అన్వేషించండి

Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు

న్యూజిలాండ్ లో నెట్ ప్రాక్టీస్ సందర్భంగా జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందించిన టెంపుల్ హెల్త్ వేరబుల్ పరికరాన్ని శుభ్‌మన్ గిల్ పరీక్షించాడు.

Gill Tests Temple Wearable : భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక సరికొత్త టెక్నాలజీ గ్యాడ్జెట్‌ను పరీక్షించి ఆశ్చర్యపోయాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందించిన వినూత్న 'టెంపుల్' హెల్త్ వేరబుల్ పరికరాన్ని గిల్ ఉపయోగించాడు. టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌లతో కలిసి నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గిల్ ఈ డివైజ్‌ను ధరించాడు. సాధారణ ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్ వాచ్‌ల మాదిరిగా కాకుండా నుదిటి పక్కభాగంలో ధరించేలా దీనిని డిజైన్ చేశారు. ఈ పరికరం అందించిన ప్రారంభ డేటా, పనితీరు పట్ల గిల్ ఎంతో ఇంప్రెస్ అయ్యాడని ఒక నివేదిక వెల్లడించింది. సాంప్రదాయ ఫిట్‌నెస్ వాచ్‌లకు భిన్నంగా ఉన్న ఈ గాడ్జెట్ ఇప్పుడు మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: Saikia WPL Expansion: ఐదు జట్ల పరిమితికి ఇక చెక్ పెట్టనున్న బీసీసీఐ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కొత్త టీమ్‌ల ఎంట్రీ

మెదడులోని రక్తప్రసరణ మార్పులను నిరంతరం ట్రాక్ చేయడం ఈ పరికరం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం 'బ్రెయిన్‌ఫ్లో' అనే అత్యాధునిక వ్యవస్థను ఉపయోగించారు. నుదిటి భాగంలోని కణజాలాలు, రక్తనాళాల నుంచి సిగ్నల్స్ సేకరించి రోజువారీ కదలికలు, శరీర భంగిమలు మెదడు రక్తప్రసరణపై ఎలాంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించేందుకు ఇది సహకరిస్తుంది. రాబోయే వారంలోనే ఈ డివైజ్ ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయని దీపిందర్ గోయల్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో రానున్న ఈ పరికరం ధర మార్కెట్లో సుమారు 85 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది.

Read Also: Ferguson Henry Blow: కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్ మిగిలిన సిరీస్ కు దూరం.. భారత్ పై చావోరేవో పోరుకు ముందే న్యూజిలాండ్ కు భారీ ఎదురుదెబ్బ

బ్రెయిన్‌ఫ్లో టెక్నాలజీ ప్రత్యేకతలు: సరికొత్త పద్ధతిలో హెల్త్ మానిటరింగ్
సాధారణంగా చేతికి ధరించే స్మార్ట్ వాచ్‌లు హృదయ స్పందనలు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను మాత్రమే కొలుస్తాయి. అయితే టెంపుల్ వేరబుల్ నేరుగా నుదిటిపై అమరి ఉండటం వల్ల మెదడుకు చేరే రక్త ప్రవాహ వేగాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తుంది. క్రీడాకారులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా కఠినమైన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వారి మెదడు ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గిల్ లాంటి స్టార్ క్రికెటర్ ఈ గ్యాడ్జెట్‌ను టెస్ట్ చేయడంతో టెక్ ప్రియుల్లోనూ దీనిపై భారీ అంచనాలు పెరిగాయి.

ఆరు రంగుల్లో లభ్యం: ప్రీ ఆర్డర్లకు రంగం సిద్ధం
లాంచ్ ఎడిషన్‌లో భాగంగా టెంపుల్ వేరబుల్ ట్రూ గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ మిర్రర్, రియల్ జేడ్, డీప్ బ్లూ, పర్పుల్ ఫంక్ వంటి ఆరు ప్రీమియం కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఎర్లీ యాక్సెస్ వెయిట్‌లిస్ట్‌లో ఉన్న వినియోగదారులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని దీపిందర్ గోయల్ స్పష్టం చేశాడు. అత్యంత ఖరీదైన ఈ హెల్త్ ట్రాకర్ భారత మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

WPL Expansion: ఐదు జట్ల పరిమితికి ఇక చెక్ పెట్టనున్న బీసీసీఐ.. WPLలో కొత్త టీమ్‌ల ఎంట్రీ, సైకియా సంచలన ప్రకటన
ఐదు జట్ల పరిమితికి ఇక చెక్ పెట్టనున్న బీసీసీఐ.. WPLలో కొత్త టీమ్‌ల ఎంట్రీ, సైకియా సంచలన ప్రకటన
Ferguson, Henry Blow: కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్.. ఫెర్గూసన్, హెన్రీ మిగిలిన సిరీస్ కు దూరం
కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్.. ఫెర్గూసన్, హెన్రీ మిగిలిన సిరీస్ కు దూరం
Bhuvi Bowling Form: భువీ బౌలింగ్‌లో ఆ పదును ఏమైంది..? వెటరన్ పేసర్ బౌలింగ్ పై దిగ్గ‌జ స్పిన్న‌ర్ ఘాటు విమర్శలు
భువీ బౌలింగ్‌లో ఆ పదును ఏమైంది..? వెటరన్ పేసర్ బౌలింగ్ పై దిగ్గ‌జ స్పిన్న‌ర్ ఘాటు విమర్శలు
Tilak, Gambhir Target: 3-0 ఆధిక్యంలో ఉన్నా తగ్గేదేలే అంటున్న తిలక్.. కివీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం
3-0 ఆధిక్యంలో ఉన్నా తగ్గేదేలే అంటున్న తిలక్.. కివీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం, గంభీర్ మాస్టర్ ప్లాన్ బయటపెట్టిన వైస్ కెప్టెన్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget