Cryptocurrency in India: బిట్‌కాయిన్‌కు పోటీగా ఆర్‌బీఐ క్రిప్టో..! ఏప్రిల్‌లో పైలట్ ప్రాజెక్ట్?
అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రిప్టో కరెన్సీకి ప్రత్యామ్నాయంగా సొంత క్రిప్టోను రూపొందించేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లో పైలట్ ప్రాజెక్టు మొదలవుతోందని తెలిసింది.
క్రిప్టో కరెన్సీ బూమ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇన్వెస్టర్లు, యువత దానిని ట్రేడ్ చేస్తున్నారు. మరోవైపు దానిపై ఎవరికీ నియంత్రణ లేదు. పారదర్శకత, జవాబుదారీ లేదు. అందుకే ఈ వర్చువల్ కరెన్సీ ఆర్థిక వ్యవస్థలకు నష్టమని ఆర్‌బీఐ పదేపదే చెబుతోంది. దానిని చట్టం పరిధిలోకి తీసుకొచ్చి నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో భారత రిజర్వు బ్యాంకు సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు చురుకుగా కసరత్తు చేస్తోంది.
ఆర్‌బీఐ సన్నద్ధం
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రక్రియ వేగవంతమైంది. ఇది నోట్ లేదా కాయిన్ రూపంలో ఉండదు. పూర్తిగా డిజిటల్ ఫార్మాట్లోనే ఉంటుంది. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్‌ను మొదలు పెడతారని తెలిసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్‌లోనే ప్రాజెక్టు ఆరంభం అవుతుందని ఆర్‌బీఐ అధికారులు పరోక్షంగా సూచిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక బ్యాంకింగ్, ఆర్థిక సదస్సుల్లో ఆర్‌బీఐ అధికారులు దీని గురించి చర్చించారు.
పరిష్కరించాల్సిన అంశాలెన్నో?
ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీపై అడిగిన ప్రశ్నలకు ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వాసుదేవన్ సమాధానాలు ఇచ్చారు. 'వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టొచ్చని అనుకుంటున్నా' అని ఆయన తెలిపారు. ఈ డిజిటల్ కరెన్సీపై ఉన్న చాలా ప్రశ్నలకు పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందన్నారు. రేపట్నుంచే సీబీసీడీ ఒక అలవాటుగా మారిపోయినా చెప్పలేమన్నారు. ఇదంతా జరగాలంటే అత్యంత పర్యవేక్షణ కావాలన్నారు. చిన్న లేదా పెద్ద స్థాయిలో అమలు చేసినా దాని ఉద్దేశం మాత్రం పక్కగా ఉండాలని స్పష్టం చేశారు.
క్రిప్టో, సీబీసీడీ వేర్వేరు
ఆర్‌బీఐ ప్రవేశపెట్టే సీబీసీడీ ఒక డిజిటల్ కరెన్సీ. ఇప్పుడున్న రూపాయిల్లానే అన్ని అవసరాలకూ వాడుకోవచ్చు. సింపుల్‌గా మీ డబ్బు డిజిటల్ ఫామ్‌లో ఉందని చెప్పొచ్చు. వీటితో చేసే లావాదేవీలు అన్నిటిపైనా ఆర్‌బీఐ నియంత్రణ ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీలపై ఏ బ్యాంకు లేదా ప్రభుత్వాలకు నియంత్రణ ఉండదు. పూర్తిగా వికేంద్రీకరణ విధానంలో ఉంటుంది. ఇందులో బ్యాంకులు కలగజేసుకోవడానికి లేదు.
Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్.. పేటీఎం ఫౌండర్ విజయ గాథ ఇది!
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది
Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి