అన్వేషించండి

Tata Nexon, Mahindra XUV 3XO డీజిల్‌ రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - ఏ కారు బెస్ట్‌ ఇచ్చింది?

టాటా నెక్సాన్‌, మహీంద్రా XUV 3XO డీజిల్‌ SUVs‌లో, వాస్తవ ప్రపంచంలో ఏ కారుది మంచి మైలేజ్‌?. టెస్ట్‌ రిజల్ట్స్‌ ఆధారంగా పూర్తి విశ్లేషణ ఈ కథనంలో చూడండి.

Tata Nexon vs Mahindra XUV 3XO Mileage Comparison: కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌లో డీజిల్‌ వేరియంట్‌ కొనాలనుకునేవారికి ప్రస్తుతం రెండు పెద్ద ఆప్షన్‌లు కనిపిస్తున్నాయి, అవి - టాటా నెక్సాన్‌ & మహీంద్రా XUV 3XO. ఈ రెండూ దేశీయ బ్రాండ్లు, రెండింటికీ 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఉంది, అలాగే 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ కూడా ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే... రోజువారీ వాడకంలో ఏ బండిది మంచి మైలేజ్‌?

ఇంజిన్‌ పనితీరు & పవర్‌
మహీంద్రా XUV 3XO డీజిల్‌ ఇంజిన్‌ 115hp పవర్‌ & 300Nm టార్క్‌ను ఇస్తుంది. టాటా నెక్సాన్‌ డీజిల్‌ 113hp పవర్‌, 260Nm టార్క్‌ అందిస్తుంది. XUV 3XOకి 2hp పవర్‌ & 40Nm టార్క్‌ అదనంగా ఉన్నా, దాని బరువు నెక్సాన్‌ కంటే 112 కిలోలు ఎక్కువ. ఈ బరువు కారణంగా, నెక్సాన్‌ 0-100 కి.మీ./గం యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో XUV 3XO కంటే వేగంగా దూసుకెళ్లింది, దాని కంటే ముందే 100 కి.మీ./గం వేగాన్ని అందుకుంది.

ట్యాంక్‌ కెపాసిటీ & ARAI మైలేజ్‌
టాటా నెక్సాన్‌ డీజిల్‌కి 44 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఉండగా, మహీంద్రా XUV 3XO డీజిల్‌లో 42 లీటర్ల ట్యాంక్‌ ఉంది. అదనంగా, ARAI సర్టిఫైడ్‌ ఫ్యూయల్‌ ఎఫిషెన్సీలో నెక్సాన్‌కి 2.63 kmpl మైలేజ్‌ అధికంగా ఉంది. అంటే, ట్యాంక్‌ ఫుల్‌గా నిండితే XUV 3XO కంటే Nexon కొంచెం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

సిటీ & హైవే టెస్ట్‌ రిజల్ట్స్‌
ఎక్స్‌పర్ట్‌ టీమ్‌ నిర్వహించిన రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లలో, టాటా నెక్సాన్‌ డీజిల్‌ సిటీలో లీటరుకు సుమారు 3 km ఎక్కువ మైలేజ్‌ ఇచ్చింది. హైవేలో కూడా 2 km తేడా కనిపించింది. మొత్తంగా, నెక్సాన్‌కి సగటు రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ XUV 3XO కంటే లీటరుకు 2.5 km ఎక్కువగా రికార్డు అయింది. అంటే, ఒక పూర్తి ట్యాంక్‌తో XUV 3XO కంటే నెక్సాన్‌ దాదాపు 141 కి.మీ. ఎక్కువ దూరం వెళ్లగలదు.

టెస్ట్‌ నియమాలు
ఎక్స్‌పర్ట్‌ టీమ్‌ ఈ టెస్ట్‌ను నవీ ముంబయి పరిసరాల్లో నిర్వహించింది. ప్రతి వాహనం ట్యాంక్‌ను ఫుల్‌ చేసిన తర్వాత సిటీ & హైవే రూట్‌లలో డ్రైవ్‌ చేశారు. టైర్‌ ప్రెషర్‌ను కార్‌ కంపెనీ సిఫారసుల ప్రకారం సెట్‌ చేశారు. ఏసీ, ఆడియో సిస్టమ్‌, లైటింగ్‌ వంటివి సాధారణ వాడకం మాదిరిగానే ఉపయోగించారు. డ్రైవర్‌లను మారుస్తూ టెస్ట్‌ను నిష్పక్షపాతంగా చేశారు. ప్రతి లూప్‌ పూర్తయ్యాక ట్యాంక్‌ మళ్లీ నింపి, ఖచ్చితమైన మైలేజ్‌ లెక్కించారు.

ధరలు
ధరల విషయానికి వస్తే, రెండు SUVs కూడా దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో Mahindra XUV 3XO డీజిల్‌ వేరియంట్‌ ధరలు ₹8.95 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. Tata Nexon డీజిల్‌ వేరియంట్‌ ధరలు ₹9.01 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతాయి. అంటే, XUV 3XO రేటు నెక్సాన్‌ కంటే సుమారు ₹6,000 తక్కువలోనే మొదలవుతుంది. డీజిల్‌లో టాప్‌ వేరియంట్‌ నెక్సాన్‌ కంటే ₹1,000 తక్కువ ధరతో అందుబాటులో ఉంది.

సమగ్రంగా చూస్తే, టాటా నెక్సాన్‌ డీజిల్‌ నిజ జీవిత మైలేజ్‌లో స్పష్టమైన ఆధిక్యం చూపింది. బెటర్‌ ఎఫిషెన్సీ, పెద్ద ట్యాంక్‌, తక్కువ బరువు వంటి అంశాలు నెక్సాన్‌ను ఈ పోటీలో ముందుంచాయి. మహీంద్రా XUV 3XO అయితే, పవర్‌ ఎక్కువ ఉన్నప్పటికీ, రియల్‌ వరల్డ్‌ ఎఫిషెన్సీలో కొద్దిగా వెనకబడింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget