Diwali Discounts: ఎలక్ట్రిక్ బైకులపై ఈ దీపావళికి బెస్ట్ డిస్కౌంట్లు - Oben Rorr నుంచి Ola Roadster X వరకు టాప్ డీల్స్
దీపావళి 2025 కోసం ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? Oben Rorr EZ, Revolt RV400, Ola Roadster X, Matter Aera, PURE EV EcoDryft వంటి టాప్ బైకులపై భారీ ఆఫర్లు వచ్చేశాయి.

Electric Motorcycle 2025 Diwali Discounts India: భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా ఎదుగుతోంది. అందుకే, ఈ దీపావళి సీజన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి బంగారు అవకాశంగా మారింది. ఇప్పుడు, చాలా ప్రముఖ కంపెనీలు స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్లతో ముందుకొచ్చాయి. మీ కోసం... పెర్ఫార్మెన్స్, రేంజ్, ఫీచర్లు అన్నీ అద్భుతంగా కలిపిన టాప్ 5 ఎలక్ట్రిక్ బైకులు ఇవి:
1. Oben Rorr EZ Sigma
మన దేశ రోడ్లకు తగిన విధంగా రూపొందించిన ఈ బైక్ నిండా స్మార్ట్ ఫీచర్లే. 3.4 kWh వేరియంట్ రూ.1.29 లక్షలకు, 4.4 kWh వేరియంట్ రూ.1.39 లక్షలకు లభిస్తుంది (ఎక్స్-షోరూమ్ ధర). టాప్ స్పీడ్ 95 kmph, 0-40 kmph వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుంది. దీని రైడింగ్ రేంజ్ 175 కి.మీ.
ఫీచర్లు - 5 అంగుళాల TFT డిస్‌ప్లే, రివర్స్ మోడ్, GPS సెక్యూరిటీ, రిమోట్ డయాగ్నస్టిక్స్ వంటి స్మార్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 0-80% కేవలం 1.5 గంటల్లో పూర్తవుతుంది.
దీపావళి ఆఫర్: రూ.35,000 వరకూ బెనిఫిట్స్ - రూ.20,000 డిస్కౌంట్, ₹10,000 క్యాష్‌బ్యాక్, గోల్డ్ కాయిన్, ఐఫోన్ గెలుచుకునే ఛాన్స్!
2. Revolt RV400
కమ్యూటర్ సెగ్మెంట్‌లో ప్రజాదరణ పొందిన ఈ మోడల్ ₹1.24 లక్షల నుంచి ₹1.40 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) వరకు లభిస్తుంది. 3 రైడ్ మోడ్స్ ఉన్నాయి - ఈకో (150 కి.మీ. రేంజ్), నార్మల్, స్పోర్ట్.
3.24 kWh బ్యాటరీ 0-80% ఛార్జ్ కావడానికి 3.5 గంటలు మాత్రమే పడుతుంది. LED లైట్స్, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో రగ్గ్డ్ లుక్స్‌తో కనిపిస్తుంది.
3. Ola Roadster X
ఓలా నుంచి వచ్చిన ఈ బైక్ 11 kW మోటర్‌తో దూసుకెళ్తుంది. X+ వేరియంట్ టాప్ స్పీడ్ 125 kmph, రేంజ్ గరిష్ఠంగా 501 కి.మీ.
7 అంగుళాల టచ్ స్క్రీన్, బ్రేక్-బై-వైర్ సిస్టమ్, జియోఫెన్సింగ్, OTA అప్‌డేట్స్‌తో సూపర్ ఫీచర్లు అందిస్తుంది. రైడ్ మోడ్స్ - ఈకో, నార్మల్, స్పోర్ట్స్.
4. Matter Aera
ఇది దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. 10 kW మోటర్, 4 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, 5 kWh బ్యాటరీతో 125 కి.మీ. రేంజ్ ఇస్తుంది.
₹1.73 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉన్న ఈ బైక్.. 7 అంగుళాల టచ్ స్క్రీన్, స్మార్ట్ పార్క్ అసిస్ట్, కీ లెస్ ఎంట్రీ వంటి టెక్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
5. PURE EV EcoDryft
ఈ బైక్ సిటీ రైడర్లకు పర్ఫెక్ట్. ధర ₹99,999 (సబ్సిడీతో) నుంచి ₹1.15 లక్షల వరకు ఉంటుంది.
3.0 kWh బ్యాటరీ ఉంది. 3 kW మోటర్‌తో ఈ ఈవీ 130 కి.మీ. రైడింగ్ రేంజ్ ఇస్తుంది. గంటకు 75 km టాప్ స్పీడ్‌తో పరుగులు తీస్తుంది.
డిజిటల్ డాష్, రీజనరేటివ్ బ్రేకింగ్, మూడు రైడ్ మోడ్స్ (డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్) ఉన్నాయి, ఇవన్నీ ఈ బైక్‌ని ప్రాక్టికల్‌గా మార్చాయి.
ఈ దీపావళి ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటే, Oben Rorr EZ Sigma అత్యుత్తమ ఆల్ రౌండర్. లాంగ్ రేంజ్, కంఫర్ట్, స్మార్ట్ ఫీచర్లు అన్నీ కలిపిన “ఫెస్టివల్ హిట్” బైక్ ఇదే!.





















