 టైర్లు ఉన్నాయి. స్పోర్టీ రైడ్‌ అనుభూతి కోసం ఇవి చాలా సహాయపడతాయి.

5. BTO డైనమిక్స్‌ & డైనమిక్‌ ప్రో కిట్స్‌

Apache RR 310 బైక్‌ ప్రత్యేకతల్లో ఒకటి - బిల్ట్‌ టు ఆర్డర్‌ (Built To Order - BTO) సిస్టమ్‌.

డైనమిక్‌ కిట్‌లో అడ్జస్టబుల్‌ KYB ఫ్రంట్‌ ఫోర్క్‌, బ్రాస్‌ కోటెడ్‌ చైన్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ లభిస్తాయి. డైనమిక్‌ ప్రో కిట్‌ అయితే ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది, ఇందులో 6-యాక్సిస్‌ IMU, క్రూయిజ్‌ కంట్రోల్‌, కార్నరింగ్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌, వీలీ కంట్రోల్‌, కార్నరింగ్‌ ABS‌, రియర్‌ లిఫ్ట్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వంటి ప్రీమియం రైడర్‌ ఎయిడ్స్‌ ఉంటాయి. అదనంగా రేస్‌ గ్రాఫిక్స్‌, పర్సనలైజ్డ్‌ రేసింగ్‌ నంబర్‌ కూడా వస్తాయి.

6. ధర వివరాలు (GST 2.0 తర్వాత)

Apache RR 310 బేస్‌ వేరియంట్‌ ధర ₹2.56 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, తెలుగు రాష్ట్రాలు). క్విక్‌షిఫ్టర్‌ కలిగిన బేస్‌ వేరియంట్‌ ధర ₹2.72 లక్షలు, డైనమిక్‌ కిట్‌ కోసం అదనంగా ₹18,000 & డైనమిక్‌ ప్రో Pro కిట్‌ కోసం ₹16,000 చెల్లించాలి.

స్టైల్‌, టెక్నాలజీ & పెర్ఫార్మెన్స్‌ - ఈ మూడు అంశాల్లో Apache RR 310 సూపర్‌. 300cc క్లాస్‌లో ప్రీమియం ఫీల్‌ కోరుకునే యువ రైడర్స్‌కి ఇది సరైన చాయిస్‌. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినా, ఈ బైక్‌ ఇచ్చే అనుభవం మాత్రం నిజంగా "వర్త్‌ ఫర్‌ ఎవ్రి రూపీ" అని చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget