By: ABP Desam | Updated at : 08 Mar 2023 11:13 AM (IST)
Edited By: Arunmali
'అదానీ పవర్'లో 6 కంపెనీల విలీనం
Adani Power: అదానీ గ్రూప్‌లోని విద్యుత్ రంగ కంపెనీ అయిన అదానీ పవర్ లిమిటెడ్ (Adani Power Ltd) మరింత పవర్‌ఫుల్‌గా మారింది. అదానీ పవర్ (ముంద్రా) సహా ఆరు అనుబంధ సంస్థలు అదానీ పవర్‌లో విలీనం అయ్యాయి. అదానీ పవర్ మంగళవారం (07 మార్చి 2023) ఈ విషయాన్ని ప్రకటించింది.
అదానీ పవర్ లిమిటెడ్‌లో (APL) విలీనం అయిన అనుబంధ కంపెనీలు:
అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ - Adani Power Maharashtra Ltd (APML)
అదానీ పవర్ రాజస్థాన్ లిమిటెడ్ - Adani Power Rajasthan Ltd (APRL)
ఉడిపి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ - Udupi Power Corporation Ltd (UPCL)
రాయ్‌పూర్ ఎనర్జెన్ లిమిటెడ్ - Raipur Energen Ltd (REL)
రాయ్‌ఘర్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్ - Raigarh Energy Generation Ltd (REGL)
అదానీ పవర్ (ముంద్రా) లిమిటెడ్ - Adani Power (Mundra) Ltd (APMuL)
అదానీ పవర్ లిమిటెడ్‌లోకి, కంపెనీ పూర్తి యాజమాన్యంలోని ఆరు అనుబంధ కంపెనీల విలీనాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ ఫిబ్రవరి 8, 2023న ఆమోదించినట్లు BSE ఫైలింగ్‌లో ఈ కంపెనీ పేర్కొంది.
"ఈ పథకం విజయవంతం కావడానికి అన్ని షరతులు సంతృప్తి చెందాయని మేం అప్‌డేట్ చేస్తున్నాం. అందువల్ల, పథకంలో పేర్కొన్న విధంగా అక్టోబర్ 1, 2021 నుంచి అపాయింటెడ్ తేదీ అమలులోకి వస్తుంది" అని ఎక్సేంజ్ ఫైలింగ్‌లో అదానీ పవర్ లిమిటెడ్ పేర్కొంది.
ఆరు కంపెనీలు -- APML, APRL, UPCL, REL, REGL, APMuL -- ఇప్పుడు APLలో కలిసిపోయాయి కాబట్టి, వీటన్నింటినీ వ్యాపార, ఆర్థిక లెక్కలను కూడా కలిపి FY 2022-23 ఆర్థిక నివేదికలను అదానీ పవర్ లిమిటెడ్ వెల్లడిస్తుంది.
అదానీ పవర్ షేర్ ధర ఇవాళ (బుధవారం, 08 మార్చి 2023) కూడా 5% పెరిగి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. జీక్యూజీ పార్ట్‌నర్స్ డీల్ తర్వాత, గత 5 ట్రేడింగ్ రోజుల్లోనే ఈ స్టాక్ దాదాపు 22% లాభపడింది.
గ్రీన్ కలర్‌లో అదానీ గ్రూప్‌ని స్టాక్స్
ఇవాళ మార్కెట్ ప్రతికూలంగా ప్రారంభమైనా... అదానీ గ్రూప్‌లోని (Adani Group Stocks) మొత్తం 10 లిస్టెడ్ షేర్లు దూసుకుపోయాయి. అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ నాలుగు షేర్లు అప్పర్ సర్క్యూట్‌లు తాకాయి. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా ప్రారంభ ట్రేడింగ్‌లో లాభపడింది. అదానీ పోర్ట్స్, అదానీ విల్మార్, ACC కూడా ఊపందుకోగా.. అంబుజా సిమెంట్స్ & NDTV షేర్లు నెగెటివ్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే గ్రీన్ జోన్‌కు చేరుకున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!
Cryptocurrency Prices: రూ.24 లక్షల వైపు బిట్‌కాయిన్ పరుగు - దాటితే!
Stock Market News: ఎఫ్ఎంసీజీ మినహా అన్ని సూచీలు డౌన్ - సాయంత్రానికి సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ!
SBI Sarvottam Scheme: భారీ వడ్డీ ఆదాయాన్ని అందించే ఎస్బీఐ స్పెషల్ స్కీమ్
Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్