TVS Scooty Zest SXC కొత్త వేరియంట్ లాంచ్ - డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ ఫీచర్లు, కొత్త కలర్స్ - ధర కేవలం ₹75,500
TVS, తన Scooty Zest 110కి కొత్త వేరియంట్ SXC ని రూ.75,500 ఎక్స్ షోరూమ్ ధరకు లాంచ్ చేసింది. డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కొత్త గ్రాఫిక్స్ & కలర్స్‌తో యువతరాన్ని ఆకట్టుకోనుంది.

TVS Scooty Zest SXC Launched At ₹75,500: టీవీఎస్ మోటార్ కంపెనీ, తన Scooty Zest 110 స్కూటర్‌కి కొత్త వేరియంట్ SXC ను తాజాగా లాంచ్ చేసింది. రూ.75,500 ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్‌లోకి దిగిన ఈ మోడల్, న్యూ టెక్నాలజీ, కలర్స్ & స్టైలిష్ డిజైన్‌తో యువతరాన్ని సులభంగా ఆకట్టుకునేలా ఉంది. ఆడ, మగ, యువత, పెద్దలు - ఎవరైనా ఈ బండిని చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు.
ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
కొత్త Zest SXC వేరియంట్‌లో తొలిసారిగా పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ అందించారు. స్పీడ్, ఫ్యూయల్ లెవల్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. TVS Connect App ద్వారా ఫోన్ నోటిఫికేషన్లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా చూడవచ్చు.
కొత్త కలర్స్ & డెకల్స్
టీవీఎస్ కొత్తగా Graphite Grey & Bold Black కలర్స్‌లో SXC వేరియంట్‌ను తీసుకొచ్చింది. బాడీపై ఇచ్చిన కొత్త గ్రాఫిక్స్ ఈ స్కూటీకి షార్ప్ లుక్ ఇస్తున్నాయి. సింపుల్‌గా ఉండే సైజ్‌తో పాటు & కొత్త స్టైలింగ్, మరింత యూత్‌ఫుల్‌గా కనిపిస్తోంది.
ఇంజిన్ & పనితీరు
ఈ స్కూటీలో 109.7cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7.8PS పవర్, 8.8Nm టార్క్ ఇస్తుంది. స్మూత్ థ్రాటిల్ రెస్పాన్స్‌తో చిన్న దూరాలు, సిటీ రైడింగ్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సౌకర్యవంతమైన డ్రైవ్ అనుభవాన్ని ఇస్తుంది.
సస్పెన్షన్ & బ్రేకింగ్
మునుపటి వేరియంట్ లాగే, ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు సింగిల్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు. రెండు వైపులా డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. 10 అంగుళాల అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లతో బలమైన రోడ్ గ్రిప్ ఇస్తుంది.
లైట్ వెయిట్ & కంఫర్ట్
కేవలం 103 కిలోల కర్బ్ వెయిట్, 760 మిల్లీమీటర్ల సీట్ హైట్‌తో ఇది తన క్లాస్‌లోనే లైట్ వెయిట్ స్కూటర్. ట్రాఫిక్‌లో అటు, ఇటు తిప్పుకోవడం, పార్క్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ టైమ్ రైడర్స్‌కి సూపర్‌గా సూట్ అవుతుంది.
అదనపు ఫీచర్లు
Zest SXC లో LED DRLs, బయటి వైపునే ఫ్యూయల్ ఫిల్లింగ్, 19 లీటర్ల స్టోరేజ్ స్పేస్, ఫైబర్ బాడీ ప్యానెల్స్ ఉన్నాయి. ఈ ఫీచర్లు దాని లైట్‌నెస్ & యూజర్ ఫ్రెండ్లీ డిజైన్‌కి ముఖ్య కారణాలు.
మార్కెట్ ఫోకస్
TVS ఇప్పుడు కనెక్టెడ్ స్కూటర్లపై దృష్టి పెట్టింది. NTorq, iQube తర్వాత ఇప్పుడు Zest SXC కూడా ఆ లైన్‌లో చేరింది. అయితే ఇది Jupiter కన్నా కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్‌లో ఉంది.
ప్రత్యర్థులు
Honda Dio, Hero Pleasure+, Yamaha Fascino వంటి 110cc స్కూటర్లతో ఇది మార్కెట్‌లో పోటీ పడనుంది. కొత్త కలర్స్ & టెక్ అప్‌డేట్స్‌తో Zest SXC చిన్న స్కూటర్ సెగ్మెంట్‌లో TVSకి మళ్లీ బలం ఇస్తుంది.
ఇది యూత్‌కి టార్గెట్‌గా వచ్చిన ఫ్రెష్ అప్‌డేట్. స్టైల్, టెక్ & లైట్ కంఫర్ట్ కలయికగా ఉన్న Scooty Zest SXC ఈ దీపావళికి మంచి బయింగ్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.





















