Bank Holidays in August 2025: ఆగస్టులో సెలవుల సందడి, 15 రోజులు బ్యాంకులు బంద్- బ్యాంక్ హాలిడేస్ జాబితా చూశారా
August Bank Holidays: వివిధ రాష్ట్రాల్లో పండుగలు, సెలవుల కారణంగా మొత్తం 15 రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. రాష్ట్రాలను బట్టి సెలవు రోజుల్లో వ్యత్యాసం ఉంటుందని గమనించాలి.

Bank Holidays in August 2025: కొత్త నెల వచ్చిందంటే చాలు ఆర్థిక పరమైన ఎన్నో విషయాల్లో మార్పులు జరుగుతుంటాయి. దాంతో పాటు ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్ హాలిడేస్ వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 3 రోజుల తర్వాత ఆగస్టు నెల ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితాను ఓసారి పరిశీలించండి. ఆగస్టు నెలలో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వీకెండ్ హాలిడేస్ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 15 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే రాష్ట్రాలను బట్టి సెలవు దినాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇందులో ఇండిపెండెన్స్ డే, గణేష్ చతుర్థి, జన్మాష్టమిలతో పాటు పలు రాష్ట్రాల పండుగలు, శని, ఆదివారాల సెలవులు కూడా ఉన్నాయి.
భారతదేశంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులు అన్నీ ప్రతినెలలో 2వ, 4వ శనివారం సేవలు అందించవు. ఆరోజు బ్యాంకులు బంద్ ఉంటాయి. దీంతో పాటు బ్యాంకు ఉద్యోగులకు ప్రతి ఆదివారం వీక్లీ ఆఫ్ ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో స్థానిక ముఖ్యమైన ఈవెంట్లు లేదా మతపరమైన కారణాలతో వేర్వేరు రోజుల్లో సెలవులు ఉంటాయి. కనుక బ్యాంకు సెలవులు తెలుసుకుంటే మీకు పని ఉన్న రోజుకు ముందే వర్క్ ప్లాన్ చేసుకుని మీ బ్రాంచ్ ను విజిట్ చేయవచ్చు.
ఆగస్టు 2025లో బ్యాంకు సెలవుల జాబితా
- ఆగస్టు 3 — ఆదివారం సెలవు
- ఆగస్టు 8 — ఒడిశా, సిక్కింలో టెండంగ్ లో రుమ్ ఫాట్ కారణంగా మూసివేత
- ఆగస్టు 9 — రక్షా బంధన్, జులన్ పూర్ణిమ కారణంగా అహ్మదాబాద్ (గుజరాత్), భోపాల్ (మధ్యప్రదేశ్), భువనేశ్వర్ (ఒడిశా), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), జైపూర్ (రాజస్థాన్), కాన్పూర్, లక్నో (ఉత్తరప్రదేశ్), సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) లలో బ్యాంకులు బంద్ ఉంటాయి. దాంతోపాటు రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- ఆగస్టు 10 — ఆదివారం సెలవు
- ఆగస్టు 13 — ఇంఫాల్ (మణిపూర్) లో బ్యాంకులు మూసివేస్తారు
- ఆగస్టు 15 - స్వాతంత్య్ర దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరం (షహన్షాహి), జన్మాష్టమి వేడుకల సందర్భంగా దేశం అంతటా బ్యాంకులు మూసివేస్తారు.
- ఆగస్టు 16 - హైదరాబాద్ (తెలంగాణ), విజయవాడ (ఆంధ్రప్రదేశ్), అహ్మదాబాద్ (గుజరాత్), ఐజోల్ (మిజోరం), భోపాల్ (మధ్యప్రదేశ్), రాంచీ (జార్ఖండ్), చండీగఢ్ (యుటి), చెన్నై (తమిళనాడు), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), గ్యాంగ్‌టక్ (సిక్కిం), జైపూర్ (రాజస్థాన్), కాన్పూర్, లక్నో (ఉత్తరప్రదేశ్), పాట్నా (బీహార్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), షిల్లాంగ్ (మేఘాలయ), శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్)లలో బ్యాంకులు జన్మాష్టమి (శ్రావణ వధ-8), కృష్ణ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసివేత
- ఆగస్టు 17 - ఆదివారం సెలవు
- ఆగస్టు 19 — మహారాజా వీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా అగర్తలా (త్రిపుర) లో బ్యాంకులకు సెలవు
- ఆగస్టు 23 — 4వ శనివారం సెలవు కారణంగా బ్యాంకులకు సెలవు
- ఆగస్టు 24 — ఆదివారం సెలవు
- ఆగస్టు 25 — శ్రీమంత శంకరదేవ్ తిరుభావ తిథి కారణంగా గౌహతి (అస్సాం) లో బ్యాంకులు మూసివేత
- ఆగస్టు 27 - హైదరాబాద్ (తెలంగాణ), విజయవాడ (ఆంధ్రప్రదేశ్), అహ్మదాబాద్ (గుజరాత్), బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్ (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), భువనేశ్వర్ (ఒడిశా), చెన్నై (తమిళనాడు), పనాజీ (గోవా), మరియు లలో బ్యాంకులు గణేష్ చతుర్థి, సంవత్సరి (చతుర్థి పక్ష), వరసిద్ధి వినాయక వ్రతం కోసం బ్యాంకులకు సెలవు
- ఆగస్టు 28 - గణేష్ చతుర్థి, నువాఖై రెండవ రోజున భువనేశ్వర్ (ఒడిశా), పనాజీ (గోవా) లలో బ్యాంకులకు సెలవు
- ఆగస్టు 31 - ఆదివారం సెలవు కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్





















