థ్రిల్లింగ్ రైడ్ కోసం Triumph Speed T4 - యూత్‌కి తెలియాల్సిన 6 కీలక విషయాలు
Triumph Speed T4 ఇప్పుడు మరింత తక్కువ ధరలో లభిస్తోంది. ఇంజిన్, మైలేజ్, ధర, ఫీచర్లు, కలర్ ఆప్షన్లు & కొత్త GST 2.0 ప్రభావం గురించి తెలుసుకోండి.

Triumph Speed T4 vs Triumph Speed 400 Comparison: ట్రయంఫ్ స్పీడ్ 400 తర్వాత, ఇప్పుడు, మరింత తక్కువ ధరలో లభించే బైక్‌గా ట్రయంఫ్ స్పీడ్ T4 వచ్చేసింది. లుక్, బిల్డ్ & పెర్ఫార్మెన్స్ పరంగా ఇది Speed 400తో పోల్చదగినదే అయినా, ఇంజిన్ ట్యూనింగ్ కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. అందుకే ఇది కొత్త బైక్ రైడర్లకు, అలాగే డైలీ రైడింగ్ చేసే వారికి పర్ఫెక్ట్ చాయిస్.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
Triumph Speed T4 లో కూడా Speed 400 లో ఉన్న అదే 398.15 సీసీ ఇంజిన్ ఉంటుంది. కానీ, ఇందులో 31 హెచ్‌పీ పవర్, 36 ఎన్‌ఎం టార్క్ మాత్రమే ఇస్తుంది - అంటే 400తో పోలిస్తే 9 హెచ్‌పీ, 1.5 ఎన్‌ఎం తక్కువ. అయితే టార్క్ 5,000 ఆర్‌పీఎమ్‌లోనే వస్తుంది కాబట్టి, ఈ బైక్ స్మూత్‌గా & బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మైలేజ్ కూడా గణనీయంగా మెరుగ్గా ఉంటుంది.
మైలేజ్ & రేంజ్
400సీసీ బైక్‌లలో స్పీడ్ T4 మైలేజ్ విషయంలో టాప్‌లో ఉంటుంది. నగరంలో 32.15 కి.మీ./లీటర్, హైవేపై 38.86 కి.మీ./లీటర్ ఇస్తుంది. 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ వల్ల మొత్తం రేంజ్ దాదాపు 430 కి.మీ. వరకూ ఉంటుంది - లాంగ్ డ్రైవ్ కోసం కూడా సూపర్.
సీట్ హైట్ & వెయిట్
T4 సీట్ హైట్ 806 మి.మీ. కాస్త తక్కువ హైట్ ఉన్న రైడర్లు కూడా ఈ బైక్‌ను సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. 180 కిలోల కర్బ్ వెయిట్‌తో ఇది లైట్‌గా బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. కొత్తగా బైక్ నేర్చుకునే వారికి ఇది చాలా ఫ్రెండ్లీ ఆప్షన్.
Speed 400తో పోలిస్తే మార్పులు
స్పీడ్ 400లో ఉన్న USD ఫోర్క్ బదులు, T4లో సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంది. అలాగే 400లో ఉన్న రైడ్-బై-వైర్ సిస్టమ్ లేదు, కాబట్టి ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉండదు. బ్రేక్ పాడ్లు కూడా సాధారణ ఆర్గానిక్ టైప్‌లో ఉంటాయి. కానీ రైడింగ్ క్వాలిటీ మాత్రం చాలా స్మూత్‌గా ఉంటుంది.
కలర్ ఆప్షన్లు
ట్రయంఫ్ స్పీడ్ T4 ఐదు డ్యూయల్ టోన్ కలర్లలో లభిస్తుంది, అవి:
లావా రెడ్ గ్లాస్ / పెర్ల్ మెటాలిక్ వైట్
క్యాస్పియన్ బ్లూ / పెర్ల్ మెటాలిక్ వైట్
బాజా ఆరెంజ్
ఫాంటమ్ బ్లాక్ / పెర్ల్ మెటాలిక్ వైట్
ఫాంటమ్ బ్లాక్ / స్టార్మ్ గ్రే
ఈ రంగుల కాంబినేషన్లు స్పోర్టీగా, అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి.
ధర & GST 2.0 ప్రభావం
GST 2.0 ప్రభావం వల్ల 350 సీసీ కంటే ఎక్కువ మోటార్ సైకిళ్ల ధరలు పెరగాల్సి ఉన్నా, ట్రయంఫ్ కంపెనీ ఆ అదనపు బరువును కస్టమర్లపై వేయలేదు. అదీ కాక, ఫెస్టివ్ సీజన్ ముందు ధరను తగ్గించింది కూడా. ఇప్పుడు స్పీడ్ T4 ఎక్స్-షోరూమ్ ధర ₹1.93 లక్షలు మాత్రమే. ఈ ధరకు ఇంత పనితీరు, బ్రాండ్ విలువ రావడం ఒక మంచి బహుమతి లాంటింది.
ట్రయంఫ్ స్పీడ్ T4... సింపుల్ లుక్, బలమైన ఇంజిన్, అద్భుతమైన మైలేజ్ కలిగిన బైక్. కొత్త రైడర్లు, డైలీ యూజర్లు, ట్రయంఫ్ బ్రాండ్ ఫీలింగ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. ₹1.93 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ఇది నిజంగా వాల్యూ డీల్.





















