అన్వేషించండి

Range Rover Ranthambore: పులి లాంటి 'రేంజ్ రోవర్ రణ్‌థంబోర్‌ ఎడిషన్‌'ను లోన్‌పై కొనొచ్చు, EMI ఎంత చెల్లించాలంటే?

Range Rover Ranthambore On EMI: రేంజ్ రోవర్ రణ్‌థంబోర్‌ ఎడిషన్‌ను కొనుగోలు చేయడానికి బ్యాంక్‌ మీకు గరిష్ట లోన్‌ మంజూరు చేస్తుంది. రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

Range Rover Ranthambore On Bank Loan And EMI: భారతీయ మార్కెట్‌లో, ల్యాండ్ రోవర్‌ బ్రాండ్‌ కింద లాంచ్‌ అయిన రేంజ్ రోవర్ కార్లు కుర్రకారుకు ఫేవరెట్‌ వెహికల్స్‌. ఈ కారును యూత్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ఇష్టపడుతున్నారు, కొంటున్నారు. ఈ కారుకు ఇంత పాపులారిటీ రావడానికి కారణం చూడగానే ఆకర్షించే రఫ్‌ అండ్‌ టఫ్‌ డిజైన్ & ఫీచర్లు.

ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్‌ మోడల్‌కు ఎక్స్‌టెన్షన్‌గా ప్రత్యేకంగా లాంచ్‌ చేసిన 'రణ్‌థంబోర్‌ ఎడిషన్' కూడా మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. రణ్‌థంబోర్‌ నేషనల్‌ పార్క్‌లో స్వేచ్ఛగా తిరిగే పులులను స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రీమియం ఎడిషన్‌ను పరిమిత సంఖ్యలో విడుదల చేశారు. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేకమైన రేంజ్ రోవర్ SV బెస్పోక్ మోడల్ ఇది. కారవే & లైట్ పెర్లినో కాంబినేషన్‌లోని ఎక్స్‌టీరియర్‌ కలర్‌ రణ్‌థంబోర్ అడవిలోని సహజమైన రంగులను ప్రతిబింబిస్తాయి. పులి వెన్నుపై ఉండే నమూనాల ఆధారంగా కారు సీట్లను డెకరేట్‌ చేశారు. ఈ ఎడిషన్‌కు 23-అంగుళాల ఫోర్జ్‌డ్‌ స్టైల్‌ డార్క్‌ గ్రే కలర్‌ చక్రాలను Corinthian Bronze ఇన్సర్ట్స్‌తో అందించారు, ఇవి ఈ బండికి యునిక్‌ లుక్‌ను అందించాయి.

రేంజ్ రోవర్‌ రణ్‌థంబోర్‌ ఎడిషన్‌ ధర
తెలుగు రాష్ట్రాల్లో, రేంజ్ రోవర్‌ రణ్‌థంబోర్‌ ఎడిషన్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర ‍‌(Range Rover Ranthambore Edition Ex-showroom price) 4 కోట్ల 98 లక్షల రూపాయలు. రిజిస్ట్రేషన్‌ (రూ. 90,14,000), ఇన్సూరెన్స్‌ (రూ. 18,97,709), ఇతర ఖర్చులు (రూ. 4,99,000) కలిపి ఆన్ రోడ్ ధర (Range Rover Ranthambore Edition On-road price) దాదాపు రూ. 6 కోట్ల 12 లక్షల రూపాయలు అవుతుంది. ఈ ప్రీమియం కార్‌ కోసం ఒకేసారి ఇంత డబ్బు ఖర్చు పెట్టలేనివాళ్లు బ్యాంక్‌ లోన్‌ కూడా తీసుకోవచ్చు.

బ్యాంక్‌ లోన్‌ & EMI ఎంత?
రేంజ్ రోవర్ రణ్‌థంబోర్‌ ఎడిషన్ కొనడానికి మీ దగ్గర రూ. 62 లక్షలు ఉంటే చాలు, బ్యాంక్‌ మీకు రూ. 5.50 కోట్ల రుణం మంజూరు చేస్తుంది. రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌, బ్యాంక్‌ విధానాలపై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో లోన్‌ లభిస్తుంది. ఈ రుణంపై బ్యాంకు వసూలు చేసే వడ్డీ ప్రకారం, ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని వాయిదా (EMI) రూపంలో బ్యాంకులో జమ చేయాలి.

రేంజ్ రోవర్ రణ్‌థంబోర్‌ ఎడిషన్ కొనడానికి, మీరు డౌన్ పేమెంట్‌గా రూ. 62 లక్షలు డిపాజిట్‌ చేశారనుకుందాం. బ్యాంక్‌ మీకు 9 శాతం వడ్డీ రేటుతో రూ. 5.50 కోట్ల రుణం మంజూరు చేసిందని భావిద్దాం. మీరు...

* 4 సంవత్సరాల ‍‌(48 నెలలు) టెన్యూర్‌తో ఈ లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, ప్రతి నెలా 13,68,677 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి.

* 5 ఏళ్ల (60 నెలలు) కాలపరిమితితో రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, నెలానెలా 11,41,710 రూపాయలు EMIగా బ్యాంకుకు చెల్లించాలి.

* 6 సంవత్సరాల (72 నెలలు) కోసం లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, నెలకు 9,91,405 రూపాయల EMI కడితే అప్పు తీరుతుంది.

* 7 సంవత్సరాల (84 నెలలు) టెన్యూర్‌తో లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు ప్రకారం, ప్రతి నెలా 8,84,899 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి.

స్థానిక పన్నులు, ఇతర ఖర్చులను కలుపుకుని రేంజ్ రోవర్‌ రణ్‌థంబోర్‌ ఎడిషన్‌ ధరలో మార్పులు ఉండవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Electric Cars Under 50k Downpayment: 50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget