Cryptocurrency Prices Today: స్థిరంగా బిట్‌కాయిన్.. మిగతావి డౌన్‌లో..! మార్కెట్లో అస్థిరత్వం..!
క్రిప్టో మార్కెట్ అస్థిరంగా ఉంది. ఎక్కువ కొనుగోళ్లేమీ లేవు. ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పది రోజుల్లోనే బిట్‌కాయిన్ మార్కెట్ విలువ 90 నుంచి 85 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
క్రిప్టో కరెన్సీ ధరలు బుధవారం నిలకడగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు పరిమితంగా కొనుగోళ్లు చేపట్టడంతో కొన్ని లాభాల్లో, కొన్ని నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 24 గంటల్లో బిట్‌కాయిన్ విలువ 0.29 శాతం పెరిగి రూ.49,33,766 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం బిట్‌కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా రూ.85 ట్రిలియన్లుగా ఉంది.
ఎథిరెమ్ 1.47 శాతం తగ్గి రూ.3,45,602 వద్ద ఉంది. టెథెర్ (యూఎస్‌డీటీ) 1.81 శాతం పెరిగి రూ.82.96, రిపిల్ (ఎక్స్‌ఆర్‌పీ) 1.65 శాతం తగ్గి రూ.89.69 వద్ద కొనసాగుతున్నాయి. కర్డానో (ఏడీఏ) 3.49శాతం తగ్గి రూ.152.30, పొల్కాడాట్ (డీఓటీ) 2.95 శాతం తగ్గి రూ.3318, డోజీకాయిన్ (డీవోజీఈ) 2.92 శాతం తగ్గి రూ.19.59 వద్ద ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో మరో ముందడుగు.. తాజా అప్‌డేట్ ఇదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి