అన్వేషించండి
Advertisement
Interim Budget 2024: రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ - శాఖల వారీగా కేటాయింపులు ఇలా!
Budget 2024: 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి రూ.47.65 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. శాఖల వారీగా కేటాయింపులు ఓసారి చూస్తే!
Sector Wise Budget Allocations 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్ సభలో 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఎక్కువగా మౌలిక వసతులపైనే దృష్టి సారించిన విత్త మంత్రి.. వ్యవసాయం, పేదలు, మహిళలు, యువత లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు చూస్తే రక్షణ రంగానికే రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. మరి మిగిలిన విభాగాలకు ఓసారి చూస్తే..
- రైల్వే రంగానికి రూ.2.55 లక్షల కోట్లు
- ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు రూ.2.78 లక్షల కోట్లు
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కోసం రూ.2.13 లక్షల కోట్లు
- హోం శాఖకు రూ.2.03 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధి కోసం రూ.1.77 లక్షల కోట్లు
- రసాయనాలు, ఎరువులు రూ.1.68 లక్షల కోట్లు
- కమ్యూనికేషన్లు రూ.1.37 లక్షల కోట్లు
- వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ.1.27 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు ఇలా
కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2024 - 2025 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు చేశారు.
- గ్రామీణ ఉపాధి హామీ పథకం - రూ.86 వేల కోట్లు
- ఆయుష్మాన్ భారత్ - రూ.7,500 కోట్లు
- పారిశ్రామిక ప్రోత్సాహకాలు - రూ.6,200 కోట్లు
- సెమీ కండక్టర్స్, డిస్ ప్లే ఎకో వ్యవస్థల తయారీ - రూ.6,903 కోట్లు
- సోలార్ విద్యుత్ గ్రిడ్ - రూ.8,500 కోట్లు
- గ్రీన్ హైడ్రోజన్ మిషన్ - రూ.600 కోట్లు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement