అన్వేషించండి

సేల్స్‌లో TVS iQube సెన్సేషన్‌ - 8 లక్షల అమ్మకాలను దాటిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

TVS iQube ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇండియాలో 8 లక్షల విక్రయాల మైలురాయిని దాటింది. FY2026లోనే 3 లక్షల సేల్స్‌ సాధించే దిశగా iQube దూసుకెళ్తోంది.

TVS iQube Sales Price And Features: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సెగ్మెంట్‌లో, TVS iQube మరో కీలక మైలురాయిని దాటింది. దేశీయ మార్కెట్‌లో ఈ స్కూటర్‌ 8 లక్షల హోల్‌సేల్‌ విక్రయాల మార్క్‌ను విజయవంతంగా చేరుకుంది. ఇది TVS Motor Companyకి మాత్రమే కాదు, మొత్తం ఎలక్ట్రిక్‌ టూ-వీలర్‌ పరిశ్రమకే ఒక పెద్ద విజయంగా చెప్పొచ్చు.

TVS విడుదల చేసిన గణాంకాల ప్రకారం, డిసెంబర్‌ 2025 చివరి నాటికి iQube మొత్తం హోల్‌సేల్స్‌ 8 లక్షలు దాటాయి. ఒక్క డిసెంబర్‌ నెలలోనే TVS 35,177 యూనిట్లు డిస్పాచ్‌ చేసింది. ఇదే కాకుండా, వరుసగా నాలుగు నెలల పాటు ప్రతి నెలా 30,000 యూనిట్లకు పైగా iQube హోల్‌సేల్స్‌ నమోదవ్వడం మరో విశేషం.

నెమ్మదిగా మొదలై... ఇప్పుడు స్పీడ్‌

TVS iQube జనవరి 2020లో మార్కెట్‌లోకి వచ్చింది. మొదటి 1 లక్ష యూనిట్ల విక్రయాలకు మూడు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. తదుపరి 1 లక్ష యూనిట్లు కేవలం 10 నెలల్లోనే అమ్ముడయ్యాయి. 2024 ఏప్రిల్‌లో, లాంచ్‌ అయిన 52 నెలల తర్వాత iQube 3 లక్షల హోల్‌సేల్స్‌ మార్క్‌ను దాటింది.

అక్కడి నుంచి ఈ బండి నిజమైన దూకుడు మొదలైంది. 3 లక్షల నుంచి 7 లక్షల యూనిట్ల వరకు చేరడానికి కేవలం 17 నెలలు మాత్రమే పట్టింది. ఇక 7 లక్షల నుంచి 8 లక్షల వరకు వెళ్లేందుకు మాత్రం కేవలం మూడు నెలలే సరిపోవడం iQube క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. మొత్తం మీద ఆరు సంవత్సరాలు అంటే 72 నెలల్లో ఈ స్కూటర్‌ 8 లక్షల మైలురాయిని చేరుకుంది.

TVS స్కూటర్‌ బిజినెస్‌కు పెద్ద బలం

FY2025లో TVS మొత్తం స్కూటర్‌ బిజినెస్‌ అద్భుతమైన ప్రదర్శన చూపించింది. Jupiter, NTorq, Zest వంటి పెట్రోల్‌ స్కూటర్లతో పాటు iQube కలిసి 18.13 లక్షల యూనిట్ల హోల్‌సేల్స్‌ సాధించింది. ఇది, గత ఏడాదితో పోలిస్తే (YoY) 25 శాతం వృద్ధి. దీంతో భారత్‌ స్కూటర్‌ మార్కెట్‌లో TVS వాటా 26 శాతానికి చేరింది.

ఈ మొత్తంలో TVS iQube ఒక్కటే 2.73 లక్షల యూనిట్లు సేల్స్‌తో కంపెనీ మొత్తం స్కూటర్‌ సేల్స్‌లో 15 శాతం వాటా సాధించింది. 

2025 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో TVS 2.53 లక్షల iQube యూనిట్లు డిస్పాచ్‌ చేసింది. ఇది YoYలో 28 శాతం ఎక్కువ.

రిటైల్‌ సేల్స్‌ కూడా బలంగానే

హోల్‌సేల్స్‌... ఫ్యాక్టరీ నుంచి డీలర్లకు వెళ్లిన యూనిట్లను చూపిస్తే, రిటైల్‌ సేల్స్‌... నేరుగా వినియోగదారుల డిమాండ్‌ను తెలియజేస్తాయి. వాహన్‌ డేటా ప్రకారం, జనవరి 2020 నుంచి 2026 జనవరి 24 వరకు iQube రిటైల్‌ సేల్స్‌ 7.65 లక్షల యూనిట్లకు చేరాయి. అదే సమయంలో లాంచ్‌ అయిన Bajaj Chetak రిటైల్‌ సేల్స్‌ 5.85 లక్షల యూనిట్ల వద్దే నిలిచాయి.

2025 క్యాలెండర్‌ ఇయర్‌ iQubeకి ఇప్పటి వరకు బెస్ట్‌ ఇయర్‌గా నిలిచింది. ఈ ఏడాది మొత్తం 2.99 లక్షల యూనిట్లు రిటైల్‌గా అమ్ముడయ్యాయి. కేవలం 863 యూనిట్ల తేడాతో 3 లక్షల మార్క్‌ను మిస్‌ అయ్యింది.

FY2026లో మరో రికార్డు ఖాయం?

FY2026లో iQube ఇప్పటివరకు తొమ్మిది నెలల్లోనే 2.53 లక్షల హోల్‌సేల్స్‌ సాధించింది. ఇది FY2025 మొత్తం సేల్స్‌కు చాలా దగ్గరగా ఉంది. నాల్గవ త్రైమాసికం ఇంకా మిగిలి ఉండటంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల హోల్‌సేల్స్‌ దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అలా జరిగితే మొత్తం iQube సేల్స్‌ 9 లక్షలు దాటే అవకాశం ఉంది.

ధర తగ్గింపుది కీలక పాత్ర

ఇటీవలి డిమాండ్‌ పెరుగుదల వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి రూ. 26,000 వరకు ధర తగ్గింపు. GST మార్పుల వల్ల ఈ అవకాశం వచ్చింది. అలాగే అన్ని వేరియంట్లలో బ్యాటరీ సామర్థ్యం పెంచడం కూడా కొనుగోలుదారులను ఆకర్షించింది.

మొత్తానికి, TVS iQube ఇప్పుడు కేవలం ఒక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మాత్రమే కాదు... భారత్‌లో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మార్పునకు సింబల్‌గా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget