Amazon Winterwear offer: స్వెటర్లు, జాకెట్స్‌పై 70 % డిస్కౌంట్ ఇస్తున్న అమెజాన్
Amzon Repblic sale: శీతకాలం దుస్తులపై అమెజాన్ రాయితీ ప్రకటించింది.
శీతకాలం వచ్చేసింది! గతానికి భిన్నంగా ఈసారి నవంబర్ మాసం నుంచే చలి వణికించేసింది. పరిస్థితులను గమనిస్తుంటే మార్చి తొలి వారం వరకు చల్లని గాలులు వీసేలా కనిపిస్తోంది. ఈ 'చలి పులి' నుంచి రక్షించుకోవాలంటే మనల్ని వెచ్చగా ఉంచే స్వెటర్లు ధరించాల్సిందే!
అందుకే రిపబ్లిక్ సేల్‌లో భాగంగా అమెజాన్ పలు ఆఫర్లు ప్రకటించింది. వింటర్ ఫ్యాషన్‌పై 60-80 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. మహిళలు, పురుషులు, చిన్నారుల కోసం వేర్వేరు డిజైన్లు, ధరలలో స్వెటర్లు లభిస్తున్నాయి. కొలిన్స్, అలెన్ సోలి, యూఎస్‌పీయే బ్రాండులపై రాయితీ ఇస్తోంది.
అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మహిళల కేప్ జాకెట్
ఈ నలుపు రంగు జాకెట్ అన్ని రకాల సైజుల్లో లభిస్తోంది. వేర్వేరు సైజులను బట్టి రూ.659 నుంచి రూ.1099 వరకు ధర ఉంటోంది. రేటింగ్ కూడా చాలా బాగుంది. నలుపు, నేవీ, మస్టర్డ్ రంగుల్లో నచ్చింది ఎంచుకోవచ్చు. వంద శాతం నైలాన్‌తో తయారు చేశారు. సులభంగా నీటితో ఉతుక్కోవచ్చు. లాంగ్ స్లీవ్ హుడెడ్ జాకెట్ కాబట్టి పూర్తి రక్షణ ఉంటుంది. వీటి అసలు ధర రూ.2200 వరకు ఉంది. పురుషులకైతే మెన్స్ బాంబర్ జాకెట్ లభిస్తోంది.
పురుషుల జాకెట్
అలెన్ సోలి పురుషుల జాకెట్ చూస్తే వెంటనే కొనుగోలు చేయాలనిపిస్తుంది. నీలం, మెరూన్ రంగుల్లో ఇది లభిస్తోంది. అసలు ధర రూ.2700 వరకు ఉండగా రాయితీతో 1399కే అందిస్తున్నారు. సైజ్ చార్ట్‌ను బట్టి మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. వందశాతం పాలిస్టర్తో రూపొందిచారు. డ్రైక్లీన్ మాత్రమే చేసుకోవాలి. దీనికి ఫోర్‌స్టార్ రేటింగ్ ఉంది.
స్వెట్ షర్ట్
రెడ్‌టేప్ పురుషుల స్వెట్‌షర్ట్‌ను ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దీని వాస్తవ ధర రూ.2,200 వరకు ఉండగా ఆఫర్లో రూ.588 నుంచి రూ.749 వరకు అందిస్తున్నారు. నలుపు, ఆకుపచ్చ, డస్టీ ఆలివ్, తెలుపు, బూడిద, నీలం ఇలా రంగుల్లో లభిస్తుంది. దీనిని 60 శాతం కాటన్, 40 శాతం పాలిస్టర్‌తో రూపొందించారు. రౌండ్‌నెక్‌తో వస్తోంది. మెషిన్ వాష్ చేయొచ్చు.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!