Toyota Maruti SUV: క్రెటాను కొట్టేయడానికి వస్తున్నారు - కలసి పనిచేస్తున్న మారుతి, టొయోటా!

హ్యుండాయ్ క్రెటాకు పోటీగా ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి మారుతి, టొయోటా కలిసి పనిచేస్తున్నాయి.

FOLLOW US: 

Toyota: టొయోటా ఎట్టకేలకు మనదేశంలో కొత్త ఉత్పత్తులు లాంచ్ చేస్తోంది. దానికి మారుతి కూడా తన వంతు సాయం చేస్తుంది. ఈ రెండు కంపెనీలు కలిసి ఇప్పుడు హ్యుండాయ్ క్రెటాను చాలెంజ్ చేసే వాహనంపై దృష్టిపెడుతున్నాయి. వీటిలో మారుతి వెర్షన్ ముందు, టొయోటా వెర్షన్ తర్వాత లాంచ్ కానున్నాయి.

ఈ కొత్త ఎస్‌యూవీలు హ్యుండాయ్ క్రెటా, ఫోక్స్‌వాగన్ టైగున్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్‌లతో పోటీ పడే అవకాశం ఉంది. సైజు పరంగా చూస్తే మారుతి/టొయోటా ఎస్‌యూవీ క్రెటాను మ్యాచ్ చేసేలా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి ఫ్లాగ్ షిప్ కారు ఎస్-క్రాస్‌ను ఈ కొత్త ఎస్‌యూవీ రీప్లేస్ చేయనుంది.

ఈ రెండు ఎస్‌యూవీల ఎక్స్‌టీరియర్ డిజైన్ పూర్తిగా వేర్వేరుగా ఉండనున్నాయి. టొయోటాలో మరింత అగ్రెసివ్ డిజైన్ ఉండనుంది. స్టైలింగ్ పరంగా చూసుకుంటే... ఈ ఎస్‌యూవీల లుక్ చాలా బాగుంది. రెండిటినీ ప్రత్యేకంగా రూపొందించారు.

ఈ రెండిట్లోనూ 16 నుంచి 17 ఇంచుల మధ్యలో ఉండే అలోయ్ వీల్స్‌ను అందించారు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్ ఇందులో కూడా ఉన్నాయి. డీఆర్ఎల్ సిగ్నేచర్లలో కూడా రెండిట్లోనూ తేడాలు ఉన్నాయి. వీటి ఇంటీరియర్ కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా వీటిలో ఉండనున్నాయి.

ఈ రెండు ఎస్‌యూవీల్లోనూ లేటెస్ట్ ఇన్‌ఫోటెయిన్‌‌మెంట్ సిస్టం అందించారు. బలెనో తరహా ఇన్‌ఫోటెయిన్‌‌మెంట్ సిస్టమే ఇందులో కూడా ఉంది. దీంతోపాటు వీటిలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీల కెమెరా కూడా ఉండనుంది. ఈ రెండిట్లోనూ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు. వీటిలో కొత్త తరహా గేర్ బాక్స్ కూడా ఉండనుందని తెలుస్తోంది.

దీంతోపాటు వీటిలో హైబ్రిడ్ వెర్షన్ కూడా లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హైబ్రిడ్ వెర్షన్ ఎక్కువ మైలేజ్‌ను అందించనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి వీటిలో ఎలక్ట్రిక్ వెర్షన్లు లాంచ్ కావడం లేదు. 2023లో ఇవి మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. దానికి ముందు కొత్త అర్బన్ క్రూజర్ లేదా బ్రెజా రానుందని తెలుస్తోంది.

Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!

Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!

Published at : 14 Mar 2022 08:34 PM (IST) Tags: Toyota Maruti Toyota New SUV Maruti New SUV New Hybrid SUV

సంబంధిత కథనాలు

Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?

Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?

Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!

Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!

Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?

Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?

New Range Rover Sport Price: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రివీల్ చేసిన కంపెనీ - రేటు మాత్రం అమ్మ బాబోయ్!

New Range Rover Sport Price: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రివీల్ చేసిన కంపెనీ - రేటు మాత్రం అమ్మ బాబోయ్!

Tata Ace EV: డెలివరీ వ్యాపారులకు గుడ్‌న్యూస్ - టాటా ఏస్ ఈవీ వచ్చేసింది - సింగిల్ చార్జ్‌కు ఎన్ని కిలోమీటర్లు రానుందంటే?

Tata Ace EV: డెలివరీ వ్యాపారులకు గుడ్‌న్యూస్ - టాటా ఏస్ ఈవీ వచ్చేసింది - సింగిల్ చార్జ్‌కు ఎన్ని కిలోమీటర్లు రానుందంటే?

టాప్ స్టోరీస్

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !