8th Pay Commission Salaries: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ - 8వ పే కమిషన్‌లో ఎవరి జీతం ఎక్కువగా పెరుగుతుంది?
8th Pay Commission: 8వ వేతన సంఘం కింద, దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు & 65 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనాలు పొందుతారు. వీరిలో త్రివిధ దళాల సిబ్బంది కూడా ఉన్నారు.
![8th Pay Commission Salaries: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ - 8వ పే కమిషన్‌లో ఎవరి జీతం ఎక్కువగా పెరుగుతుంది? Army Navy and Air Force Whose salary will increase the most in the 8th Pay Commission 8th Pay Commission Salaries: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ - 8వ పే కమిషన్‌లో ఎవరి జీతం ఎక్కువగా పెరుగుతుంది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/057e551f7f5e9d0291734fa7cbb99d0c1738141594931545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
8th Pay Commission Salary News Updates: భారత ప్రభుత్వం ఇటీవలే 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. ఇది, కేంద్ర ఉద్యోగులు & పెన్షనర్లతో పాటు సైన్యం (Army), నావికాదళం (Navy) & వైమానిక దళం (Air Force) సిబ్బందికి కూడా నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు.
8వ వేతన సంఘం (8th Pay Commission) దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు & 65 లక్షల మంది పింఛనుదార్లపై ప్రభావం చూపుతుంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment factor) 2.57 నుంచి 2.86 కి పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం (Minimum basic pay) రూ. 18,000 నుంచి రూ. 51,480 వరకు (హోదాను బట్టి) పెరగవచ్చని సమాచారం.
ఎవరి జీతం ఎక్కువ పెరుగుతుంది?
8వ వేతన సంఘం కింద ప్రయోజనం పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదార్లలో త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ & ఎయిర్ ఫోర్స్) సిబ్బంది కూడా ఉన్నారు. 8వ వేతన సంఘం అమలు తర్వాత త్రివిధ దళాల సైనికుల కనీస మూల వేతనం 25 శాతం నుంచి 35 శాతం వరకు పెరగవచ్చన్నది ఒక అంచనా. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతంలో ఈ పెరుగుదల మొత్తం కనిపిస్తుంది. ఈ లెక్కన, ఒక్కొక్కరి 'బేసిక్ పే'లో రూ. 18,000 నుంచి దాదాపు రూ. 51,480 వరకు వృద్ధి కనిపిస్తుంది.
రిటైర్డ్ సైనికులకు కూడా ప్రయోజనాలు
8వ వేతన సంఘం ప్రభావం విశ్రాంత సైనిక సిబ్బంది (Retired Army personnel)పై కూడా కనిపిస్తుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు 65 లక్షల మంది పెన్షనర్లు కొత్త పెన్షన్ స్కేల్ పొందుతారు, వారి ఆర్థిక భద్రత మరింత బలోపేతం అవుతుంది. సర్వీస్ తర్వాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న మాజీ సైనికులకు 8వ పే కమిషన్ చాలా కీలకమైనది. అంతేకాదు, 8వ వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత కరవు భత్యం (Dearness Allowance) కూడా పెరిగే అవకాశం ఉంది.
జీతం ఎంత పెరుగుతుందో ఎలా తెలుసుకోవాలి?
8వ వేతన సంఘం అమలు తర్వాత కేంద్ర ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, నివేదికల ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 2.86కు పెంచే అవకాశం ఉంది. వాస్తవానికి, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఇప్పటికే ఉన్న జీతాన్ని కొత్త పే స్కేల్‌గా మార్చడానికి ఉపయోగించే ముఖ్యమైన సంఖ్య. దానిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక ఉద్యోగి యొక్క ప్రస్తుత బేసిక్ పే రూ. 35,000 & ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అనుకుంటే... అతని కొత్త బేసిక్ పే - 35,000 x 2.86 = రూ. 1,00,100 అవుతుంది. మీరు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, మీ భవిష్యత్ జీతాన్ని ఈ విధంగా లెక్కించుకోవచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మారే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: లాభాలు తగ్గినా బ్లింకిట్‌లోకి పెట్టుబడుల పంపింగ్ - జొమాటో వ్యూహం ఏంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)