Upcoming Compact SUVs India:35km మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ADASతో రాబోతున్న కొత్త కాంపాక్ట్ SUVలు - ధర ₹6 లక్షల నుంచి ప్రారంభం
Upcoming Compact SUVs India: ఈ ఏడాది చివరినాటికి మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్, కొత్త హ్యుందాయ్ వెన్యూ, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వంటి కాంపాక్ట్ SUVలు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, మైలేజ్ & ధరలు ఇవిగో.

Upcoming Compact SUVs with 6 Airbags India 2025: తెలుగు రాష్ట్రాల్లో కార్ కొనేవాళ్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ముఖ్యంగా, కాంపాక్ట్ SUV ల వైపు తెలుగు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సేల్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కాంపాక్ట్ SUV విభాగం వేగంగా విస్తరిస్తోంది. 2025 మిగిలిన నెలలతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో, ఈ విభాగంలో కొత్త మోడళ్లు, అప్‌డేట్ వెర్షన్‌లను లాంచ్ చేసేందుకు ప్రముఖ బ్రాండ్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఎక్కువ ఆసక్తిని రేపుతున్నవి Maruti Suzuki Fronx Hybrid, 2025 Hyundai Venue & Tata Punch Facelift.
కొత్త మోడళ్ల ప్రత్యేకతలు, ఆకర్షణీయమైన ఫీచర్ల వివరాలు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్
భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన పాపులర్ SUV ఫ్రాంక్స్ లో హైబ్రిడ్ వెర్షన్ విడుదల చేయబోతోంది, అది కూడా 2025లోనే తీసుకురావాలని పక్కాగా పని చేస్తోంది. ఈ కారు 1.2-లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్, 1.5-2 kWh బ్యాటరీ ప్యాక్ & ఎలక్ట్రిక్ మోటారుతో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ (HEV) తో వస్తుంది. దీనిలో చెప్పుకోవాల్సిన అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే.. ఇది 35 kmpl కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇదే నిజమైతే, ఈ కారు, తన విభాగంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం గల SUV గా అవతరిస్తుంది.
ఫీచర్లు - మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌కు లెవల్ 1 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా & సన్‌రూఫ్ లభిస్తాయని భావిస్తున్నారు. కొత్త గ్రిల్, అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు & మెరుగైన క్యాబిన్ లేఅవుట్ వంటివి వాటితో డిజైన్‌లో స్వల్ప మార్పులు కనిపించవచ్చు. దీని అంచనా ధర రూ. 8 లక్షల నుంచి రూ. 13 లక్షలు (ఎక్స్-షోరూమ్).
హ్యుందాయ్ వెన్యూ 2025
హ్యుందాయ్ బ్రాండ్‌లో బాగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUV వెన్యూ. దీనిలో కొత్త తరం మోడల్‌ను 2025 చివరి నాటికి విడుదల చేయాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఇది స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, పారామెట్రిక్ గ్రిల్ & కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్‌లతో కొత్త బాక్సీ డిజైన్‌తో రావచ్చు. ఇవన్నీ ఈ కారు ప్రీమియం అప్పీల్‌ను మరింత మెరుగు పరుస్తాయి. ఇప్పటికే ఉన్న ఇంజిన్ ఎంపికలు (1.2L పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్ & 1.5L డీజిల్ ఇంజిన్) అలాగే ఉంటాయి.
ఫీచర్లు - లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు & 10.25-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్‌లను హ్యుందాయ్ వెన్యూ 2025 మోడల్‌కు జోడించవచ్చు. దీని క్యాబిన్‌ను కూడా మార్చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. క్యాబిన్‌లో కొత్త డాష్‌బోర్డ్ & అప్‌డేటెడ్ సీటింగ్ ఉండవచ్చు. ధర విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.5 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్).
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా మోటార్స్, తన బెస్ట్ సెల్లింగ్ SUV పంచ్ లో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈ సంవత్సరం దీపావళి (Diwali 2025) కి ముందు లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి వచ్చే పంచ్, EV వెర్షన్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ అవుతుంది. కొత్త LED DRLs, స్లిమ్ హెడ్‌ల్యాంప్‌లు & రీడిజైన్ చేసిన బంపర్లు యాడ్ చేసే అవకాశం ఉంది.
ఫీచర్లు - ఇంటీరియర్‌లో టు-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & టచ్-బేస్డ్ HVAC కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు లేకుండా అదే 1.2L 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ & CNG వెర్షన్‌లు ఉంటాయి. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. ఈ SUV నేరుగా Hyundai Exter & Maruti Fronx తో పోటీ పడుతుంది.





















