News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Volkswagen Virtus: ఫోక్స్‌వాగన్ వర్చూస్ వచ్చేసింది - మిడ్ రేంజ్ బడ్జెట్లో బెస్ట్ కారు!

ప్రముఖ కార్ల బ్రాండ్ ఫోక్స్‌వాగన్ తన కొత్త కారును మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఫోక్స్‌వాగన్ వర్చూస్.

FOLLOW US: 
Share:

ఫోక్స్‌వాగన్ మోస్ట్ అవైటెడ్ కారు మనదేశంలో ఎట్టకేలకు లాంచ్ అయింది. అదే వర్చూస్. ఈ కారును మూడు వేరియంట్లలో మనదేశంలో లాంచ్ చేశారు. స్కోడా స్లేవియా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వాగన్ టైగున్‌లను రూపొందించిన ప్లాట్‌ఫాంపైనే ఈ కారును కూడా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ఫోక్స్‌వాగన్ వర్చూస్ ధర
ఈ కారు డైనమిక్ మోడల్లో కంఫర్ట్‌లైన్, హైలైన్, టాప్‌లైన్ వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో కంఫర్ట్‌లైన్ ధర రూ.11.21 లక్షలుగా ఉంది. హైలైన్ ధరను రూ.12.97 లక్షలుగానూ, టాప్‌లైన్ ధరను రూ.14.41 లక్షలుగానూ నిర్ణయించారు. పెర్ఫార్మెన్స్ మోడల్లో జీటీ ప్లస్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.17.91 లక్షలుగా నిర్ణయించారు. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.

ఫోక్స్‌వాగన్ వర్చూస్ స్పెసిఫికేషన్లు
రెండు టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లతో ఈ కారు మనదేశంలో లాంచ్ అయింది. ఈ కారు డైనమిక్ మోడల్లో 1.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 113 బీహెచ్‌పీ, 178 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో ఈ కారు మార్కెట్లోకి రానుంది.

హైఎండ్ వేరియంట్లో 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 148 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సెవెన్ స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లాంచ్ కానుంది. ఇందులో యాక్టివ్ సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ ఉండనుంది. లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇంధనాన్ని ఆదా చేసేందుకు నాలుగు సిలిండర్లలో రెండు ఈ టెక్నాలజీ ద్వారా డీయాక్టివేట్ అవుతాయి.

స్లేవియా లాగానే ఫోక్స్‌వాగన్ వర్చూస్‌లో కూడా బెస్ట్ వీల్ బేస్, బూట్ స్పేస్ ఉండనుంది. 10 అంగుళాల టచ్ స్క్రీన్, 8 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, ఎయిట్ స్పీకర్ సౌండ్ సిస్టం, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, వెనకవైపు ఏసీ వెంట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు ఈ కారులో ఉన్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎనిమిది స్పీకర్ల సౌండ్ సిస్టంను కూడా ఫోక్స్‌వాగన్ వర్చూస్‌లో అందించింది.

ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ ఉన్న ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఉండనున్నాయి.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 09 Jun 2022 09:52 PM (IST) Tags: Volkswagen Volkswagen Virtus Volkswagen Virtus Features Volkswagen Virtus Price in India Volkswagen Virtus Launched VW Virtus Price

ఇవి కూడా చూడండి

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!

2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి

Car Buying Tips: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి

Tata Motors: బ్యాడ్ న్యూస్ - ఈ టాటా వాహనాల ధరలు మూడు శాతం పెంపు!

Tata Motors: బ్యాడ్ న్యూస్ - ఈ టాటా వాహనాల ధరలు మూడు శాతం పెంపు!

టాప్ స్టోరీస్

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

BRS Candidates :  సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు