By: ABP Desam | Updated at : 12 Mar 2022 01:11 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సుకన్యా సమృద్ధి యోజన అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కావాలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్
SSY account Transfer: సుకన్యా సమృద్ధి యోజనను (Sukanya Samriddhi Yojana - SSY) దేశంలో ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్న కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలను పొందుతున్నాయి. ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడమే కాకుండా మిగతా అన్ని పొదు పథకాల కన్నా ఎక్కు వడ్డీ ఇస్తుండటమే ఇందుకు కారణం. మరి ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు ఎస్‌ఎస్‌వై ఖాతాను బదిలీ చేసుకోవచ్చా? కావాలంటే ఏం చేయాలి?
SSY account Transfer ఎందుకంటే?
ఉద్యోగాల్లో బదిలీలు సహజం. అలాగే కొన్నిసార్లు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి అద్దెకు మారుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో నివస్తున్న చోటు ఒకదగ్గరుంటే సుకన్యా సమృద్ధి యోజన ఖాతా (SSY) తీసిన బ్యాంకు లేదా పోస్టాఫీసు మరో చోట ఉంటాయి. ఆన్‌లైన్ విధానంలో డబ్బులను జమ చేసుకోవచ్చు కానీ అందరూ ఈ సదుపాయం ఉపయోగించుకోలేరు. అలాంటప్పుడు ప్రతిసారీ అక్కడికి వెళ్లి డబ్బులు జమ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి వారికి ఎస్‌ఎస్‌వై ఖాతాలను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవడం అత్యుత్తమ మార్గం.
SSY account Transfer ఇలా
ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం కస్టమర్లు మొదట సుకన్యా సమృద్ధి యోజన ట్రాన్స్‌ఫర్ రిక్వెస్టును ఇప్పటికే ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఇవ్వాలి. కొత్తగా ఏ బ్యాంకు లేదా శాఖలోకి మార్చాలనుకుంటున్నారో దాని అడ్రస్ ఇవ్వాలి. అప్పుడు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు ఒరిజినల్ డాక్యుమెంట్లైన ఖాతా పుస్తకం, అకౌంట్ ఓపెనింగ్ దరఖాస్తు, స్పెసిమన్ సిగ్నేచర్ వంటివి ఐసీఐసీఐకి పంపిస్తుంది. దాంతో పాటు ఎస్‌ఎస్‌వై ఖాతాలోని డబ్బుల చెక్కు లేదా డీడీని పంపిస్తుంది. యాక్సిస్ సహా ఏ ఇతర బ్యాంకులైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుంది.
SSY account Transfer ప్రాసెస్
కొన్నిసార్లు బ్యాంకులు, పోస్టాఫీసు బదిలీ పత్రాలను నేరుగా వినియోగదారుడికే ఇస్తాయి. అలాంటప్పుడు మీరు కొత్త ఎస్‌ఎస్‌వై అకౌంట్ ఓపెనిగ్ ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి. దాంతో పాటు కొత్త కైవైసీ డాక్యుమెంట్ల సెట్ ఇవ్వాలి. పేరెంట్, గార్డియన్ వివరాలు ఇవ్వాలి. వీటిన్నటితో ఇప్పటికే మీకు పాత బ్యాంకు ఇచ్చిన అన్ని డాక్యుమెంట్లను కొత్త బ్యాంకులో అందజేయాలి. అప్పుడు కొత్త బ్యాంకులో ఖాతా మొదలవుతుంది.
What is Sukanya Samriddhi Sukanya Yojana?
సుకన్య సమృద్ధి యోజనను ఎందుకు తెరుస్తారో మీకు తెలిసిందే. పదేళ్ల లోపు అమ్మాయిల పేరుతో ఈ ఖాతాను తీస్తారు. ఒక కుటుంబంలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తారు. దాదాపుగా 15 ఏళ్ల పాటు దీంట్లో డబ్బులు జమ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏటా వడ్డీరేట్లను సవరిస్తుంది. ఇప్పటికైతే మిగతా అన్ని పొదుపు పథకాల కన్నా ఎస్‌ఎస్‌వైకి మాత్రమే ఎక్కువ వడ్డీ ఇస్తోంది. ఏటా ఇందులో చేసిన కంట్రిబ్యూషన్‌కు సెక్షన్ 80 ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా తీసేందుకు ఫొటో, ఆధార్, పాన్, అమ్మాయి బర్త్ సర్టిఫికెట్, ఐడీ ప్రూఫులతో కేవైసీ డాక్యుమెంట్లు అవసరం.
LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం
BoB: ఫోన్‌తో స్కాన్ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ అక్కర్లేదు
Latest Gold-Silver Price Today 06 June 2023: పసిడికి డిమాండ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Price Today 06 June 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
Banking Services Unavailable: హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! జూన్‌లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!