News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gold Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా

Gold Price In Hyderabad: బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తూ, ఆల్ టైమ్ రికార్డు ధరల దిశగా దూసుకెళ్తోంది. తాజాగా రూ.280 మేర పుంజుకుంది.

FOLLOW US: 
Share:

Gold Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశి నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తూ, ఆల్ టైమ్ రికార్డు ధరల దిశగా దూసుకెళ్తోంది.  తాజాగా రూ.280 మేర పుంజుకోవడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,350 అయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌ (Gold Rates Today In Hyderabad)లో రూ.46,150 గా ఉంది. ఇక వెండి ధర రూ.700 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,500 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలతో ట్రేడింగ్ జరుగుతోంది. 

ఇక ఏపీలోనూ బంగారం ధరలు (Gold Rates Today In AP) మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 మేర పెరగడంతో విజయవాడలో నేడు 10 గ్రాముల పసిడి ధర రూ.46,150 అయింది. రూ.280 మేర పుంజుకోవడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 అయింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,500 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో రూ.280 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 అయింది. ఏపీలో సైతం వెండి ధర రూ.71,500 వద్ద మార్కెట్ అవుతోంది.
Also Read: బ్యాంకుకు వెళ్లకుండానే ఖాతా తెరవొచ్చు.. ఈ-కేవైసీతో సింపుల్‌గా.. ఇంటి వద్ద నుంచే..!

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని పలు ముఖ్య నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. రాజధాని ఢిల్లీలో రూ.50 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,670 కు చేరగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,300 అయింది. చెన్నైలో రూ.210 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 కాగా, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.46,500 అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.430 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,360 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 కు చేరింది.

తగ్గిన ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర తాజాగా తగ్గింది. రూ.10 మేర తగ్గగా ఢిల్లీలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,740కి దిగొచ్చింది. ఢిల్లీ, హైదరాబాద్ విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల ప్లాటినం ఇదే ధర వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
Also Read: ఈ ఐటీ స్టాక్‌ 18 నెలల్లో లక్షకు రూ.16.65 లక్షల రాబడి ఇచ్చింది.. ఏం కంపెనీయో తెలుసా?

అనేక అంశాల పసిడి, వెండి ధరలపై ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Nov 2021 06:56 AM (IST) Tags: Gold Price Silver Price hyderabad gold silver price vijayawada gold price Gold Price Today Today gold cost Today Silver Price Platinum Price Today Gold Price Today In Hyderabad Silver Price Today Gold Price In Hyderabad

ఇవి కూడా చూడండి

Gold-Silver Price 04 October 2023: మరింత తగ్గిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 04 October 2023: మరింత తగ్గిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Cryptocurrency Prices : బిట్‌కాయిన్‌ @ రూ.22.96 లక్షలు! ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్‌

Cryptocurrency Prices : బిట్‌కాయిన్‌ @ రూ.22.96 లక్షలు! ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్‌

Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!

Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!

FD Rates: రెండు స్పెషల్‌ స్కీమ్స్‌ను క్లోజ్‌ చేసిన HDFC బ్యాంక్‌, FDలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే

FD Rates: రెండు స్పెషల్‌ స్కీమ్స్‌ను క్లోజ్‌ చేసిన HDFC బ్యాంక్‌, FDలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే

Stock Market Today: నెగెటివ్‌ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Today: నెగెటివ్‌ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

టాప్ స్టోరీస్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!