April Bank Holidays : ఐదో తేదీ వరకూ బ్యాంక్ వైపు వెళ్లకండి ! ఎందుకంటే ?
బ్యాంకులకు ఏప్రిల్ నెలలో వరుస సెలవులు ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌లో పదిరోజులకుపైగా సెలవులు బ్యాంకులకు ఉండనున్నాయి. ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవు అంటే ?
మార్చి చివరి వారంలో ఉద్యోగుల సమ్మె, వారాంతాలు కారణంగా బ్యాంకులు ( Banks ) పని చేసింది లేదు. పని చేసిన రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ( Year Ending ) సందర్భంగా కస్టమర్లకు సేవలు అందించేది కూడా తక్కువే. ఇప్పుడు ఏప్రిల్‌లోనూఅదే పరిస్థితి . ఏప్రిల్ ( April ) ఐదో తేదీ వరకూ బ్యాంకులకు వరుస సెలువులు ఉన్నాయి. దీంతో బ్యాంకులు తెరిచే అవకాశం కనిపించడం లేదు.
ఈ డేంజర్ వైరస్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చొరబడిందంటే! డబ్బంతా మాయం!
ఏప్రిల్ 1- 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
ఏప్రిల్ 2- ఉగాది సెలువు
ఏప్రిల్ 3- ఆదివారం
ఏప్రిల్ 4- సర్హుల్ అనే పండుగ సందర్భంగా సెలవు.అయితే ఇది జార్ఖండ్‌లో మాత్రమే వర్తిస్తుంది. ఇక ఆ తర్వాతి రోజు అంటే ఏప్రిల్ ఐదోతేదీన కూడా సెలవు.
ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ ( Jagjeevan Ram jayanti ) జయంతి కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఇస్తారు.
సుకన్యా సమృద్ధి యోజన అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కావాలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్
ప్రారంభంలో వరుస సెలువులే కాదు.. ఏప్రిల్ నెల మొత్తం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ( Bank Holidays ) వస్తున్నాయి. ఐదో తేదీ తర్వాత ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయంటే
ఏప్రిల్ 9- రెండో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 10- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 14- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 15- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 17- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 23- నాలుగో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్ 24- ఆదివారం(సాధారణ సెలవు)
సుకన్యా సమృద్ధి యోజన అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కావాలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండవు. కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటాయి. రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుని వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఆన్లైన్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని అన్లైన్ లావాదేవీలు ( Online Transactions ) 24 గంటలు పని చేస్తాయి. ఏటీఎంలలో కూడా నగదు విత్డ్రా చేసుకునే వీలుంటుంది.