Toyota Hilux: టొయోటా కొత్త వాహనం వచ్చేస్తుంది.. ఆ ఇంజిన్ మాత్రమే!
ప్రముఖ కార్ల బ్రాండ్ టొయోటా మనదేశంలో కొత్త వాహనాన్ని లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అదే టొయోటా హైలక్స్.

టొయోటా మనదేశంలో కొత్త పికప్ ట్రక్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అదే టొయోటా హైలక్స్ పికప్ ట్రక్. దీని టాప్ ఎండ్ వెర్షన్లు మనదేశంలో రూ.35 లక్షల రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే రేంజ్‌లో ఉన్న ఫార్ట్యూనర్ ధర మనదేశంలో రూ.40 లక్షల వరకు ఉంది.
అయితే ఫార్ట్యూనర్‌లా కాకుండా హైలక్స్ కేవలం 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ కానుంది. ఇందులో తక్కువ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. దీన్ని ఆఫ్ రోడింగ్‌కు ఉపయోగపడేలా రూపొందించారు. హైలక్స్ మనదేశంలో డబుల్ క్యాబ్ కాన్పిగరేషన్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ కారు పేలోడ్ దాదాపు ఒక టన్ను వరకు ఉండటం విశేషం. టచ్ స్క్రీన్, జేబీఎల్ ప్రీమియం ఆడియో సిస్టం, క్రూజ్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 18 అంగుళాల అలోయ్స్, 7 ఎయిర్ బ్యాగ్స్, లెదర్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
అన్ని ఫీచర్లు ఉన్న ప్రీమియం ప్రొడక్ట్ ఇదే. దీని 2.8 లీటర్ల డీజిల్ ఇంజిన్‌లో 6-స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంది. తక్కువ ధరలో ఫార్ట్యూనర్ వంటి కారు కావాలనుకుంటే హైలక్స్ మంచి ఆప్షన్. ఆఫ్ రోడ్ కార్లు ఇష్టపడే వారికి కూడా ఇది బాగా నచ్చుతుంది.
ఫార్ట్యూనర్, ఇన్నోవాలలోని ప్లాట్‌ఫాంనే ఇందులో కూడా అందించారు. దీంతోపాటు హైలక్స్‌లో ఇంకా పర్సనలైజేషన్ చేసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?





















