Apache RTR 160: ఫుల్ ట్యాంక్‌తో 540 km రేంజ్ - టీవీఎస్ అపాచీ RTR 160ని లోన్‌పై కొంటే EMI ఎంత చెల్లించాలి?
TVS Apache RTR 160 2V: ఈ బైక్ 159cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ నుంచి పవర్ తీసుకుంటుంది, ఇది గరిష్టంగా 15.3 bhp పవర్‌ను & 13.9 Nm గరిష్ట టార్క్‌ను ఇస్తుంది.

TVS Apache RTR 160 Price, Down Payment, Loan and EMI Details: యువతరం పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ మార్కెట్లో స్పోర్ట్స్ బైక్‌లకు గిరాకీ ఎక్కువ. TVS కంపెనీ, Apache RTR ను వివిధ సెగ్మెంట్లలో విక్రయిస్తోంది. మీకు, కాస్త తక్కువ ధరలో Apache బైక్ కావాలనుకుంటే, RTR 160 2V మోడల్‌ను ఒకసారి పరిశీలించవచ్చు. పైగా, ఈ బండిని కొనడానికి బ్యాంక్ మీకు లోన్ కూడా ఇస్తుంది. TVS Apache RTR 160 2V బైక్ స్పోర్టీ లుక్స్ ఇస్తుంది & శక్తిమంతమైన ఇంజిన్‌ను దీనికి బిగించారు.
హైదరాబాద్/ విజయవాడలో Apache RTR 160 ధర
హైదరాబాద్/ విజయవాడలో ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (TVS Apache RTR 160 2V ex-showroom price) 1.11 లక్షల రూపాయలు. ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో దాదాపు రూ. 1.41 లక్షలు కాగా; విజయవాడలో దాదాపు రూ. 1.40 లక్షలు. ఆన్-రోడ్ ధరలో RTO ఛార్జీలు, బీమా & ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి.
మీ దగ్గర రూ.20 వేలు ఉంటే ఈ బైక్ మీదే
మీ దగ్గర రూ. 20,000 వేలు ఉంటే, పవర్‌ఫుల్ TVS Apache RTR 160 2V బైక్‌కు ఓనర్ కావచ్చు. మీ దగ్గరలోని టీవీఎస్ షోరూమ్‌కు వెళ్లి, ఈ టీవీఎస్ బైక్‌ను ఎంపిక చేసుకుని, మీ దగ్గర ఉన్న రూ. 20,000 ను డౌన్ పేమెంట్ చేయాలి. షోరూమ్‌లోనే ఉండే బ్యాంక్ ప్రతినిధులు, మిగిలిన 1.21 లక్షలను బ్యాంక్ నుంచి రుణంగా ఇప్పిస్తారు. బ్యాంక్, ఈ లోన్‌ను 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో జారీ చేసిందని అనుకుందాం. ఇప్పుడు, మీకు సరిపోయే ఈజీ EMI ప్లాన్ చూద్దాం.
ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?
4 సంవత్సరాల (48 నెలలు) కాలానికి ఈ బైక్ లోన్ తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 3,440 EMI చెల్లించాలి. ఈ 48 నెలల్లో చెల్లించే మొత్తం వడ్డీ రూ. 43,715 అవుతుంది.
3 సంవత్సరాల్లో (36 నెలలు) బైక్ లోన్ తీర్చేయాలనుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 4,283 EMI చెల్లించాలి. ఈ 36 నెలల్లో చెల్లించే మొత్తం వడ్డీ రూ. 32,783 అవుతుంది.
2 సంవత్సరాల (24 నెలలు) లోన్ టెన్యూర్ ఎంచుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 5,969 EMI చెల్లించాలి. ఈ 24 నెలల్లో చెల్లించే మొత్తం వడ్డీ రూ. 21,851 అవుతుంది.
1 సంవత్సరంలోనే (12 నెలలు) బైక్ లోన్ క్లియర్ చేయాలనుకుంటే, మీరు ప్రతి నెలా రూ . 11,028 EMI చెల్లించాలి. ఈ 12 నెలల్లో చెల్లించే మొత్తం వడ్డీ రూ. 10,931 అవుతుంది.
మీ బడ్జెట్, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా, మీకు సరిపోయే EMI ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. బ్యాంక్ ఇచ్చే లోన్, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
అపాచీ RTR 160 ఫీచర్లు
అపాచీ RTR 160 బైక్‌లో పవర్‌ఫుల్ 159cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఈ ఇంజిన్ 15.3 bhp మాక్స్ పవర్ & 13.9 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. భారతీయ మార్కెట్లో, TVS Apache RTR 160 కు గట్టి పోటీ ఉంది, ఈ బైక్ - Bajaj Pulsar NS 160, Yamaha YZF R15 V3 & Suzuki Gixxer SF వంటి మోటార్‌సైకిళ్లతో పోటీ పడుతుంది.
ఈ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది?
అపాచీ RTR 160 బైక్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో అమ్ముడవుతోంది. కంపెనీ ప్రకారం, ఈ బైక్ లీటరుకు దాదాపు 45 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఫుల్ ట్యాంక్ చేస్తే ఈ మోటార్ సైకిల్ 540 కి.మీ. దూరం ప్రయాణించగలదు.





















