X

Muhurat trading 2021: దీపావళి రోజున ముహూరత్ ట్రేడింగ్.. ఆ టైమ్ లో షేర్లు కొనుగోలు చేస్తే..

దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఆ టైమ్ లో షేర్లు కొనుగోలు చేస్తే మంచిదని నమ్మకం.

FOLLOW US: 

దీపావళి రోజున ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీగా మారిందని చెప్పొచ్చు. అయితే ఆ రోజు షేర్లు కొనుగోలు చేస్తే.. మళ్లీ వచ్చే దీపావళి నాటికి సంపంద పెరుగుతుందనేది చాలా మంది నమ్మకం. ఈ దీపావళికి కూడా ముహూరత్ ట్రేడింగ్ సేషన్ నిర్వహించనున్నారు. నవంబర్ 4 06:15 PM నుంచి 07:15 PM మధ్యలో ఈ ముహూరత్ ట్రేడింగ్ సేషన్ ఉంటుంది.

ముహూరత్ ట్రేడింగ్ అనేది ఒక గంట ప్రత్యేక సెషన్ అన్నమాట. పెట్టబడిదారులు అనుసరిస్తున్న ఆచారం ఇది. ఈ సెషన్ లోని టైమ్ ఫ్రేమ్ ప్రతి ఏటా అత్యంత పవిత్రమైన గంటగా భావిస్తారు ఇన్వెస్టర్లు.  ముహూరత్ ట్రెండింగ్ సమయంలో షేర్లను కొనుగోలు చేస్తే వచ్చే దీపావళి నాటికి ఈ షేర్లు సంపద సృష్టిస్తుందని నమ్ముతారు. ఈ ముహూరత్ సెషన్ ప్రారంభానికి ముందు స్టాక్ మార్కెట్లో ట్రేడర్లు పూజ కూడా చేస్తారు. అంతేకాదు సాయంత్రం సమయంలో బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఈలలో ప్రత్యేకంగా ఓ గంటసేపు ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. ఈ సెషన్‌లో షేర్లను కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని విశ్వాసం.

నవంబర్ 4 గురువారం రోజున  ప్రీ ఓపెనింగ్ సెషన్ 06:00 PM నుంచి 06:08 PM కి ప్రారంభమవుతుంది. ప్రధాన సెషన్ 06:15 PM నుంచి 07:15 PMన  ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం సెషన్‌లో పెట్టుబడిదారులు  తమ పోర్ట్‌ఫోలియోలో స్టాక్‌లను కలుపుతారు. ఈ సెషన్ సమయంలో ఎక్కువగా కొనుగోలు చేయడం ద్వారా సానుకూల ముగింపు ఉంటుంది.

ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడు మెుదలైంది. 

ప్రధాన వాణిజ్య వర్గాలైన గుజరాతీలు, మార్వాడీలు ముహూరత్ ట్రేడింగ్ ను ప్రారంభించారు. ప్రతి దీపావళి సందర్భంగా ఈ రకమైన సెషన్ లో వారు పాల్గొంటారు. అయితే ఈ సంప్రదాయం 1992 లో ఎన్‌ఎస్‌ఈలో ప్రారంభమైంది. తరువాత, బిఎస్ఈ, ఎన్ఎస్ఈ దీపావళి రోజున సాయంత్రం 1 గంట పాటు కలిసి ట్రేడింగ్ ప్రారంభించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీపావళికి ముహూరత్ సెషన్ ప్రారంభమయ్యే ముందు వ్యాపారవేత్తలు అకౌంటింగ్ పుస్తకాన్ని ఆరాధిస్తారు.

ముహురత్ అనే పదానికి ఒక ముఖ్యమైన పనిని నిర్వహించడానికి అనుకూలమైన నిర్దిష్ట కాల వ్యవధి అని అర్థం. సెషన్‌లో జరిగే ట్రేడ్‌లు సాధారణ ట్రేడ్‌ల మాదిరిగానే ఉంటాయి. ఎక్స్‌ఛేంజీల పనిలో వారి సాధారణ సమయాలకు మినహా ఎలాంటి మార్పు ఉండదు.

Also Read: Gas Cylinder Price Hike: వంట గ్యాస్‌పై మళ్లీ వాయింపు.. మరోసారి ఎగబాకిన ధర, ఈసారి ఎంత పెరిగిందంటే..

Also Read: Gold Silver Price Today 6 October 2021: నిన్నటి కన్నా పెరిగిన పసిడి ధర, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలివే...
Tags: muhurat trading on diwali 2021 muhurat trading nse 2021 muhurat trading BSE NSE muhurat trading session Muhurat trading 2021 time

సంబంధిత కథనాలు

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!

Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మీ నగరంలో బంగారం, వెండి ధరలివీ..

Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మీ నగరంలో బంగారం, వెండి ధరలివీ..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Seven Week Jewellery: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!

Seven Week Jewellery: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!